పేటీఎమ్ దుమ్మురేపింది

గతంలో ఎన్నడూ లేని రికార్డు స్థాయి లావాదేవీలు, రోజుకు 5 మిలియన్లకు పైగానే లావాదేవీలు

By Hazarath
|

దేశ వ్యాప్తంగా రూ. 500, రూ. 1000 నోట్లు బ్యాన్ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ప్రజలను కొంత ఇబ్బందులకు గురిచేసినప్పటికీ అందరూ ఆ నిర్ణయాన్ని స్వాగితిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో అందరూ ఈ కామర్స్ మీదనే పనులు సాగిస్తున్నారు. దీంతో ఈ కామర్స్ రంగం ఎన్నడూ లేనంతగా పుంజుకుంది. పేటీఎమ్ అయితే గతంలో ఎన్నడూ లేని రికార్డు స్థాయి లావాదేవీలు నమోదు చేసింది. రోజుకు 5 మిలియన్ల లావాదేవీలు జరగుతున్నాయని కంపెనీ సగర్వంగా ప్రకటించింది.

మోడీ నిర్ణయంతో పండగ చేసుకుంటున్న ఈ కామర్స్

రోజుకు 5 మిలియన్ల లావాదేవీలను

రోజుకు 5 మిలియన్ల లావాదేవీలను

మొబైల్ ఫ్లాట్ ఫాం వ్యాలెట్ పేటీఎమ్ రోజుకు 5 మిలియన్ల లావాదేవీలను టచ్ చేస్తోందని కంపెనీ సగర్వంగా ప్రకటించింది.

 రూ. 24 వేల కోట్ల మేర లావాదేవీలు

రూ. 24 వేల కోట్ల మేర లావాదేవీలు

దీంతో పాటు రూ. 24 వేల కోట్ల మేర లావాదేవీలు జరిగాయని ఇది ఆనందించదగ్గ పరిణామమని దేశంలో ఇదే అత్యధిక ఫ్లాట్ ఫాం అని ఎవ్వరూ ఈ గమ్యాన్ని చేరుకోలేరని చెబుతోంది.


లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పనుల కోసం ఆన్ లైన్ లోనే
 

పనుల కోసం ఆన్ లైన్ లోనే

ప్రధాని నరేంద్ర మోడీ రూ. 500, రూ. 1000 నోట్లు బ్యాన్ చేసిన నేపథ్యంలో ఆన్ లైన్ డిజిటల్ లావాదేవీలు పుంజుకున్నాయి. అందరూ తమ పనుల కోసం ఆన్ లైన్ లోనే ఆశ్రయిస్తున్నారు.

వారంలో 3 ట్రాన్సిక్షన్స్ చేసే యూజర్లు

వారంలో 3 ట్రాన్సిక్షన్స్ చేసే యూజర్లు

బ్యాంకులు, అలాగే ఏటీఎమ్ ల చుట్టూ తిరిగి అలిసిపోయే కంటే ఇదే మేలని కష్టమర్లు భావించడమే ఇందుకు కారణం. దీనివల్ల రోజుకు వారంలో 3 ట్రాన్సిక్షన్స్ చేసే యూజర్లు ఇప్పుడు ఏకంగా 18 ట్రాన్సిక్షన్స్ చేస్తున్నారు.

యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే వారి సంఖ్య

యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే వారి సంఖ్య

అంతే కాకుండా ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. దీనిపై కంపెనీ ఎండీ స్పందిస్తూ ఈ సంవత్సరం చివరికల్లా 5 మిలియన్ల మంది యూజర్లను చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.

మొబైల్ పేమెంట్ రంగంలో విప్లవాత్మక ఒరవడి

మొబైల్ పేమెంట్ రంగంలో విప్లవాత్మక ఒరవడి

ఇది మాకు చాలా గొప్ప అవకాశమని, మోడీ నిర్ణయం మొబైల్ పేమెంట్ రంగంలో విప్లవాత్మక ఒరవడికి నాంది పలికిందని పేటీఎమ్ అధికారులు చెబుతున్నారు. వ్యాపారుల అవసరాల దృష్ట్యా ఆన్ లైన్ పేమెంట్ పెంచేందుకు బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Paytm hits 5 million transaction per day; will process over Rs 24,000 crores soon Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X