జియో 4జీని ఏడాది పాటు ఉచితంగా పొందటం ఎలా..?

రిలయన్స్ జియో ఆఫర్స్ గురించి సరికొత్త సమాచారం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది.

రిలయన్స్ జియో తన వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా జియో సిమ్‌ను పొందిన ప్రతి ఒక్కరికి 4జీ డేటాతో పాటు 4జీ వాయిస్‌కాల్స్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వెల్‌కమ్ ఆఫర్ డిసెంబర్ 31, 2016తో ముగుస్తుంది. అంటే మరో నెలలు మాత్రమే జియో 4జీ సేవలు ఉచితంగా పొందే అవకాశముంటుదన్నమాట.

Read More : 10జీబి 4జీ డేటా రూ.259కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏడాది పాటు జియో 4జీ నెట్‌వర్క్ ఫ్రీ..

ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో ఆఫర్స్ గురించి సరికొత్త సమాచారం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. 4జీ VOLTE సామర్థ్యంతో రిలయన్స్ ఆఫర్ చేస్తున్న LYF స్మార్ట్‌ఫోన్‌‌లను కొనుగోలు చేయటం ద్వారా ఏడాది పాటు జియో 4జీ నెట్‌వర్క్ ఉచితంగా లభిస్తుందట.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

LYF ఫోన్‌ను కొనుగోలు చేయటమే!

జియో 4జీని ఏడాది పాటు ఉచితంగా పొందే క్రమంలో ముందుగా మీరు చేయవల్సిన పని, కొత్త LYF ఫోన్‌ను కొనుగోలు చేయటమే.

రూ.2,999 దగ్గర నుంచి రూ.20,000 వరకు..

మార్కెట్లో రూ.2,999 దగ్గర నుంచి రూ.20,000 రేంజ్ వరకు LYF ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదో ఒక ఫోన్‌ను ఎంపిక చేసుకోండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియో సిమ్‌ను పొందండి

LYF ఫోన్2ను కొనుగోలు చేసిన వెంటనే జియో 4జీ సిమ్ కోసం అప్లై చేయండి. జియో సిమ్ను పొందే క్రమంలో మై జియో యాప్ సూట్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే ఓ బార్‌కోడ్ జనరేట్ అవుతుంది.

సమీపంలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్

ఈ కోడ్‌తో పాటు మీ ఆధార్‌ కార్డ్ ఇంకా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను తీసుకుని మీ సమీపంలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్ లేదా డిజిటల్ ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్‌కు వెళ్లండి.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

tele-verification ప్రక్రియను పూర్తి చేయవల్సి ఉంటుంది

కొత్త మొబైల్ నెంబర్‌తో కూడిన జియో 4జీ సిమ్ మీ పేరు మీద యాక్టివేషన్ అయిన వెంటనే tele-verification ప్రక్రియను పూర్తి చేయవల్సి ఉంటుంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో భాగంగా మీకు లభించే ఆఫర్స్‌ను జియో ప్రతినిదులు మీకు సూచించటం జరుగుతుంది. దీంతో మీ ఏడాది జియో ఆఫర్ యాక్టివేట్ అవుతుంది.

పాఠకులకు ముఖ్య గమనిక

పాఠకులకు ముఖ్య గమనిక : జియో ఈ ఆఫర్‌ను అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. కాబట్టి అనౌన్స్ చేసిన తరువాత ఈ ప్రొసీజర్‌ను ఫాలో అవ్వండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Here's a Trick to Get Free Reliance Jio 4G Data for 1 Year with Your New Smartphone. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting