రిలయన్స్ బంపరాఫర్, రూ.54కే నెలంతా 4జీ, తెలుగు వారికి మాత్రమే ఆఫర్?

రూ.148తో పాటు రూ.54, రూ.61 ప్లాన్స్ కూడా...

|

అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) మరికొన్ని ఆసక్తికర ప్లాన్‌లను మార్కెట్లో అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది.

Read More : ఈ ఏడాది రాబోతున్న కత్తిలాంటి ఫోన్స్ ఇవే..?

రూ.148 ప్లాన్‌

రూ.148 ప్లాన్‌

ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లోని ఓ రిటైలర్ తెలిపిన వివరాల ప్రకారం RCom త్వరలోనే కొత్త యూజర్స్ కోసం రూ.148 ప్లాన్‌ను లాంచ్ చేయబోతోంది.

70 రోజుల వ్యాలిడిటీ..

70 రోజుల వ్యాలిడిటీ..

ఈ ప్లాన్ కేవలం తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ సర్కిల్స్‌లోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. 70 రోజుల వ్యాలిడిటీతో రానున్న ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 1జీబి 4జీ డేటాతో పాటు రూ.50 టాక్ టైమ్ కూడా ఆఫర్ చేయటం జరుగుతుందట.

 రూ.54, రూ.61 ప్లాన్‌..

రూ.54, రూ.61 ప్లాన్‌..

రూ.148తో పాటు రూ.54, రూ.61 ప్లాన్‌ను కూడా ఆర్‌కామ్ పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. రూ.54 ప్లాన్‌లో భాగంగా 28 రోజుల పాటు రోజుకు 1జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో కాల్స్ విషయానికి వచ్చేసరికి రిలయన్స్ టు రిలయన్స్ నిమిషానికి ఒక పైసా ఛార్జ్ చేస్తారు. రిలయన్స్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకునే కాల్స్‌కు నిమిషానికి 25 పైసలు చొప్పున వసూలు చేస్తారు.

రూ.61 ప్లాన్‌..

రూ.61 ప్లాన్‌..

రూ.61 ప్లాన్‌లో భాగంగా 28 రోజుల పాటు రోజుకు 1జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో కాల్స్ విషయానికి వచ్చేసరికి రిలయన్స్ టు రిలయన్స్ మధ్య ప్రతి 6 సెకన్లకు ఒక పైసాను వసూలు చేస్తారు. రిలయన్స్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకునే కాల్స్ మధ్య ప్రతి రెండ సెకన్లకు ఒక పైసాను ఛార్జ్ చేస్తారు. 25 పైసలు చొప్పున వసూలు చేస్తారు.

జియో గురించి 10 షాకింగ్ నిజాలు..

జియో గురించి 10 షాకింగ్ నిజాలు..

జియో గురించి పూర్తిగా చాలామందికి తెలియదు. ఉచిత ఆఫర్ల సునామితో మార్కెట్లో సుడి గుండాలు సృష్టించిన జియో ఏ చోట నుండి తన ప్రస్థానాన్ని ప్రారంభించిందే తెలుసుకుంటే ఆశ్చర్యంతో పాటు షాకింగ్ కూడా కలుగుతుంది. అసలు జియో అంటే ఏమిటి..? దాని బ్యాక్ గ్రౌండ్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

రిలయన్స్ నుంచి పుట్టిన

రిలయన్స్ నుంచి పుట్టిన

జియో అంటే హిందీలో అర్థం ఏంటో తెలుసా జీవించు అని. అంబాని అదే చెబుతున్నారు.. మీరు మాములుగా జీవించవద్దు ఎంజాయ్ చేస్తూ జీవించడం అని చెబుతున్నారు.

జియో ప్రస్థానం ఎక్కడ నుంచి మొదలైంది..

జియో ప్రస్థానం ఎక్కడ నుంచి మొదలైంది..

జియో ప్రస్థానం ఎక్కడ నుంచి మొదలైంది..? రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ ఎలా రూపుదిద్దుకుంది? అంటే చాలా ఆసక్తికర సమాధానాలు వినిపిస్తాయి. అవి తెలుసుకోవాలంటే 2010లోకి వెళ్లాలి.

ఒప్పందాన్ని అన్నదమ్ము రద్దు చేసుకున్నాక..

ఒప్పందాన్ని అన్నదమ్ము రద్దు చేసుకున్నాక..

2010 మే నెలలో నాలుగేళ్ళపాటు పరస్పరం పోటీ పడకూడదన్న ఒప్పందాన్ని ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ రద్దుచేసుకున్నారు. దీంతో అనిల్ అంబాని టెలికామ్ వ్యాపారంలో ప్రవేశించేందుకు మార్గం సుగమమైంది.

2010 జూన్‌లో వెనువెంటనే..

2010 జూన్‌లో వెనువెంటనే..

2010 జూన్ లో ప్రభుత్వం బ్రాడ్ బాండ్ అండ్ వైర్లెస్ యాక్సెస్ (బిడబ్ల్యుఎ) వేలం నిర్వహిస్తున్నప్పుడు వేలం ధరలు సహేతుక పరిమితి దాటి పోయాయంటూ వోడాఫోన్, అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ కమ్యూనికేషన్స్, టాటా కమ్యూనికేషన్స్ వెనకడుగేశాయి.

 

ఇన్ఫోటెల్ బ్రాడ్ బాండ్ సర్వీసెస్

ఇన్ఫోటెల్ బ్రాడ్ బాండ్ సర్వీసెస్

ఇన్ఫోటెల్ బ్రాడ్ బాండ్ సర్వీసెస్ అనే ఒకే ఒక సంస్థ మాత్రం రంగంలో నిలబడి 12 వేల 847 కోట్ల 77 లక్షలకు వేలం పాడి దేశవ్యాప్తంగా మొత్తం 22 సర్కిల్స్‌కు ఏకైక విజేతగా మారింది. దేశవ్యాప్తంగా ఆ సంస్థ ఒక్కటే వేలంలో రూ. 4,800 కోట్లకు లైసెన్స్ గెలుచుకుంది.

కంపెనీ ఏంటో ఎవరూ తొంగిచూడకముందే

కంపెనీ ఏంటో ఎవరూ తొంగిచూడకముందే

ఆ కంపెనీ ఏంటో ఎవరూ తొంగిచూడకముందే ముఖేశ్ అంబానీకి చెందిన రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆ వేలం జరిగిన మరుసటి రోజే అందులో 95 శాతం వాటా కొనేసింది.

 

4జీ ఎల్టీఈ

4జీ ఎల్టీఈ

మొబైల్ టెక్నాలజీ ఆ తరువాత జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలో వైమాక్స్ లేదా ఎల్టీఈ లేదా 4జీ మొబైల్ టెక్నాలజీ ద్వారా వైర్లెస్ బ్రాడ్ బాండ్ సర్వీసులు అందజేస్తుందని ప్రకటించారు.

 

కంపెనీ మరో ప్రకటన

కంపెనీ మరో ప్రకటన

అదే సమావేశంలో కంపెనీ మరో ప్రకటన కూడా చేసింది. వచ్చే ఏడాది కాలంలో ఈ సంస్థలో 18 నుంచి 20 వేలకోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పింది. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో సేవలు మొదలుపెట్టకపోయినా సంస్థ మాత్రం తన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు బలోపేతం చేసుకోవటానికి తగిన ఏర్పాట్లలో తలమునకలైంది. ఆ వేలం తర్వాత ఇన్పోటెల్ అనే సంస్థ మిగతా టెల్కోలకు షాకిస్తూ వస్తూనే ఉంది. మూడేళ్ళపాటు అనేక నగరాలలో ప్రయోగాత్మకంగా 4జీని పరీక్షిస్తూనే వచ్చింది తప్ప ఎలాంటి కీలకమైన ప్రకటనా చేయలేదు.

రిలయన్స్ జియోగా పేరును మార్చుకుంది..

రిలయన్స్ జియోగా పేరును మార్చుకుంది..

అయితే, 2013 జనవరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఇన్ఫోటెల్ బ్రాడ్ బాండ్ పేరును రిలయన్స్ జియోగా మార్చింది. అప్పటి నుంచి టెక్ దిగ్గజాలకు షాకిస్తూ వస్తూనే ఉంది.

భారతి ఎయిర్‌టెల్‌తో ఒప్పందం..

భారతి ఎయిర్‌టెల్‌తో ఒప్పందం..

అదే సమయంలో రిలయన్స్ జియో ఇన్పోకామ్ భారతి ఎయిర్‌టెల్ మధ్య ఓ కీలక ఒప్పదం కూడా జరిగింది. భారత్, సింగపూర్ మధ్య సముద్రంగుండా ఉన్న భారతి ఫైబర్ కేబుల్ ను రిలయెన్స్ జియో వాడుకునేలా ఆ ఒప్పందం కుదిరింది.

ఆసియా పసిఫిక్ అంతటా..

ఆసియా పసిఫిక్ అంతటా..

దాని వలన రిలయన్స్ జియో‌కు ఆసియా పసిఫిక్ అంతటా ప్రధాన కేంద్రాలకు అత్యంత వేగవంతమైన కనెక్టివిటీ దొరకటంతోబాటు నేరుగా అనుసంధానమయ్యే వీలుంటుంది. ఇది ముందే ఊహించి ఉండే అవకాశం కూడా లేకపోలేదని మార్కెట్ వర్గాల కథనం.

 

జియో, రిలయెన్స్ కమ్యూనికేషన్ మధ్య ఒప్పందం

జియో, రిలయెన్స్ కమ్యూనికేషన్ మధ్య ఒప్పందం

దీంతో పాటు ఆర్ కామ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న టెలికామ్ టవర్లు తదితర మౌలిక సదుపాయాలను కలిసి వాడుకునేలా రిలయెన్స్ జియో, రిలయెన్స్ కమ్యూనికేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు ప్రతిఫలంగా రిలయెన్స్ జియో ఏకమొత్తంగా రూ. 1673 కోట్లు చెల్లించింది.

American tower corporationతో  ఒప్పందం..

American tower corporationతో ఒప్పందం..

ఇక మరో కంపెనీ అయిన ఎటిసి (American tower corporation) తో కూడా ఇదే ఒప్పందాన్ని జియో కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా ఎటిసి ఇండియా వారి టెలికామ్ టవర్ సదుపాయాన్ని కలిసి వాడుకోవటానికి ఆ సంస్థతో కూడా రిలయెన్స్ జియో ఒక ఒప్పందం చేసుకుంది.

అక్కడ నుంచి జియో ప్రస్థానం  అందుకుంది..

అక్కడ నుంచి జియో ప్రస్థానం అందుకుంది..

అక్కడ నుంచి జియో ప్రస్థానం మొదలైందనే చెప్పాలి. ఐఐటి ముంబై‌లో జరిగిన టెక్ ఫెస్ట్‌లో రిలయన్స్ జియో తన 4‌జి వోల్ట్ నెట్‌వర్క్‌ను పరీక్షించి చూసింది. వీడియో కాల్స్‌ను, జియో టెలివిజన్ సర్వీస్‌ను పరీక్షించింది. అప్పుడే మొత్తం 5 వేల పట్టణాలు, నగరాలు, 2 లక్షల 15 వేల గ్రామాలకు విస్తరిస్తామని ముఖేశ్ అంబానీ స్వయంగా ప్రకటించారు.

 

Best Mobiles in India

English summary
RCom to Launch a New FR 148 Plan for New Users Offering 70GB of 4G Data for 70 Days. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X