భారీ స్థాయిలో జీతాలు పెంచనున్న విప్రో

By Hazarath
|

ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ విప్రో తమ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంచనుంది. ఈ విషయాన్ని విప్రో ఒక ప్రకటన ద్వారా తెలిపింది. దేశంలో పని చేస్తున్న విప్రో ఉద్యోగులకు సగటున 9.5 శాతం వేతన పెంపును జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి తేనున్నట్లు పేర్కొంది. అంతేకాక, అత్యుత్తమ పనితీరును ప్రదర్శించిన వారికి అదనపు మొత్తాలను కూడా ఇచ్చినట్లు తెలిపింది. తమ కంపెనీలో ఆఫ్ షోర్ ఉద్యోగులు వేతనంలో సుమారు 9.5 శాతం పెంపును పొందనున్నారని, ఆన్ సైట్ ఉద్యోగులకు కనీసం రెండు శాతం వరకూ పెంపు ఉంటుందని వివరించింది. అదేవిధంగా, పనిలో నైపుణ్యం, ప్రత్యేకత కనబర్చిన వారికి ప్రత్యేకంగా హైక్ ఇవ్వనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.ఈ న్యూస్‌తో ఉద్యోగులు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు.
Read more: ఉచిత అన్‌లిమిలెడ్ ఎసెమ్మెస్‌లు అందించే సైట్లు

వేల కోట్ల ఆస్తులు..ప్రపంచంలోనే అతి పెద్ద సామ్రాజ్యం. తాను కోరుకుంటే ఎంతో విలాసవంతమైన జీవితం. కాలు కదపకుండా అన్ని పనులు చేసే నౌకర్లు. ఇంత లగ్జరీ ఉన్నా ఆయనకు అవేమి పట్టవు. సాధారణ జీవితాన్నే ఇష్టపడతాడు. అతనే విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ. ఆయన గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు ఇవే.

 కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

ఇన్ని కోట్లు ఉన్నా ఆజీమ్ ప్రేమ్ జీ వాడేది సెకండ్ హ్యాండ్ కారు. 50 లక్షలు పోసి మెర్సిడెంజ్ బెంజ్ కారును కొనడం ఎందుకని అదే కంపెనీకి చెందిన సెకండ్ హ్యాండ్ కారుని కొన్నారు. దాన్నే తన వ్యక్తిగత పనులకు వినియోగిస్తున్నారు కూడా .

 కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

ఇక ఆయన షేవింగ్ కోసం ఏం క్రీమ్ ను వాడుతారో తెలుసా విప్రో కంపెనీ తయారుచేస్తున్న చంద్రిక సబ్బునే వినియోగిస్తారు. ఎందుకని ఎవరైనా అడిగితే మన కంపెనీ సబ్బును మనం వాడకపోతే ఇంకెవరు వాడుతారని సున్నితంగా బదులిస్తారట.

 కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం
 
కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

ప్రేమ్ జీ ఇప్పటిదాకా తన వ్యక్తిగత సంపద నుంచి 12 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను దానధర్మాల కోసం అందించారట. అది కూడా కేవలం ఒకటిన్నర ఏడాదిలోనే ఇంత మేర దాతృత్వం ప్రదర్శించడం విశేషం. భారత్ లో భారీస్థాయిలో వితరణ చేసిన వ్యక్తుల్లో అజీమ్ ప్రేమ్ జీనే టాప్ అంటూ చైనాకు చెందిన ద హరూన్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ప్రకటించింది.

 కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

అజీమ్ ప్రేమ్‌జీ గుజరాత్ నుంచి వచ్చి ముంబై లో నివసిస్తున్న ఒక షియా ముస్లిం కుటుంబంలో జన్మించాడు.ఆయన తండ్రి ఎం.హెచ్. ప్రేమ్‌జీ వెస్టర్న్ ఇండియా వెజిటబుల్ ప్రాడక్ట్ కంపెనీ (దీన్నే తరువాత విప్రో గా మార్చడం జరిగింది)అనే సంస్థకు యజమాని. ఈ సంస్థ వంటనూనెలు ఉత్పత్తి చేసేది.

 కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

21 ఏళ్ల వయసులో తండ్రి అకాల మరణంతో స్టాన్ పోర్డ్ యూనివర్సిటీలో చదువుకు మధ్యలో రాంరాం చెప్పి విప్రో పగ్గాలు అందుకున్నాడు. ఆ తరువాత 30 ఏళ్లకు పట్టుబట్టి తన డిగ్రీని పూర్తి చేశారు. అప్పుడు కంపెనీ వంట నూనెల ఉత్పత్తిని తయారు చేస్తుండేది.

 కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

పాకిస్తాన్ ఆవిర్భావానికి కారణమైన మహమ్మదాలీ జిన్నా ఒకానొక దశలో అజీమ్ ప్రేమ్ జీ తండ్రిని పాకిస్తాన్ కు వెళ్లమని చెప్పాడు. అయితే దాన్ని అజీమ్ తండ్రి సున్నితంగా తిరస్కరించి నాకు ఇండియాలో ఉండటమంటేనే ఇష్టమని ఇక్కడే తన వ్యాపార సామ్రాజ్యానికి పునాదులు ఏర్పరిచాడు.

 కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

మూడు సంవత్సరాల తరువాత ఇద్దరు సీఈఓలను నియమించి సంచలనానికి తెరలేపారు. వారిలో ఒకరు సురేష్ వశ్వని కాగా మరొకరు గిరీష్ పరాంజే. అకారణంగా సడన్ గా అలా మార్చడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నంత పనిచేశారు. అయితే కంపెనీ మాత్రం డెవలప్ మెంట్ కోసమేనని చెప్పింది.

 కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

అజీమ్ కు టాటా అధినేత జెఆర్ డి టాటా అంటే చాలా ఇష్టం. నా ఐకాన్ జహంగీర్ దాదాబాయ్ టాటా అని ఎల్లప్పుడూ చెబుతుంటారు. ఎంతోమంది ఆయన నుంచి ఇన్స్పిరేషన్ పొందారని నేను అందులో ఒకరినని చెబుతారు. నాయకత్వ లక్షణాలు ఆయన నుంచే నేర్చుకోవాలని చెబుతారు.

 కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

విమానాలలో వసతులను బట్టి రకరకాల తరగతులుగా విభజిస్తారు. కొన్ని కోట్ల రుపాయల సంపదను కలిగి ఉన్న అజీమ్‌ ప్రేమ్‌జీ ఎప్పుడు కూడా సాధారణ తరగతిలో ప్రయాణం చేసేవాడు.

 కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

సమయాన్ని ఖచ్చితంగా పాటించే అజీమ్‌ ప్రేమ్‌జీ ఎప్పుడు కూడా తన కారు కోసం వేచి చూసేవాడు కాదు. ప్రజారవాణాలో వినియోగించే సిటి బస్సులలో మరియు ఆటో రిక్షాలలో ప్రయాణించడం ఇతనికి షరామామూలే.

 కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

విప్రో కంపెనీలో తన వాటా నుంచి దాదాపు 8.6 శాతం షేర్లు అంటే 8,646 కోట్లు అజీమ్ ప్రేమ్ జీ పౌండేషన్ కి విరాళంగా ఇచ్చారు. ఈ సంస్థ అనేక సామాజిక కార్యక్రమాలను చేస్తోంది. ఈ ఫౌండేషన్ 8 రాష్ట్రాల్లో దాదాపు మూడు లక్షల యాభై వేల పాఠశాలల్లో తమ కార్యకలాపాలను నిర్వర్తిస్తోంది. ఇప్పటివరకు 30 వేల కోట్లకు పైగానే విద్యతో పాటు సంక్షేమ కార్యక్రమాలకు దానం చేశారు.

 కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య పేరు యాస్మిన్. పిల్లల పేర్లు రిషాద్ , తరీఖ్. ఇద్దరూ ఇప్పుడు విప్రోలో బాధ్యతలు నిర్వరిస్తున్నారు.

 కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

సాధారణంగా కొంతమంది కంపెనీ అధినేతలు చిన్న చిన్న వాటికే బిజినెస్ హెడ్ లతో మీటింగ్ లు పెట్టి నానా హైరామా చేస్తుంటారు. అయితే అజీమ్ ప్రేమ్ జీ దీనికి పూర్తిగా విరుద్ధం. విప్రో ప్రపచంలోనే రెండే అది పెద్ద హైడ్రోలిక్ సిలిండర్ కంపెనీ. దాన్ని ఆస్థాయికి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు.

 కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

కాలక్షేపం కోసం సినిమాలు అలాగే కొండలు ఎక్కడం చేస్తుంటారు. బయటకెళ్లితే అఫీసును పూర్తిగా మరచిపోతారు.

 కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

2011లో పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నాడు. అలాగే 2005లో పద్మభూషణ్ అందుకున్నాడు.ఇంకా ఎన్నో అవార్డులు ఆయన్ని వరించాయి.

 కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

కంపెనీ అభివృద్ధి పధంలో నడవాలంటే నీవు నీ సహచర ఉద్యోగులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే మెరుగైన ఫలితాలు రాబట్టగలవు. నీ శక్తిని మాత్రమే నీవు నమ్ముకుంటే పైకి వస్తావు.

 కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

కోట్లు సంపాదించినా సింపుల్‌గా బతకడమే జీవితం

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Pay hike for Wipro techies from June 1

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X