అప్పడు రూ. 16 వేల కోట్లు, ఇప్పుడు రూ. 3 వేల కోట్లు అవుట్

జియో రంగప్రవేశం రోజున ఒక్కసారిగా 16,000 కోట్ల రూపాయలు నష్టపోయి కుదేలైన టెలికాం సంస్థల షేర్లు తిరిగి ముఖేష్ అంబానీ తాజా నిర్ణయంతో సుమారు 3,000 కోట్ల రూపాయలు నష్టపోయాయి.

By Hazarath
|

ముఖేష్ అంబాని స్పీచ్ దెబ్బ మార్కెట్లో కోట్ల నష్టాలను తెచ్చిపెడుతోంది. గతంలో 45 నిమిషాల స్పీచ్ దెబ్బకి 16 వేల కోట్లు నష్టపోయిన కంపెనీలు ఇప్పుడు కేవలం 25 నిమిషాల స్పీచ్ కి రూ. 3 వేల కోట్లు నష్టపోయాయి. జియో ఉచితంపై ఏ కొత్త న్యూస్ వచ్చినా మార్కెట్లో మిగతా టెల్కోలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది.

జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్, మార్చి 31 వరకు పుల్ ఎంజాయ్

ముఖేష్ అంబానీ చేసిన ప్రసంగం

ముఖేష్ అంబానీ చేసిన ప్రసంగం

జియో సేవలను మరో మూడు నెలలపాటు వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్నామంటూ రిలయన్స్ యజమాని ముఖేష్ అంబానీ చేసిన ప్రసంగం ప్రత్యర్థులకు తీరని నష్టం కలిగించింది.

 

 

రంగప్రవేశం రోజున

రంగప్రవేశం రోజున

జియో రంగప్రవేశం రోజున ఒక్కసారిగా 16,000 కోట్ల రూపాయలు నష్టపోయి కుదేలైన టెలికాం సంస్థల షేర్లు తిరిగి ... ముఖేష్ అంబానీ తాజా నిర్ణయంతో సుమారు 3,000 కోట్ల రూపాయలు నష్టపోయాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారతీ ఎయిర్‌టెల్
 

భారతీ ఎయిర్‌టెల్

టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ 1.66 శాతం నష్టపోయింది. షేర్ మార్కెట్ లో ముఖేష్ అంబానీ ప్రసంగ ప్రారంభానికి ముందు వరకు 324 రూపాయల వద్ద ట్రేడ్ అయిన ఎయిర్‌టెల్ షేర్లు, ఆయన స్పీచ్ ప్రారంభం కాగనే 318,3 రూపాయలకు పడిపోయాయి. దీంతో ఎయిర్ టెల్ మార్కెట్ విలువలో 2,276 కోట్ల రూపాయలు తుడిచిపెట్టుకుపోయాయి.

ఐడియా

ఐడియా

ఐడియా సెల్యులార్ 5.93 శాతం నష్టపోయింది. ముఖేష్ అంబానీ ప్రసంగానికి ముందు వరకు 76,60 రూపాయలతో ట్రేడ్ అయిన ఐడియా సెల్యులార్ షేర్లు ఆయన స్పీచ్ తరువాత 74,20 రూపాయలకు పడిపోయాయి. దీంతో ఈ సంస్థ 792 కోట్ల రూపాయలు కోల్పోయింది.

రిలయన్స్ కమ్యూనికేషన్

రిలయన్స్ కమ్యూనికేషన్

రిలయన్స్ కమ్యూనికేషన్ 5.05 శాతం నష్టపోయాయి. అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 శాతం లాభపడింది. హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ అంటూ జియో ఉచితాన్ని మరో మూడు నెలల పాటు అంటే మార్చి 31 2107 వరకు పొడిగించిన సంగతి విదితమే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Mukesh Ambani's 25-Minute Jio Speech Wipes Out Rs 3000 Crore in Market Cap For Rivals. Again

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X