నోకియాతో రూ.402 కోట్ల డీల్, VoLTE కోసమేనా..?

రిలయన్స్ జియోకు పోటీగా వాయిస్ ఓవర్ LTE కాలింగ్ సేవలను ఎయిర్‌టెల్ అతిత్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.

|

VoLTE కాలింగ్‌కు అవసరమయ్యే టెక్నాలజీని భారతి ఎయిర్‌టెల్‌కు సమకూర్చేందుకు రూ.402 కోట్ల పాన్ ఇండియా డీల్‌ను నోకియా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌టెల్‌కు అవసరమైన VoLTE కాలింగ్ టెక్నాలజీని ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా నోకియా ఐఎమ్ఎస్ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేసే అవకాశముందని తెలియవచ్చింది.

Read More : మీ ఫోన్‌లో Jio నెట్ స్పీడ్ తగ్గుతోందా..?

ఎయిర్‌టెల్ విజయవంతంగా ..

ఎయిర్‌టెల్ విజయవంతంగా ..

ఇప్పటికే ఈ టెక్నాలజీని కొన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ విజయవంతంగా పరీక్షించి చూసినట్లు సమాచారం. VoLTE టెక్నాలజీ సమకూర్చుకోవటం ద్వారా ఆపరేటర్ బ్యాండ్స్ మార్చుకుండానే వాయిస్ ఇంకా డేటా సేవలను అందించే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే VoLTE సేవలను

ఇప్పటికే VoLTE సేవలను

ఇప్పటికే VoLTE సేవలను దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. VoLTE సేవలను ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీసుకురావటం ద్వారా యూజర్లు హైస్పీడ్ డేటాను సేవలను యాక్సిస్ చేసుకోగలుగుతారు.

 సరికొత్త ఆఫర్‌తో..
 

సరికొత్త ఆఫర్‌తో..

దీపావళిని పురస్కరించకుని భారతి ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఎయిర్‌టెల్ యూజర్లు తమ పాత సిమ్‌ను 4జీకి అప్‌గ్రేడ్ చేసుకున్నట్లయితే 2జీబి 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఈ 4జీ సిమ్ ప్రమోషనల్ ఆఫర్‌ను పొందేందుకు మీరు పాటించవల్సిన సూచనలు...

 ఎయిర్‌టెల్ సిమ్‌ను 4జీకి అప్‌గ్రేడ్ చేసుకోవాలంటే..?

ఎయిర్‌టెల్ సిమ్‌ను 4జీకి అప్‌గ్రేడ్ చేసుకోవాలంటే..?

మీరు ఇప్పటికే వాడుతోన్న 2జీ/3జీ ఎయిర్‌టెల్ సిమ్‌ను 4జీకి అప్‌గ్రేడ్ చేసుకునే క్రమంలో http://www.airtel.in/4g/sim-swapలోకి వెళ్లి.. మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఇంకా షిప్పింగ్ అడ్రస్ వివరాలను ఎంటర్ చేసి 'Send me a 4G SIM'పై క్లిక్ చేయండి.

మీ చిరునామాకు డెలివరీ చేయటం జరుగుతుంది

మీ చిరునామాకు డెలివరీ చేయటం జరుగుతుంది

మీరు తెలిపిన వివరాలు ప్రకారం ఎయిర్‌టెల్ 4జీ సిమ్ మీ చిరునామాకు డెలివరీ చేయటం జరుగుతుంది. కొత్త సిమ్ పొందిన తరువాత ఆ సిమ్ పై ఉన్న 20 డిజిట్ల నెంబర్‌ను 121కు ఎస్ఎంఎస్ చేయవల్సి ఉంటుంది.

మీకో రిప్లై మెసేజ్ అందుతుంది

మీకో రిప్లై మెసేజ్ అందుతుంది

మెసెజ్ పంపిన వెంటనే ఎయిర్‌టెల్ నుంచి మీకో రిప్లై మెసేజ్ అందుతుంది. ఆ మెసేజ్‌ను కన్ఫర్మ్ చేసేందుకు ‘1' అంకెను ప్రెస్ చేయవల్సి ఉంటుంది.

పాత  సిమ్ డిస్‌కనెక్ట్ కాబడుతుంది

పాత సిమ్ డిస్‌కనెక్ట్ కాబడుతుంది

ఈ ప్రక్రియ పూర్తి అయిన కొద్ది నిమిషాలకే మీ పాత ఎయిర్‌టెల్ సిమ్ డిస్‌కనెక్ట్ కాబడుతుంది. ఇలా జరిగిన వెంటనే కొత్త ఎయిర్‌టెల్ సిమ్‌ను ఫోన్‌లో ఇన్సర్ట్ చేసి ఎయిర్‌టెల్ 4జీ సేవలను ఆస్వాదించవచ్చు.

సిమ్ అప్‌గ్రేడ్ ప్రాసెస్ పూర్తి అయిన వెంటనే..

సిమ్ అప్‌గ్రేడ్ ప్రాసెస్ పూర్తి అయిన వెంటనే..

సిమ్ అప్‌గ్రేడ్ ప్రాసెస్ పూర్తి అయిన వెంటనే మీ నెంబర్‌కు 2జీబి 4జీ డేటా క్రెడిట్ అవుతుంది. ఉచిత 4జీ డేటాను పొందే క్రమంలో 52122 నెంబర్‌కు మిస్సుడ్ కాల్ ఇవ్వవల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Nokia bags Rs 402 crore VoLTE deal from Bharti Airtel. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X