లెనోవో కొత్త ప్రొడక్ట్స్

|

బెర్లిన్ నగరంలో ప్రారంభమైన ఐఎఫ్ఏ 2015 టెక్నాలజీ ఎగ్జిబిషన్‌ సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలతో హోరెత్తుతోంది. ఈ ప్రదర్శనను పురస్కరించుకని చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ ఉత్పత్తుల కంపెనీ లెనోవో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్‌లు, హైబ్రీడ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఐఎఫ్ఏ 2015 వేదికగా లెనోవో ప్రకటించిన సరికొత్త డివైస్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు.

Read More : ఆ మృతదేహం ఏలియన్‌దేనా..?

ఐఎఫ్ఏ 2015 ఈవెంట్‌లో లెనోవో ఆవిష్కరించిన కొత్త గాడ్జెట్స్

ఐఎఫ్ఏ 2015 ఈవెంట్‌లో లెనోవో ఆవిష్కరించిన కొత్త గాడ్జెట్స్

లెనోవో వైబ్ ఎస్1

ఐఎఫ్ఏ 2015 వేదికగా లెనోవో ఆవిష్కరించిన లెనోవో వైబ్ ఎస్1 స్మార్ట్‌ఫోన్ బెస్ట్ కెమెరా ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ ముందు భాగంలో రెండు ఫ్రంట్ ఫేసింగ్ (8 మెగా పిక్సల్, 2 మెగా పిక్సల్) కెమెరాలను ఏర్పాటు చేయటం విశేషం. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా ఆటో ఫోకస్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.

ఐఎఫ్ఏ 2015 ఈవెంట్‌లో లెనోవో ఆవిష్కరించిన కొత్త గాడ్జెట్స్

ఐఎఫ్ఏ 2015 ఈవెంట్‌లో లెనోవో ఆవిష్కరించిన కొత్త గాడ్జెట్స్

లెనోవో వైబ్ పీ1, పీ1ఎమ్

ఐఎఫ్ఏ 2015 వేదికగా లెనోవో రెండు శక్తివంతమైన వైబ్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌ను ఆవిష్కరించింది. శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో ఈ ఫోన్‌లు వస్తున్నాయి. వైబ్ పీ1 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండగా, వైబ్ పీ1ఎమ్ 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

ఐఎఫ్ఏ 2015 ఈవెంట్‌లో లెనోవో ఆవిష్కరించిన కొత్త గాడ్జెట్స్
 
ఐఎఫ్ఏ 2015 ఈవెంట్‌లో లెనోవో ఆవిష్కరించిన కొత్త గాడ్జెట్స్

లెనోవో ఫాబ్, ఫాబ్ ప్లస్

ఐఎఫ్ఏ 2015 వేదికగా లెనోవో రెండు సరికొత్త ఫాబ్లెట్‌లను ఆవిష్కరించింది. ఈ రెండు డివైస్‌లు 6.8 అంగుళాల హైడెఫినిషన్ డిస్‍‌ప్లేలను కలిగి ఉంటాయి. ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ వంటి శక్తివంతమైన ఫీచర్లను ఈ డివైస్‌లలో నిక్షిప్తం చేసారు.

ఐఎఫ్ఏ 2015 ఈవెంట్‌లో లెనోవో ఆవిష్కరించిన కొత్త గాడ్జెట్స్

ఐఎఫ్ఏ 2015 ఈవెంట్‌లో లెనోవో ఆవిష్కరించిన కొత్త గాడ్జెట్స్

లెనోవో యోగా టాబ్ 3 ప్రో

ఐఎఫ్ఏ 2015 వేదికగా లెనోవో తన యోగా సిరీస్ నుంచి రెండు టాబ్లెట్ లను విడుదల చేసింది. వీటి పేర్లు యోగా టాబ్ 3 ప్రో, యోటా టాబ్ 3. 70 అంగుళాల ఇన్-బుల్ట్ ప్రొజెక్టర్‌తో ఇవి లభ్యమవుతున్నాయి.

ఐఎఫ్ఏ 2015 ఈవెంట్‌లో లెనోవో ఆవిష్కరించిన కొత్త గాడ్జెట్స్

ఐఎఫ్ఏ 2015 ఈవెంట్‌లో లెనోవో ఆవిష్కరించిన కొత్త గాడ్జెట్స్

మోటో 360 స్పోర్ట్

ఐఎఫ్ఏ 2015 వేదికగా లెనోవో తాను ఇటీవల కొనుగోలు చేసిన మోటరోలా నుంచి మోటో 360 స్మార్ట్‌వాచ్‌ను ప్రదర్శించింది. కొత్త జనరేషన్ మోటో 360 స్మార్ట్‌వాచ్‌లు రెండు సైజుల్లో (46ఎమ్ఎమ్, 42ఎమ్ఎమ్) అందుబాటులో ఉంటాయి.

ఐఎఫ్ఏ 2015 ఈవెంట్‌లో లెనోవో ఆవిష్కరించిన కొత్త గాడ్జెట్స్

ఐఎఫ్ఏ 2015 ఈవెంట్‌లో లెనోవో ఆవిష్కరించిన కొత్త గాడ్జెట్స్

లెనోవో ఐడియాప్యాడ్ 100ఎస్

ఐఎఫ్ఏ 2015 వేదికగా లెనోవో ఐడియాప్యాడ్ 100ఎస్ పేరుతో నోట్‌బుక్‌ను విడుదల చేసింది. ఈ ల్యాపీ రెండు (11.6, 14 అంగుళాల) వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 11.6 అంగుళాల మోడల్ ఇంటెల్ ఆటమ్ జెడ్3735ఎఫ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ తోనూ, 14 అంగుళాల మోడల్ డ్యుయల్ కోర్ సెలిరాన్ ఎన్3050 ప్రాసెసర్ తోనూ లభ్యమవుతాయి.

ఐఎఫ్ఏ 2015 ఈవెంట్‌లో లెనోవో ఆవిష్కరించిన కొత్త గాడ్జెట్స్

ఐఎఫ్ఏ 2015 ఈవెంట్‌లో లెనోవో ఆవిష్కరించిన కొత్త గాడ్జెట్స్

లెనోవో క్రోమ్‌బుక్ 100ఎస్

ఐఎఫ్ఏ 2015 వేదికగా లెనోవో క్రోమ్‌బుక్ 100ఎస్‌ను ప్రదర్శించింది. 11.6 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వచ్చే ఈ క్రోమ్‌బుక్ 2.6లాబ్స్ బరువును కలిగి ఉంటుంది. ఇంటెల్ బేట్రెయిల్-ఎమ్ ప్రాసెసర్‌ను డివైస్‌లో ఇన్-బుల్ట్ చేసారు.

ఐఎఫ్ఏ 2015 ఈవెంట్‌లో లెనోవో ఆవిష్కరించిన కొత్త గాడ్జెట్స్

ఐఎఫ్ఏ 2015 ఈవెంట్‌లో లెనోవో ఆవిష్కరించిన కొత్త గాడ్జెట్స్

లెనోవో థింక్‌ప్యాడ్ యోగా 260

ఐఎఫ్ఏ 2015 వేదికగా లెనోవో థింక్‌ప్యాడ్ యోగా 260, 460 వేరియంట్ లలో రెండు ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. యోగా 260 వేరియంట్ 12 అంగుళాల డిస్‌ప్లేతోనూ, 14 అంగుళాల వేరియంట్ 14 అంగుళాల డిస్‌ప్లేతోనూ లభ్యమవుతాయి.

ఐఎఫ్ఏ 2015 ఈవెంట్‌లో లెనోవో ఆవిష్కరించిన కొత్త గాడ్జెట్స్

ఐఎఫ్ఏ 2015 ఈవెంట్‌లో లెనోవో ఆవిష్కరించిన కొత్త గాడ్జెట్స్

లెనోవో థింక్‌ప్యాడ్ యోగా 460

మోడ్రన్ డే యూజర్లతో పాటు గ్రాఫిక్ డిజైనర్‌లకు ఈ ల్యాప్‌టాప్ మరింతగా ఉపయోగపడుతుంది.

ఐఎఫ్ఏ 2015 ఈవెంట్‌లో లెనోవో ఆవిష్కరించిన కొత్త గాడ్జెట్స్

ఐఎఫ్ఏ 2015 ఈవెంట్‌లో లెనోవో ఆవిష్కరించిన కొత్త గాడ్జెట్స్

లెనోవో ఐడియాప్యాడ్ మిక్స్ 700 టాబ్లెట్

ఐఎఫ్ఏ 2015ను పురస్కరించుకుని లెనోవో ఆవిష్కరించిన ఐడియాప్యాడ్ మిక్స్ 700 టాబ్లెట్, మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ప్రో టాబ్లెట్‌కు డైరెక్ట్ కాంపిటీటర్‌గా నిలిచింది. 12 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ టాబ్లెట్ 6వ తరం ఇంటెల్ కోర్ ఎం7 ప్రాసెసర్‌తో పాటు ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్ కార్డ్‌ను కలిగి ఉంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైస్ రన్ అవుతుంది.

Best Mobiles in India

English summary
Lenovo At IFA 2015: Top 10 Gadgets Announced In Berlin. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X