పూర్తి ఉచితం సాధ్యం కాదు: జియోకి కూడా డబ్బులు కట్టాల్సిందే

టెలికాం రంగంలో పోటీ కిరాతకం, కాల్ ఛార్జీలు (టారిఫ్) తగ్గొచ్చేమో కానీ, కాల్స్ అన్నీ ఉచితంగా ఇవ్వడం సాధ్యం కాదు

By Hazarath
|

జియో రాకతో ఉచిత కాల్స్ పై మార్కెట్లో ప్రకంపనలు రేకెత్తిన నేపథ్యంలో అన్ని టెల్కోలు ఇప్పుడ ఆత్మరక్షణలో పడిన విషయం విదితమే.అయితే దీనిపై ఎయిర్‌టెల్ స్పందించింది. రిలయన్స్ జియో ప్రవేశం వల్ల కాల్ ఛార్జీలు (టారిఫ్) తగ్గొచ్చేమో కానీ, కాల్స్ అన్నీ ఉచితంగా ఇవ్వడం సాధ్యం కాదని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. దీంతో పాటు టెలికాం రంగంలో పోటీ కిరాతకంగా మారిందని తెలిపింది. ఎయిర్ టెల్ మాటల్లోని సారాంశం ఏంటో ఓ సారి చూడండి.

 

జియో దూకుడుతో యూజర్లకి పండగే : 6నెలల్లో 45వేల 4జీ నెట్‌వర్క్‌టవర్లు

కొత్త సంస్థలు ప్రవేశించినప్పుడు, ఛార్జీల తగ్గింపు వంటివి

కొత్త సంస్థలు ప్రవేశించినప్పుడు, ఛార్జీల తగ్గింపు వంటివి

పోటీ సంస్థల వల్ల అప్రమత్తంగా ఉంటామే కానీ, వారి బాటలో నడవబోమని పేర్కొన్నారు. కొత్త సంస్థలు ప్రవేశించినప్పుడు, ఛార్జీల తగ్గింపు వంటివి జరుగుతుంటాయని భారతి ఎయిర్‌టెల్ ఎండీ ,సీఈఓ గోపాల్ విఠల్ తెలిపారు.

 ఉచిత ఆఫర్ అయిపోయిన తరువాత

ఉచిత ఆఫర్ అయిపోయిన తరువాత

అయితే ఉచిత ఆఫర్ అయిపోయిన తరువాత కాల్స్ కోసం జియోకి సైతం కస్టమర్లు డబ్బులు చెల్లించాల్సిందేనని పరోక్షంగా ప్రస్థావించారు. డేటా రీఛార్జ్ లేకుండా మీరు జియోలో ఉచితంగా కాల్స్ చేసుకోలేరని తెలిపారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియో
 

జియో

సెప్టెంబరు 4 నుంచి డిసెంబరు ఆఖరు వరకు వాయిస్కాల్స్, డేటా సేవలను ఉచితంగా ఇస్తామని, అనంతరం కూడా కాల్స్కు ఛార్జీ ఉండబోదని, డేటాకూ పరిమిత ఛార్జీలు ఉంటాయి' అని జియో అధిపతి ముకేశ్ అంబానీ ప్రకటించిన సంగతి విదితమే.

 రూ .999 అద్దె పథకంలో

రూ .999 అద్దె పథకంలో

ఎయిర్‌టెల్ కూడా రూ .999 అద్దె పథకంలో ఉచిత కాల్స్ ఇస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే అన్ని పథకాల్లో ఉచిత కాల్స్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు.

ఫీచర్ ఫోన్లు

ఫీచర్ ఫోన్లు

ఎక్కువమంది చందాదార్లు ఫీచర్ ఫోన్లు, ప్రారంభశ్రేణి స్మార్ట్ఫోన్లు కలిగి ఉన్నారని, వారంతా తమకు అనువైన భిన్న పథకాల కోసం అన్వేషిస్తుంటారని తెలిపారు.

డేటాకు చెల్లించబోమంటే

డేటాకు చెల్లించబోమంటే

కొందరికి డేటా కావాలని, మరికొందరికి కాల్స్ మాత్రమే అవసరం ఉంటుందన్నారు. వాయిస్ కాల్స్ మాత్రమే కోరుకుని, డేటాకు చెల్లించబోమంటే, వారికి కాల్స్ ఉచితంగా ఎలా ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Price drop possible but no across-the-board free calls: Airtel read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X