15 నిమిషాల్లో మీ Jio సిమ్ యాక్టివేట్ అవుతుంది!

|

రిలయన్స్ జియో సిమ్ కోసం పరితపిస్తోన్న 4జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. Reliance Jio ఇప్పుడు అధికారికంగా మార్కెట్లో లాంచ్ అయ్యింది. సెప్టంబర్ 5వ తేదీ నుంచి ప్రతి ఒక్కరికి రిలయన్స్ జియో సిమ్ అందబాటులోకి రాబోతోంది.

15 నిమిషాల్లో మీ Jio సిమ్ యాక్టివేట్ అవుతుంది!

Read More : జియో 4జీని సపోర్ట్ చేసే Motorola, Samsung ఫోన్‌ల వివరాలు...

ఈ సిమ్‌ను సొంతం చేసుకునే యూజర్లు డిసెంబర్ 31 వరకు జియో ఆఫర్ చేసే అన్ని సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చు. రిలయన్స్ జియో అధికారిక లాంచ్‌లో భాగంగా రిలయన్స్ e-KYC activation పేరుతో సరికొత్త సర్వీసును లాంచ్ చేసింది. ఇ-కేవైసీ యాక్టివేషన్ పద్ధతిలో భాగంగా మీ జియో సిమ్ కార్డ్ కేవలం 15 నిమిషాల వ్యవధిలో యాక్టివేట్ కాబడుతుంది.

e-KYC activation అంటే ఏంటి..?

e-KYC activation అంటే ఏంటి..?

ఇ-కేవైసీ యాక్టివేషన్ అనేది టెలికామ్ ఆపరేటర్లు తీసుకువచ్చిన సరికొత్త యాక్టివేషన్ పద్ధతి. ఈ ప్రక్రియ ద్వారా కొత్త సిమ్ కార్డ్ యాక్టివేషన్ 15 నిమిషాల్లో పూర్తవుతుంది.

e-KYC activationకు ఏఏ డాక్యుమెంట్స్ అవసరం.?

e-KYC activationకు ఏఏ డాక్యుమెంట్స్ అవసరం.?

ఇ-కేవైసీ యాక్టివేషన్ ప్రక్రియలో భాగంగా జియో సిమ్‌ను యాక్టివేట్ చేసుకునేందుకు యూజర్ ఆధార్ కార్డ్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అవసరమవుతుంది.

15 నిమిషాల్లో జియో సిమ్ ఎలా యాక్టివేట్ అవుతుంది..?
 

15 నిమిషాల్లో జియో సిమ్ ఎలా యాక్టివేట్ అవుతుంది..?

ప్రస్తుతానికి రిలయన్స్ e-KYC activation సర్వీస్ ముంబై, ఢిల్లీ నగరాల్లో సెప్టంబర్ 5 నుంచి అందుబాటులోకి రాబోతోంది. రానున్న రోజుల్లో ఈ సర్వీస్ అన్ని నగరాల్లో అందుబాటులో తీసుకురానున్నారు. జియో సిమ్ కార్డ్‌లకు సంబంధించి యాక్టివేషన్ ప్రాసెస్ మొదలైన తరువాత యూజర్ తన ఆధార్ కార్డ్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటోను సమీపంలోని రిలయన్స్ స్టోర్‌కు తీసుకువెళితే సరిపోతుంది.

 ఇన్‌స్టెంట్ యాక్టివేషన్

ఇన్‌స్టెంట్ యాక్టివేషన్

యూజర్ తన ఆధార్ కార్డ్ ద్వారా జియో సిమ్‌ను పొందిన 15 నిమిషాల వ్యవధిలోనే యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఈ ఇన్‌స్టెంట్ e-KYC activation సర్వీస్ దోహదపడుతుందని ముఖేశ్ అంబానీ తెలిపారు.

e-KYC activation ఎందుకంత అవసరం.

e-KYC activation ఎందుకంత అవసరం.

నిన్న.. మొన్నటి వరకు కొత్త సిమ్ కనెక్షన్ పొందలాంటే అప్లికేషన్ ఫిల్ చేయటంతో పాటు ఫోటో, అడ్రస్ ప్రూఫ్ వంటి ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి వచ్చేది. ఈ తతంగం మొత్తం పూర్తయ్యి, సిమ్‌ యాక్టివేషన్‌ అవ్వాటానికి దాదాపు ఒక రోజు సమయం పట్టేది. ఈ-కేవైసీ సర్వీస్ అందుబాటులోకి రావటం ద్వారా కొత్తగా మొబైల్ సిమ్ కొనుగోలు చేసేవారు గుర్తింపు పత్రం క్రింద ఆధార్ కార్డును ఇస్తే సరిపోతోంది.

రిలయన్స్‌కు పోటీగా

రిలయన్స్‌కు పోటీగా

రిలయన్స్‌కు పోటీగా కొత్త మొబైల్ కనెక్షన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ భారతి ఎయిర్‌టెల్ , వొడాఫోన్‌లు తమ స్టోర్‌లలో ఈ-కేవైసీ (e-KYC) సర్వీసును అమల్లోకి తీసుకువచ్చాయి.

Best Mobiles in India

English summary
Reliance Jio e-KYC Activation: Follow These Simple Steps to Activate Your SIM in 15 Minutes. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X