రోబోలతో తన్నుకుంటున్న అమెరికా..జపాన్

By Hazarath
|

అమెరికా..జపాన్ మధ్య రానున్న కాలంలో రోబోల వార్ రానుందా..రోబోలతో రెండు దేశాలు తలపడనున్నాయా...జరగుతున్న పరిణామాలు చూస్తే అవుననిపిస్తున్నాయి. జపాన్ రోబోలతను తయారుచేసి టెక్నాలజీలో దూసుకుపోతుంటే అమెరికా నేనేమి తీసిపోలేదన్నట్లుగా తాను రోబోలు తయారు చేస్తూ సత్తా చాటుతోంది. అయితే ఈ రెండు దేశాలు ఇప్పుడు బాక్సింగ్ యుద్ధం చేసే దానికి రోబోలను తయారు చేస్తున్నాయి.ఈ రోబోలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more : పై నుంచి మృత్యువు ముంచుకొస్తోంది

నాసా ఇప్పడు అదే పనిలో ..

నాసా ఇప్పడు అదే పనిలో ..

కిక్ బాక్సింగ్ ని చూస్తే ఎవరికైనా భలే మజా అనిపిస్తుంది కదా ..అలాంటిది ఇప్పుడు రెండు రోబోల మధ్య జరిగితే ఎలా ఉంటుంది. ఆ ధ్రిల్లే వేరుగా ఉంటుంది కదా.. సరిగ్గా నాసా ఇప్పడు అదే పనిలో పడింది.

 రోబోల ప్రాజెక్ట్

రోబోల ప్రాజెక్ట్

హాలీవుడ్ బ్లాక్ బస్టర్ అయిన ట్రాన్స్ ఫార్మర్ సిరిస్,రియల్ స్టీల్ సినిమాలకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఇప్పుడు నాసా ఈ రోబోల ప్రాజెక్ట్ ను నిజం చేసే పనిలో పడింది.

నాసా మెగా బోట్స్ కంపెనీతో కలసి జెయింట్ ఫైటింగ్ రోబోల తయారీ
 

నాసా మెగా బోట్స్ కంపెనీతో కలసి జెయింట్ ఫైటింగ్ రోబోల తయారీ

దీనిపై వరల్డ్‌ వైడ్‌గా ఆడియన్స్‌లో ఆదరణ పెరగడంతో నాసా మెగా బోట్స్ కంపెనీతో కలసి జెయింట్ ఫైటింగ్ రోబోలను తయారు చేసే పనిలో ఉంది.

రోబోల ప్రతాపం

రోబోల ప్రతాపం

మాములు బాక్సింగ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా రోబోలు తమ ప్రతాపాన్ని ప్రత్యర్థి రోబోలపై చూపుతున్నాయి.

 చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

ఈ రోబో బాక్సింగ్‌తో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.వీటి బాక్సింగ్‌కు మంచి మార్కెట్‌ ఉండడంతో రోబోల తయారుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఆసక్తి చూపుతున్నాయి.

కురాటాస్ నెంబర్‌వన్‌

కురాటాస్ నెంబర్‌వన్‌

అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి జెయింట్‌ రోబోట్స్‌ తయారు చేస్తున్నారు.ఇప్పుడు ఉపయోగిస్తున్న కురాటాస్ రోబోట్స్‌ బాక్సింగ్‌లో అసలు సిసలైన దిగ్గజాలు.ఇప్పటి వరకు రోబోట్‌ బాక్సింగ్‌లో కురాటాస్ నెంబర్‌వన్‌గా కొనసాగుతోంది.

జపాన్ కు పోటీ

జపాన్ కు పోటీ

వాటిని జపాన్‌కు చెందిన హెవీ సంస్ధ రూపోందించింది.వీటికి పోటీగా అత్యాధునిక టెక్నాలజీని వాడి జెయింట్‌ రోబోట్స్‌ను తయారు చేస్తోంది అమెరికాకు చెందిన మెగాబోట్స్‌.టెక్నాలజీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్‌ కాకుండా డిజైన్‌ చేస్తున్నారు.

టెక్నాలజీ పరంగా నాసా సాయం

టెక్నాలజీ పరంగా నాసా సాయం

దీనికి టెక్నాలజీ పరంగా నాసా సాయం అందిస్తోంది. కురాటాస్ రోబోట్స్‌ కంటే ఇప్పుడు తయ్యారు అవుతున్న రోబోలు దాదాపు ఐదు రెట్లు సామర్థ్యం ఎక్కువ. తమ కంపెనీ రోబోట్స్‌ తయారీలో అగ్రగామిగా నిలిస్తుందని తయారు చేస్తున్న ఇంజనీర్‌ మాట్ ఓయ్‌ర్లీన్‌ చెప్పుతున్నాడు.

Best Mobiles in India

English summary
Here Write robo war between japan and america

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X