జియో కథ కంచికి..? సర్వే చెప్పిన నిజాలు

బ్రేక్ అన్నదే లేకుండా ముందుకు సాగిన జియోపై ఇప్పుడు ఆసక్తికకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

By Hazarath
|

టెలికం మార్కెట్లోకి దూసుకువచ్చిన జియో అత్యంత తక్కువ సమయంలో అత్యధిక మంది యూజర్లను సంపాదించుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఉచిత ఆఫర్లతో కష్టమర్లను డేటా మత్తులో ముంచెత్తింది. బ్రేక్ అన్నదే లేకుండా ముందుకు సాగిన జియోపై ఇప్పుడు ఆసక్తికకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యూఎస్బీ రిపోర్ట్ చెప్పిన వాస్తవాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

హల్లోతో ఫేస్‌బుక్‌ పని అయిపోయినట్లేనా..?

సబ్ స్క్రైబర్లను పెంచుకోవడంలో..

సబ్ స్క్రైబర్లను పెంచుకోవడంలో..

టెలికాం మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చి, సబ్ స్క్రైబర్లను భారీగా పెంచుకుంటూ రిలయన్స్ జియో బ్రేక్ లేకుండా దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సబ్ స్క్రైబర్లను పెంచుకోవడంలో జియో వేగం తగ్గిపోయిందట.

సగానికి తగ్గిన యూజర్లు

సగానికి తగ్గిన యూజర్లు

మార్చి నెలలో కేవలం 5.8 మిలియన్ సబ్ స్క్రైబర్లను మాత్రమే రిలయన్స్ జియో తన నెట్ వర్క్ కు యాడ్ చేసుకుందని తాజా డేటాలో తెలిసింది. అదే ఫిబ్రవరి నెలలో 12.2 మిలియన్ సబ్ స్క్రైబర్లు జియోకు యాడ్ అయ్యారు.

యూఎస్బీ రిపోర్టు
 

యూఎస్బీ రిపోర్టు

ప్రస్తుతం సబ్ స్క్రైబర్లు పడిపోతున్నారని ట్రాయ్ డేటా ఆధారంగా యూఎస్బీ రిపోర్టు వెల్లడించింది. యూజర్లు తగ్గుతున్నప్పటికీ ముఖేష్ అంబానీ కంపెనీనే సబ్ స్క్రైబర్లను పెంచుకోవడంలో టాప్ లో ఉందని తెలిసింది.

జియో తర్వాత

జియో తర్వాత

జియో తర్వాత భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ లు ఉన్నాయి. జియో మార్కెట్ షేరు ఫిబ్రవరిలో 8.8 శాతం ఉండగా.. మార్చి నెలలో 9.3 శాతానికి పెరిగింది.

మార్చి నెలలో..

మార్చి నెలలో..

మార్చి నెలలో జియో సబ్ స్క్రైబర్ల వేగం తగ్గడం చూసి తామెంతో ఆశ్చర్యానికి గురయ్యామని, అదే నెలలో ఈ కంపెనీ ప్రైమ్ ఆఫర్ ను ప్రకటించినట్టు కూడా యూబీఎస్ పేర్కొంది.

జియోకు పోటీగా..

జియోకు పోటీగా..

ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ కంపెనీ నెట్ అడిక్షన్ మూడు మిలియన్లు, 2.1 మిలియన్లు, 1.8 మిలియన్లుగా ఉంది. జియోకు పోటీగా ఈ దిగ్గజాలు బంపర్ ఆఫర్లను ప్రకటించడంతో వీరు కూడా సబ్ స్క్రైబర్ల సంఖ్యను పెంచుకున్నారు.

రిలయన్స్ కమ్యూనికేషన్

రిలయన్స్ కమ్యూనికేషన్

ఇతర టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ కమ్యూనికేషన్, టాటా టెలిసర్వీసెస్, టెలినార్ మార్కెట్ షేరును కోల్పోతూనే ఉన్నాయని యూబీఎస్ పేర్కొంది.

వొడాఫోన్

వొడాఫోన్

వొడాఫోన్ తన బ్రాడ్ బ్యాండ్ సబ్ స్క్రైబర్లను మార్చి నెలలో రికవరీ చేసుకుంది.

ఎయిర్ టెల్

ఎయిర్ టెల్

ఎయిర్ టెల్ తన బ్రాడ్ బ్యాండ్ వ్యాప్తిని మరింత పెంచుకుంది. ఫిబ్రవరి నెలలో ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండు వ్యాప్తి 20.9 శాతం ఉండగా.. మార్చిలో ఇది 22.1 శాతానికి పెరిగింది.

Best Mobiles in India

English summary
Reliance Jio user addition slowing; Airtel could be long-term winner: UBS Read more at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X