ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేస్తాం..

వేగంగా విస్తరిస్తోన్న హైబ్రీడ్ క్లౌడ్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ అందిపుచ్చుకోవాలని చంద్రబాబునాయుడుకు సత్యనాదెళ్ల సూచన.

|

ఈ-గవర్నెన్స్, సెక్యూరిటరీ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ తో కలిసి పనిచేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల తెలిపారు. దావోస్‌లో జరుగుతోన్న ప్రపంచ ఆర్దిక సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మంగళవారం భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేస్తాం..

Read More : సామ్‌సంగ్ సీఈఓ అరెస్టుకు రంగం సిద్దం

ఈ సందర్బంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వేగవంతంగా విస్తరిస్తోన్న హైబ్రీడ్ క్లౌడ్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ అందిపుచ్చుకోవాలని చంద్రబాబునాయుడుకు సూచించారు. ఈ టెక్నాలజీకి అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు మైక్రోసాఫ్ట్ సిద్దంగా ఉందని సత్యనాదెళ్ల వివరించారు.

డిజిటలైజేషన్ చేయాలని

డిజిటలైజేషన్ చేయాలని

మైక్రోసాఫ్ట్ ఈ మధ్యనే ఎంప్లాయిమెంట్ - ఓరియంటెడ్ సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ LinkedInను కొనుగోలు చేసింది. ఈ సర్వీస్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని జనాభాతో పాటు నిపుణులకు సంబంధించిన స్కిల్ ప్రొఫైల్స్‌ను డిజిటలైజేషన్ చేయాలని సత్యనాదెళ్ల చంద్రబాబుకు సూచించారు.

రియల్ టైమ్ గవర్నెన్స్‌ను తీసుకురావడానికి ..

రియల్ టైమ్ గవర్నెన్స్‌ను తీసుకురావడానికి ..

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రియల్ టైమ్ గవర్నెన్స్‌ను తీసుకురావడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను చంద్రబాబు సత్యనాదెళ్లకు వివరించారు. వచ్చే ఏడాది దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్దిక సదస్సు నాటికి ఆంధ్రప్రదేశ్ తో పాటు భారత్ లో హైబ్రీడ్ క్లౌడ్ టెక్నాలజీ వేగవంతంగా విస్తరించాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయిడు ఆకాక్షించారు.

క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి..?
 

క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి..?

మారుతున్న నాగరికతలకు అనుగుణంగా సమాచార సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్, కంప్యూటింగ్ ప్రాధాన్యతను మరింత విస్తరింపచేసింది. ఈ నేపథ్యంలో పుట్టుకొచ్చిన కాన్సెప్టే ‘క్లౌడ్ కంప్యూటింగ్'.

క్లౌడ్ అంటే మేఘం..

క్లౌడ్ అంటే మేఘం..

క్లౌడ్ అంటే మేఘం, మేఘాలు నీటిని సమీకరించి ఎక్కువ ప్రదేశంలో ఒకే సారి వర్షాలు కురిపిస్తాయో అదే తరహాలో ఒకే చోటు నుంచి కావల్సిన అప్లికేషన్‌లు ఇంకా ఆన్‌లైన్ డేటా స్టోరేజ్‌ను క్లయింట్‌లకు క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా అందిస్తారు. క్లౌడ్ కంప్యూటింగ్ సేవలకు ఏ విధమైన పరిధిలు లేవు, ఎటువంటి సర్వీసులనైనా అందిస్తుంది.

అప్లికేషన్‌లు మొదలుకుని సాఫ్ట్‌వేర్‌ల వరకు..

అప్లికేషన్‌లు మొదలుకుని సాఫ్ట్‌వేర్‌ల వరకు..

అప్లికేషన్‌లు మొదలుకుని సాఫ్ట్‌వేర్‌ల వరకు క్లౌడ్ కంప్యూటింగ్‌లో సులువుగా లభ్యమవుతాయి. క్లౌడ్ కంప్యూటింగ్ గుర్తించి క్లుప్తంగా చెప్పాలంటే ఆయా క్లౌడ్ కంప్యూటింగ్ సేవలనందించే సంస్థలు తాము ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన వెబ్ సర్వర్ల ద్వారా క్లయింట్‌కు కావల్సిన అప్లికేషన్స్ ఇంకా డేడా స్టోరేజ్‌ను అందిస్తాయి.

క్లయింట్ స్టోర్ చేసిన డేటా మొత్తం

క్లయింట్ స్టోర్ చేసిన డేటా మొత్తం

క్లౌడ్ కంప్యూటింగ్‌లో భాగంగా క్లయింట్ స్టోర్ చేసిన డేటా మొత్తం ఒక వెబ్ సర్వర్‌లో స్టోరేజ్ కాబడి ఉంటుంది. అంటే క్లయింట్ వినియోగించిన కంప్యూటర్‌లో ఏ విధమైన డేటా ఇంకా అప్లికేషన్స్ ఉండవు. కేవలం డివైస్ ఆపరేటింగ్ సిస్టం ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసును అందించే సంస్థ అప్లికేషన్ మాత్రమే ఉంటుంది.

కావాల్సిన డేటాను యాక్సెస్ చేసుకునే అవకాశం...

కావాల్సిన డేటాను యాక్సెస్ చేసుకునే అవకాశం...

క్లయింట్ ప్రతిసారీ నేరుగా క్లౌడ్ కంప్యూటింగ్‌లోకి లాగినైన క్లౌడ్ సర్వర్ల నుంచి తనుకు కావల్సి అప్లికేషన్స్ ఇంకా డేటాను యాక్సెస్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ మొత్తం విధానాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. క్లౌడ్ కంప్యూటింగ్‌ను వినియోగంచడం వల్ల సాఫ్ట్‌వేర్, క్రాష్, డేటా‌లాస్ వంటి ప్రమాదాలు ఉండవు. అంతేకాదు, క్లయింట్ వినియోగించే డివైస్ కూడా వేగవంతంగా పని చేస్తుంది.

Best Mobiles in India

English summary
Microsoft announces e-governance partnership with Andhra Pradesh government. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X