జియోపై సర్వే చెప్పిన నిజాలు

దాదాపు 85 శాతం కస్టమర్లు ఫ్రీ ఆఫర్ గడువు ముగిసినప్పటికీ జియో వాడేందుకే సిద్ధం

Written By:

జియోపై రోజుకొక సర్వే బయటకొస్తోంది. ఉచిత ఆపర్లతో దూసుకుపోతున్న జియో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్న నేపథ్యంలో కష్టమర్లు ఉచిత ఆఫర్ గడువు ముగిసినా దాన్నే వాడుతారని సర్వేలో తేలింది. ఏప్రిల్ 1 నుంచి డేటా ఛార్జీల మోతను జియో మోగించనున్న తరుణంలో కష్టమర్లు దాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నారని సర్వే చెబుతోంది. మరికొంతమంది రెండో సిమ్ గా వాడేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని సర్వే చెబుతోంది.

ఒక్కరోజులో 1400 కోట్ల మెసేజ్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్రీ ఆఫర్ గడువు ముగిసినప్పటికీ

బ్యాంకు ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ జరిపిన సర్వేలో దాదాపు 85 శాతం కస్టమర్లు ఫ్రీ ఆఫర్ గడువు ముగిసినప్పటికీ జియో వాడేందుకే సిద్ధమని పేర్కొంటున్నారు.

జియోను రెండో సిమ్‌గానే

అయితే వారిలో 67 శాతం మంది జియోను రెండో సిమ్‌గానే వాడతారని తేలింది. అదేవిధంగా 18 శాతం మొదటి సిమ్‌గా దీన్ని ఉపయోగిస్తారని సర్వే పేర్కొంది.

 

భారతీ ఎయిర్‌టెల్‌కే

అయితే అత్యంత సంతృప్తికరమైన కస్టమర్లు 97.7 శాతం మంది టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కే ఉన్నారని సర్వే తెలిపింది. కేవలం 17 శాతం మంది భారతీ ఎయిర్‌టెల్ కస్టమర్లు జియోపై ఆసక్తి చూపుతున్నారని, అది కూడా క్వాలిటీ బాగుంటేనే దీన్ని మొదటిసిమ్‌గా వాడతామని చెబుతున్నట్టు తెలిసింది.

రిలయన్స్ కమ్యూనికేషన్ లాంటి చిన్న టెల్కోలు పరిస్థితి

ఇక రిలయన్స్ కమ్యూనికేషన్ లాంటి చిన్న టెల్కోలు పరిస్థితి అధ్వానంగా ఉందని, జియోకు మరలిన ఈ కస్టమర్లు వాటిని సెకండరీ సిమ్‌గా వాడేందుకే మొగ్గుచూపుతున్నారని బ్యాంకు అమెరికా మెర్రిల్ లించ్ సర్వే పేర్కొంది.

26 శాతం యూజర్లు

మొత్తంగా 26 శాతం యూజర్లు జియోను మొదటి సిమ్‌గానే వాడుతున్నారు. ఇన్నిరోజులు జియో నెట్ స్పీడ్‌పై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఇతర టెల్కోలతో పోలిస్తే దీనికే 55 శాతం స్పీడ్ అధికమని సర్వేలో తేలింది.

44 శాతం మందే జియో స్పీడ్ తక్కువగా ఉందని

జియో స్పీడ్ వేగంగా ఉన్నప్పటికీ, అది అస్థిరంగా ఉందనితేలింది. కేవలం 44 శాతం మందే జియో స్పీడ్ తక్కువగా ఉందని అభిప్రాయ పడ్డారు. రానున్న కాలంలో దీని ప్రబావం ఎలా ఉంటుందో చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Majority of Reliance Jio users want to retain service: Study read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting