జియో కొత్త ఆఫర్లు , మరికొద్ది గంటల్లోనే

సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌కు ప్రత్యామ్నాయంగా సరికొత్త టారిఫ్ ప్లాన్‌లను మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.

|

టెలికం రెగ్యులేటరీ అథారటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను వెనక్కితీసుకుంటున్నట్లు ప్రకటించిన రిలయన్స్ జియో ఇప్పటి వరకు ఆ స్కీమ్‌ను నిలుపుదల చేయలేదు.

Read More : డ్యుయల్ కెమెరా ఫోన్‌ల గురించి 7 ఆసక్తికర విషయాలు

జియో బిగ్ అనౌన్స్‌మెంట్

జియో బిగ్ అనౌన్స్‌మెంట్

సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌కు నిలిపివేతకు సంబంధించిన అధికారిక ప్రకటన జియో నుంచి మరికొద్ది గంటల్లో వెలువడే అవకాశముందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇందకు కారణం, జియో మరో షాకింగ్ టారిఫ్ ప్లాన్‌లకు సిద్ధమవటమే.

 జియో అఫిషియల్ వెబ్‌సైట్‌లో సమాచారం.

జియో అఫిషియల్ వెబ్‌సైట్‌లో సమాచారం.

జియో తన అఫిషియల్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన బ్యానర్‌ను బట్టి చూస్తూంటే, సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌కు ప్రత్యామ్నాయంగా సరికొత్త టారిఫ్ ప్లాన్‌లను మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ‘మా టారిఫ్ ప్యాక్ లను అప్ డేట్ చేస్తున్నాం, త్వరలోనే మరిన్ని ఆసక్తికర ఆఫర్లను పరిచయం చేయబోతున్నామంటూ' జియో తన వెబ్ సైట్ లో పేర్కొంది.

జియో దెబ్బకు విలవిల
 

జియో దెబ్బకు విలవిల

ఉచిత ఆఫర్లతో మార్కెట్లోకి ప్రవేశించిన రిలయన్స్ జియో ఇతర టెల్కోలకు చుక్కలు చూపిస్తోన్న విషయం తెలిసిందే. జియో ఇటీవల అనౌన్స్ చేసిన సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను తక్షణమే రిలయన్స్ జియో వెనక్కితీసుకోవాలంటూ ఇండియన్ టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశాలు జారీ చేసింది. జియో అనౌన్స్ చేస్తున్న కొత్త ఆఫర్ల దెబ్బకు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ప్రత్యర్థి కంపెనీలు భారీగానే నష్టపోతున్నాయి.

వాళ్లకు మాత్రం ఆఫర్ వర్తిస్తుంది..

వాళ్లకు మాత్రం ఆఫర్ వర్తిస్తుంది..

ట్రాయ్ ఆదేశాల నేపథ్యంలో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను నిలిపివేస్తున్నట్లు జియో ప్రకటించింది. అయితే, ఇప్పటికే ఈ ప్లాన్‌ను రీచార్జ్ చేసుకున్న వారికి మాత్రం ఆఫర్ అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది. కాగా, ట్రాయ్ తీసుకున్న నిర్ణయం.. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలకు కొంత ఊరటనిచ్చేదిగా భావించవచ్చు.

Best Mobiles in India

English summary
Reliance Jio to Revamp its Tariff Plans After Pulling Down the Summer Surprise Offer. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X