టాటాకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఎల్‌జీ

వివాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న టాటా గ్రూప్ కు మరో షాక్

By Hazarath
|

దేశంలో అత్యంత ఆకర్షణీయమైన బ్రాండ్ల జాబితాలో టాటా గ్రూపుకు ఎదురుదెబ్బ తగిలింది.ఈ ఏడాదికి రూపొందించిన ఈ జాబితాలో టాటా ర్యాంక్ ఏకంగా ఏడో స్థానానికి పడిపోయింది. దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ (టీఆర్ఏ) నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. 2014 లో ఐదో స్థానంలో ఉన్న టాటా..ఆ మరుసటి ఏడాది నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇప్పుడు ఏకంగా ఏడో స్థానంలోకి దిగజారింది.

ఈ ఫోన్లకు వాట్సప్ షాకిచ్చింది, డిసెంబర్ 31 వరకే లాస్ట్

టాటా గ్రూప్ కు మరో షాక్

టాటా గ్రూప్ కు మరో షాక్

ఈ మధ్య వివాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న టాటా గ్రూప్ కు మరో షాక్ తగిలింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన టాటా ఉత్పత్తుల బ్రాండ్ స్థాయి తగ్గుతున్నట్లు ఒక సర్వే తేల్చింది. వివాదాలే కొంపముంచాయని తేల్చి చెప్పింది.

దక్షిణ కొరియా దిగ్గజం ఎల్‌జీ

దక్షిణ కొరియా దిగ్గజం ఎల్‌జీ

ఈ స్థానాన్ని ఇప్పుడు దక్షిణ కొరియా దిగ్గజం ఎల్‌జీ ఆక్రమించింది. దేశంలోనే టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లింది.

రెండవ స్థానంలో సోనీ

రెండవ స్థానంలో సోనీ

ఇక రెండవ స్థానంలో సోనీ నిలిచింది. సోనికి ఇండియాలో ఆదరణ పెరుగుతుందని తెలుస్తోంది. సోనీ ఉత్పత్తులపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని సర్వే తేల్చి చెప్పింది.

మూడవ స్థానంలో శాంసంగ్
 

మూడవ స్థానంలో శాంసంగ్

ఇక మూడవ స్థానంలో శాంసంగ్ నిలిచింది. గెలాక్సి 7 పేళుళ్ల దెబ్బకి బిత్తరపోయిన శాంసంగ్ కష్టమర్లలో కొంచెం నమ్మకం కోల్పోయిందని సర్వే చెప్పింది. ఎప్పటికైనా పుంజుకునే అవకాశం ఉందని చెప్పింది.

టాప్ 5లో విదేశీ కంపెనీల ఆధిపత్యమే

టాప్ 5లో విదేశీ కంపెనీల ఆధిపత్యమే

ఆ తరువాతి స్థానాల్లో హోండా నిలిచింది. అయితే షాకింగ్ ఏంటంటే టాప్ 5లో విదేశీ కంపెనీల ఆధిపత్యమే నడుస్తోంది.

ఎయిర్టెల్, నోకియాలు 9, 10 స్థానాల్లో

ఎయిర్టెల్, నోకియాలు 9, 10 స్థానాల్లో

దేశీ దిగ్గజాలైన బజాజ్, టాటా, మారుతీ బ్రాండ్లు వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలవగా ఎయిర్టెల్, నోకియాలు 9, 10 స్థానాల్లో నిలిచాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
LG Tops List Of India's Most Attractive Brands, Tata Slips read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X