ఈ వార్ ఇప్పట్లో ఆగేలా లేదు, చేతులు దులుపుకున్న ట్రాయ్

ఇంటర్ కనెక్ట్ పాయింట్ల వ్యవహారంపై ట్రాయ్ కీలక వ్యాఖ్యలు, ఇంటర్ కనెక్ట్ పాయింట్ల వ్యవహారంలో ఈ రెండు టెల్కోల మధ్య ఎప్పటి నుంచో మంటలు

By Hazarath
|

ఉచిత ఆఫర్లతో దూసుకుపోతున్న జియో, దేశంలో నంబర్‌వన్ టెలికం ఎయిర్‌టెల్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకు వేడెక్కుతోంది. ఇంటర్ కనెక్ట్ పాయింట్ల వ్యవహారంలో ఈ రెండు టెల్కోల మధ్య ఎప్పటి నుంచో మంటల రాజుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇంటర్ కనెక్ట్ పాయింట్ల వ్యవహారంపై ట్రాయ్ కీలక వ్యాఖ్యలు చేసింది.

స్మార్ట్ టీవీలు వాడుతున్నారా..బికేర్ పుల్

వినియోగదారులకు సంబంధించిన అంశమని..

వినియోగదారులకు సంబంధించిన అంశమని..

ఇంటర్ కనెక్ట్ పాయింట్లు వినియోగదారులకు సంబంధించిన అంశమని పేర్కొంటూ ట్రాయ్ చేతులు దులుపుకుంది. అయితే ఈ వ్యవహారంలో తమ పర్యవేక్షణ కూడా ఉంటుందని నొక్కి చెప్పింది.

ఈ సమస్య ఇద్దరు ఆపరేటర్ల మధ్య అంశం కాదని

ఈ సమస్య ఇద్దరు ఆపరేటర్ల మధ్య అంశం కాదని

ఇంటర్ కనెక్ట్ పాయింట్ల అంశంపై కూలంకషంగా చర్చిస్తున్నట్టు పేర్కొన్న ట్రాయ్ ఈ సమస్య ఇద్దరు ఆపరేటర్ల మధ్య అంశం కాదని, వినియోగదారుడికి సంబంధించినదని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ పేర్కొన్నారు.

జియో, భారతీ ఎయిర్‌టెల్ మధ్య మాటల యుద్ధం

జియో, భారతీ ఎయిర్‌టెల్ మధ్య మాటల యుద్ధం

వెల్‌కమ్ ఆఫర్‌తో జియో మార్కెట్లోకి దూసుకొచ్చిన తొలి రోజు నుంచి ఇంటర్ కనెక్ట్ పాయింట్ల విషయంలో జియో, భారతీ ఎయిర్‌టెల్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సరైన ఇంటర్ కనెక్ట్ పాయింట్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే కాల్స్ డ్రాపవుతున్నాయంటూ జియో ఆరోపిస్తోంది.

జియో అనవసర ఆరోపణలు..

జియో అనవసర ఆరోపణలు..

అయితే తాము 19 కోట్ల మందికి సరిపడే సామర్థ్యంతో ఇంటర్ కనెక్ట్ పాయింట్లు ఏర్పాటు చేశామని, అయితే వాటిని చైతన్యం చేయడంలో విఫలమైన జియో అనవసర ఆరోపణలు చేస్తోందని ఎయిర్‌టెల్ చెబుతోంది.

ఎయిర్‌టెల్ అందరినీ తప్పుదోవ పట్టిస్తోందని..

ఎయిర్‌టెల్ అందరినీ తప్పుదోవ పట్టిస్తోందని..

ఎయిర్‌టెల్ విమర్శలను జియో కొట్టిపారేసింది. ఎయిర్‌టెల్ అందరినీ తప్పుదోవ పట్టిస్తోందని, వినియోగదారుల వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది

Best Mobiles in India

English summary
Reliance Jio Unable to Use Provided Points of Interconnect, Airtel Says read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X