డెబిట్ , క్రెడిట్ కార్డులు వాడేవారికి శుభవార్త

రూ. 2000 లోపు లావాదేవీలపై సర్వీస్ ట్యాక్స్ రద్దు, వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) అవసరం లేదు

Written By:

డిజిటల్ ఇండియా వైపు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను వినియోగించే వారికి ప్రోత్సాహాన్ని అందించేలా కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 2000 లోపు లావాదేవీలపై సర్వీస్ ట్యాక్స్ ను రద్దు చేసింది.

జియో దెబ్బకు భారీ నష్టాల్లో టెల్కోలు

డెబిట్ , క్రెడిట్ కార్డులు వాడేవారికి శుభవార్త

అంతేకాదు, ఇతర చెల్లింపుల సేవల్లో కూడా మినహాయింపులు ఇవ్వనుంది. దీని కోసం జూన్ 2012 సర్వీస్ ట్యాక్స్ నోటిఫికేషన్ ను మార్చనుంది. కొత్త నోటిఫికేషన్ ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

ఐఫోన్ బ్యాటరీలపై ఆపిల్ షాకింగ్ న్యూస్ !

డెబిట్ , క్రెడిట్ కార్డులు వాడేవారికి శుభవార్త

మరోవైపు, ఆన్ లైన్ లావాదేవీలు నిర్వహించే వారికి ఆర్బీఐ నిన్న కొత్త నిబంధన విధించింది. ఇకపై రూ. 2000 ల వరకు చెల్లింపులకు వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) అవసరం లేదని ... వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చాలని తెలిపింది.ముంబైలో సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రపంచాన్ని తట్టిలేపిన ట్వీట్స్ ఇవే !

డెబిట్ , క్రెడిట్ కార్డులు వాడేవారికి శుభవార్త

మరోవైపు కొత్త రూ .500 నోట్లను అందుబాటులోకి రావడానికి కొంతసమయం పడుతుందని ఆర్ బీఐ తేల్చి చెప్పింది. నగదుకొరతతో ఇబ్బందులు పడుతూ డిజిటల్ చెల్లింపులకు అలవాటుపడుతున్నవారికి ఇది మరింత ప్రయోజకరంగా వుంటుందని అంచనా!

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


English summary
RBI relaxes 2FA norms for transactions up to Rs. 2,000: Everything You Need To Know Read more At gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting