జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్, మార్చి 31 వరకు పుల్ ఎంజాయ్

ప్రజలకు న్యూ ఇయర్ కానుకగా హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ తో ముందుకొచ్చిన జియో అధినేత

By Hazarath
|

ఈ మధ్య కాలంలో జియో ఉచిత ఆఫర్ పై సోషల్ మీడియాలో వస్తున్న కథలకు జియో అధినేత ముఖేష్అంబాని ఈ రోజు తెరదించారు. స్టాక్ హోల్డర్లతో ఈ రోజు జరిగిన సమావేశంలో జియోపై అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించారు. మూడు నెలలు, సంవత్సరం ఉచిత సేవలు పొడిగిస్తారనే ఊహాగానాలకు తెరదించుతూ హ్యాపి న్యూ ఇయర్ ఆఫర్ తో ముందుకు వస్తున్నట్లు ప్రకటించారు. జియో ఇన్వెస్టర్ల సమావేశంలో ముఖేష్ అంబాని చెప్పిన హైలెట్స్ పాయింట్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

రోజుకు 37 వేల స్మార్ట్‌ఫోన్లు హ్యాకింగ్, జీమెయిల్ ఖాతాలే టార్గెట్

ఉచిత సేవలను మార్చి 31 2017 వరకు

ఉచిత సేవలను మార్చి 31 2017 వరకు

జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ తో సరికొత్తగా యూజర్ల ముందుకు దూసుకురానుంది. ఈ ఆఫర్ ప్రకారం పాత యూజర్లు అలాగే కొత్త యూజర్లు జియో ఉచిత సేవలను మార్చి 31 2017 వరకు ఉపయోగించుకోవచ్చు.

ఇప్పటికన్నా 10 రెట్లు వేగంగా సేవలు

ఇప్పటికన్నా 10 రెట్లు వేగంగా సేవలు

ఈ హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ లో యూజర్లు ఇప్పటికన్నా 10 రెట్లు వేగంగా సేవలు పొందవచ్చని జియో అధినేత ఈ రోజు జరిగిన సమావేశంలో చెప్పారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మూడు నెలల కాలంలోనే

మూడు నెలల కాలంలోనే

కేవలం మూడు నెలల కాలంలోనే జియో దేశంలో ఎవరు చేరుకోలేని మైలురాయిని చేరుకొని సరికొత్త చరిత్రను తిరగరాసిందని కొనియాడారు. దీంతో పాటు జియోతో మీ డిజిటల్ లైఫ్ అంతా చాలా అందంగా ఉంటుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

క్యాష్ లెస్ వైపు అడుగులు వేసేందుకు

క్యాష్ లెస్ వైపు అడుగులు వేసేందుకు

దేశం క్యాష్ లెస్ వైపు అడుగులు వేసేందుకు జియో మనీ అందరికీ ఉపయోగపడుతుందని అది మీ చెంత ఉంటే డిజిటల్ ఏటీఎమ్ మీ ప్యాకెట్ లో ఉన్నట్లేనని జియో అధినేత సమావేశంలో చెప్పారు.సామాన్యులు కూడా జియోతో అద్భుతమైన సేవలు పొందుతున్నారని ఇది మార్పుకు నాంది అని తెలిపారు.

డిజిటల్ విప్లవానికి నాంది

డిజిటల్ విప్లవానికి నాంది

ప్రధానినరేంద్ర మోడీని ఈ సంధర్భంగా పొగిడారు. ప్రధాని నోట్ల రద్దుతో డిజిటల్ విప్లవానికి నాంది పలికారని ఈ సంధర్భంగా ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఙతలు తెలుపుతున్నామని ఆయన చెప్పినట్లుగా డిజిటల్ విప్లవం వైపు అడుగులు వేస్తామని తెలిపారు.

దాదాపు 80 శాతం మంది యూజర్లు

దాదాపు 80 శాతం మంది యూజర్లు

దేశంలో దాదాపు 80 శాతం మంది యూజర్లు రోజుకు 1 జిబి జియో డేటా కన్నా తక్కువగానే ఉపయోగిస్తున్నారని, ఇది ఇతర నెట్ వర్క్ లతో పోలిస్తే యావరేజ్ గా 30శాతం ఉంటుందని తెలిపారు.

డిసెంబర్ 4 నుంచి జియో కొత్త యూజర్లు

డిసెంబర్ 4 నుంచి జియో కొత్త యూజర్లు

డిసెంబర్ 4 నుంచి జియో కొత్త యూజర్లు డేటా ,వాయిస్,అలాగే, వీడియో కాల్స్ అన్నీ ఉచితంగా పొందవచ్చని ,ఇది మార్చి 31 2017 వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. దీన్ని జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ తో యూజర్ల ముందుకు తీసుకొస్తున్నామన్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Watch Mukesh Ambani Live: Reliance Jio welcome offer extended till March 31, 2017; SIM to be home delivered Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X