ఎయిర్‌టెల్ సంచలన ఆఫర్, నెలకు 5జీబి డేటా ఉచితం

రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ మరో సంచలన ఆఫర్‌తో దూసుకొచ్చింది.

రిలయన్స్ జియోకు పోటీగా భారతి ఎయిర్‌టెల్ సంచలన ఆఫర్లతో ముందుకొచ్చింది. తాజా ఆఫర్లలో భాగంగా ఎయిర్‌టెల్ తన డిజిటల్ టీవీ, బ్రాడ్‌బ్యాండ్ ఇంకా పోస్ట్ పెయిడ్ యూజర్లకు నెలకు 5జీబి చొప్పున ఉచిత డేటాను ఆఫర్ చేయునున్నట్లు ప్రకటించింది.

Read More : లెనోవో లేటెస్ట్ 4జీ ఫోన్‌లు ఇవే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

myHome Rewards

భారతదేశపు అతిపెద్ద టెలికామ్ ఆపరేటర్ అయిన ఎయిర్ టెల్ ఇటీవల "myHome Rewards" పేరుతో సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌టెల్.. డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్ ఇంకా పోస్ట్ పెయిడ్ యూజర్లు నెలకు 5జీబి ఉచిత డేటాను అదనంగా పొందే అవాకశం ఉంటుంది.

MyAirtel యాప్‌లోకి వెళ్లండి

"myHome Rewards" స్కీమ్‌ను సద్వినియోగం చేసుకునే క్రమంలో ఎయిర్‌టెల్ డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్ అలానే పోస్ట్ పెయిడ్ యూజర్లు ముందుగా MyAirtel యాప్‌లోకి వెళ్లండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీమీ ఎయిర్‌టెల్ అకౌంట్‌‌లలోకి

MyAirtel యాప్‌లోకి లాగిన్ అయిన తరువాత మీకు కేటాయించబడిన ఐడీ, పాస్‌వర్డ్‌లతో మీమీ ఎయిర్‌టెల్ అకౌంట్‌‌లలోకి లాగిన్ కావల్సి ఉంటుంది.

కస్టమర్ సర్వీసుకు ఫోన్ చేసి

మీకు ఒకవేళ అకౌంట్ లేకపోయినట్లయితే కస్టమర్ సర్వీసుకు ఫోన్ చేసి అకౌంట్‌‌‌ను క్రియేట్ చేసుకోండి.

సక్సెస్ ఫుల్‌గా లాగిన్ అయిన తరువాత

MyAirtel యాప్‌ ద్వారా మీమీ అకౌంట్‌లలోకి సక్సెస్ ఫుల్‌గా లాగిన్ అయిన తరువాత "myHome Rewards" ప్లాన్ కోసం రిక్వస్ట్ చేయండి. ఎస్ఎంఎస్ ద్వారా ప్లాన్ కన్ఫర్మేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

ప్రతినెలా 5జీబి డేటా

ప్లాన్ మీ పేరు మీద ఓకే అయిన వెంటనే ప్రతినెలా 5జీబి డేటాను మీరు ఉచితంగా పొందగలుగుతారు. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు ఈ ప్లాన్ వర్తించదు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Reliance Jio Effect: Airtel DTH, Broadband and Postpaid Users Can Avail Free 5GB Additional Data. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting