పిల్లలు మాట వినలేదని ఐ ఫోన్‌ని తుక్కు తుక్కు చేసింది

By Hazarath
|

అత్యంత ఖరీదైన ఆపిల్ ఐ ఫోన్ ఓ వైపు..మరోవైపు ఆ ఫోన్‌తో పిల్లలు తన చేయి దాటిపోతున్నరన్న టెన్సన్..ఇటువంటి టైంలో ఏ తల్లి అయినా ఏం చేస్తుంది. ఐ ఫోన్ తీసుకుని పిల్లల్ని నాలుగు దెబ్బలు కొట్టి వారిని సరైన దారిలో పెడుతుంది. కాని ఇక్కడ ఓ తల్లి ఐ ఫోన్‌తోనే నా పిల్లలు నాశనం అవుతున్నారంటూ దాన్ని గన్‌తో పేల్చేసింది. అదీ చాలదన్నట్లు సుత్తితో దాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more: ఇక జీవితంలో పీకేపై ట్వీట్లు పెట్టను : వర్మ

1

1

ఫోన్లు రాక ముందు అవి అందుబాటులో లేని కాలంలో కుటుంబ సభ్యులు అలాగే తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధాలు చాలా బలంగా ఉండేవి. 

2

2

అయితే స్మార్ట్ పోన్ల రాకతో అవి కాస్తా తగ్గిపోయాయి.ఇదే పరిస్థితి ఓ తల్లికి వచ్చింది. తన పిల్లలు విసుగు వచ్చేంత ఎక్కువగా ఐ ఫోన్ వాడటం, సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోవడం చూసి విసుగు చెందిన ఓ తల్లి భరించలేకపోయింది.

3

3

పిలిచినా పలక్కుండా ఉండే మితిమీరిన ఫోన్ వాడకం ఆమెకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. అందుకే తన పిల్లలు వాడుతున్న ఐ ఫోన్‌ను గన్‌తో పేల్చేసింది.

4
 

4

తన మాటలను కూడ పట్టించుకోని పిల్లల ప్రవర్తనకు ఆ తల్లి విసుగు చెంది ఓ చెట్టు కొమ్మపై ఐ ఫోన్‌ను పెట్టి గన్‌తో పేల్చేసింది.

5

5

అయినా ఆమె కోపం చల్లారలేదు. కొమ్మ పైనుంచి తెచ్చి, సుత్తితో చితక్కొట్టేందుకు ప్రయత్నించింది.

5

5

తిరిగి మరోసారి ఫోన్ పై తుపాకీతో తన ప్రతాపం చూపించింది. తన పిల్లల భవిష్యత్ తనకు ముఖ్యమని, దాని ముందు ఎంతటి ఎలక్ట్రానిక్ వస్తువైనా పనికిరాదంటూ ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది.

7

ఇప్పుడు ఆ వీడియో యూట్యూబ్ లో చక్కర్లు కొడుతూ వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటోంది. సో పిల్లలు ఇప్పటికైనా మీరు ఈ ఫోన్ ప్రపంచం నుండి బయటకు వచ్చి తల్లిదండ్రులతో కలిసి మాట్లాడండి.

8

8

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Mother Annoyed With Kids' Social Media Use Shoots Their iPhone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X