రష్యా ‘ఉగ్ర’పంజా..మిస్సైల్స్‌తో ముప్పేట దాడి

By Hazarath
|

చెప్పినమాట చెప్పినట్లుగా రష్యా చేస్తోంది. వ్యూహాలతో ముందుకెళుతూ సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తోంది. తొలిసారి సెప్టెంబర్ 30 నుంచి దాడులు ప్రారంభించిన రష్యా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తమ దేశానికి చెందిన వైమానికి దళాలను రంగంలోకి దింపి ఎక్కడికక్కడే ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేస్తోంది.

Read more:అణు ఒప్పందంలో పెద్దన్న డబుల్ గేమ్

ఇప్పటికే చాలా వరకు సిరియాను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న రష్యా రాత్రి పూట సైతం నైట్ టైం క్రూయిజ్ మిసైల్స్ తో తో ఉగ్రవాద స్థావరాలను కూల్చి పడేస్తోంది. అయితే ఈ దాడులతో అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. రష్యా ఉగ్రవాదులపై సాగిస్తున్న దాడులను చూసి కంటి మీద కునుకు లేకుండా గడుపుతోంది. మరి సిరియాలో జరుగుతున్న ఈ యుద్ధంలో అగ్రరాజ్యాల వ్యూహాలేంది..ఎందుకు రష్యా దాడులు చేస్తోంది.అమెరికా ఎందుకు ఉలిక్కిపడుతోంది..ఇక చదవండి.

Read more: కన్ను మూసి తెరిచే లోపు సర్వనాశనం

అగ్రరాజ్యాలకు చురుకు

అగ్రరాజ్యాలకు చురుకు

ప్రపంచ దేశాలకు కొత్త భయాన్ని తెచ్చి పెట్టిన ఇస్లామిక్ స్టేట్ తీవ్ర వాద సంస్థకు రష్యా చుక్కలు చూపిస్తోంది. ఒకప్పుడు నాగరికతకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న సిరియాలో రక్తటేరులు పారిస్తూ అక్కడి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించటానికి ఇస్లామిక్ స్టేట్ సంస్థ వ్యూహాలు రచిస్తోంది.ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల బాధలు భరించలేక పెద్ద ఎత్తున వలసలు మొదలెట్టటంతో అగ్రరాజ్యాలకు చురుకుపుట్టింది. దీంతో.. ఐసిస్ మీద యుద్ధం ప్రకటించాయి.

ఇస్లామిక్ స్టేట్ సంస్థకు చుక్కలు

ఇస్లామిక్ స్టేట్ సంస్థకు చుక్కలు

ఇందులో భాగంగా రంగంలోకి దిగిన రష్యా ఇస్లామిక్ స్టేట్ సంస్థకు చుక్కలు చూపిస్తోంది. రష్యా ప్రయోగిస్తున్న క్షిపణి దాడులకు తల్లడిల్లిపోతోంది. తాజాగా రాత్రివేళలో ప్రయోగించిన క్షిపణితో ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఆయుధ ఫ్యాక్టరీతో పాటు.. ఆయుధాలు నిల్వ ఉంచే గిడ్డండి.. తీవ్రవాదుల శిక్షణకు ఉపయోగించే శిబిరంతో పాటు.. ఇంధన నిల్వలున్న ప్రాంతాల్ని సమూలంగా నాశనం చేశాయని చెబుతున్నారు.

గగనతల దాడులు

గగనతల దాడులు

ఐస్ఐస్ మిలిటెంట్లను హతమార్చడమే లక్ష్యంగా సిరియాలో గగనతల దాడులు మొదలుపెట్టామన్నారు పుతిన్. అంతేకాకుండా సిరియా ప్రభుత్వ వ్యతిరేకదారులపై కూడా బాంబు దాడులు జరుపుతామని ఆయన ప్రకటించారు. పాశ్చాత్య, అరబ్ దేశాలతోపాటు టర్కీ కూడా సిరియాలోని ఐస్ ఉగ్రవాదులపై ముప్పేట బాంబుదాడులు చేస్తున్న విషయం తెలిసిందే.

ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపేందుకు బ్రిటన్‌ పావులు

ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపేందుకు బ్రిటన్‌ పావులు

ఇక ఐఎస్‌ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపేందుకు బ్రిటన్‌ పావులు కదుపుతోంది. ఇందుకోసం 20 డ్రోన్‌లను కొనుగోలు చేయనున్నట్టు ఆదేశ ప్రధాని డేవిడ్‌ కేమరాన్‌ తెలిపారు. ఐఎస్‌ ఉగ్రవాదులతో పోరాడేందుకు బ్రిటన్‌ సైనిక సామర్థ్యాన్ని పెంచుతామన్నారు.

రష్యా అగ్నికి ఆజ్యం పోస్తున్నదంటూ..

రష్యా అగ్నికి ఆజ్యం పోస్తున్నదంటూ..

ఈ దాడులతో రష్యా అగ్నికి ఆజ్యం పోస్తున్నదంటూ అమెరికా రక్షణమంత్రి గుండెలు బాదుకున్నారు. బుధవారం బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి నోటీసు అందించిన గంటలోనే రష్యా యుద్ధవిమానాలు సిరియాలో బాంబులు కురిపించడం మొదలుపెట్టాయి.

రష్యా ఉద్దేశపూర్వకంగా దాడులు

రష్యా ఉద్దేశపూర్వకంగా దాడులు

సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తిరుగుబాటుదారులపై రష్యా ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నదంటూ అమెరికా ఆరోపిస్తున్నది. అసద్‌ను గద్దెదించడానికి నాలుగున్నరేళ్ళుగా అమెరికా నాయకత్వంలో జరుగుతున్న యుద్ధం రష్యా ప్రత్యక్ష ప్రవేశంతో కొత్త మలుపు తిరిగింది. రెండు అణ్వస్త్ర అగ్రరాజ్యాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రేగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఐక్యరాజ్య సమితి స్థాపించి ఈ ఏడాదికి డెబ్బయ్యేళ్ళయింది

ఐక్యరాజ్య సమితి స్థాపించి ఈ ఏడాదికి డెబ్బయ్యేళ్ళయింది

ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో ఉన్నది. దానిని స్థాపించి ఈ ఏడాదికి డెబ్బయ్యేళ్ళయింది. రాజ్యాల మధ్య తలెత్తే సమస్యలను నియంత్రించి, ఘర్షణలను నివారించి, ప్రపంచ శాంతికి ఐరాస పాటుపడుతుందని పాఠాల్లో చదువుకున్నాం. కానీ, దానిని ఒప్పించో, అడ్డుతప్పించో అగ్రరాజ్యాలు తాము కోరుకున్నది యధేచ్ఛగా చేసుకుపోతూనే ఉన్నాయి.

సీఐఏ ముద్దుబిడ్డల'ని అమెరికా మీడియా..

సీఐఏ ముద్దుబిడ్డల'ని అమెరికా మీడియా..

నాలుగేళ్ళ క్రితం సిరియా సైన్యం నుంచి వేరుపడి, అసద్‌ను కుప్పకూల్చడానికి పోరాడుతున్న ఈ ‘తిరుగుబాటు దారుల'కు అమెరికా అన్ని విధాలుగా అండగా ఉన్న విషయం తెలిసిందే. ‘సీఐఏ ముద్దుబిడ్డల'ని అమెరికా మీడియా ఈ ఆర్మీని ముద్దుగా పిలుచుకుంటుంది.

 అసద్‌ ప్రభుత్వాన్ని అంతం చేయడానికి..

అసద్‌ ప్రభుత్వాన్ని అంతం చేయడానికి..

ఇక, అసద్‌ ప్రభుత్వాన్ని అంతం చేయడానికి అమెరికా ఆయుధాలు సమకూర్చిన తిరుగుబాటుదారుల్లో అధికులు సిరియాలోని వివిధ ఇస్లామిక్‌ సంస్థల్లో ఉన్నారన్న వాస్తవాన్ని అమెరికన్‌ కాంగ్రెస్ కు సీఐఏ సమర్పించిన నివేదిక ఎన్నడో నిర్ధారించింది. ఇప్పుడు రష్యా గురిపెట్టింది ఈ సంస్థలనే కావడంతో అమెరికా అధినేతలు రష్యా మీద మండిపడుతున్నారు.

అసద్‌కు మద్దతివ్వాలనే రష్యన్‌ వ్యూహం

అసద్‌కు మద్దతివ్వాలనే రష్యన్‌ వ్యూహం

అసద్‌కు మద్దతివ్వాలనే రష్యన్‌ వ్యూహం అనివార్యంగా విఫలమవుతుందనీ, అదొక చారిత్రక తప్పిదమని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఇటీవలే వ్యాఖ్యానించారు. రష్యా యుద్ధవిమానాలు సిరియాలో దాడులు ఆరంభించగానే వైట్‌హౌస్‌ ప్రతినిధి ‘రష్యా తనకు తానుగా ముప్పు కొనితెచ్చుకుంటున్నది' అంటూ ఘాటుగా స్పందించారు.

నాలుగేళ్ళుగా అసద్‌ను గద్దెదింపడానికి జరిగిన ప్రయత్నాలు

నాలుగేళ్ళుగా అసద్‌ను గద్దెదింపడానికి జరిగిన ప్రయత్నాలు

కానీ, నాలుగేళ్ళుగా అసద్‌ను గద్దెదింపడానికి జరిగిన ప్రయత్నాలు ఏమయ్యాయో, ఏడాది క్రితం ఐ‌ఎస్‌ఐ‌ఎస్‌ను అంతం చేస్తామంటూ ప్రతినబూని ఏడువేల పైచిలుకు దాడుల అనంతరం అమెరికా కూటమి ఏం సాధించిందో అందరికీ తెలిసిందే. అదే జరిగివుంటే రష్యా ఇప్పుడు రంగంలోకి దిగివుండగలిగేది కాదు.

 సిరియాను సమస్యల ఊబిలోకి

సిరియాను సమస్యల ఊబిలోకి

అసద్‌ను గద్దెదించే లక్ష్యంతో ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలున్న వారికి ఆయుధాలను అందిస్తూ సిరియాను సమస్యల ఊబిలోకి నెట్టింది కాక, అసద్‌నూ, ఐ‌ఎస్‌ఐ‌ఎస్‌ను ఏకకాలంలో తుడిచిపెట్టేయాలన్న ఒక అసాధ్యమైన పనికి అమెరికా పూనుకున్నది.

అసద్‌ను అడ్డుతొలగిస్తే ఆ దేశంలో..

అసద్‌ను అడ్డుతొలగిస్తే ఆ దేశంలో..

అసద్‌ను అడ్డుతొలగిస్తే ఆ దేశంలో తన ఆశీస్సులున్న పాలకుడిని కూర్చోబెట్టవచ్చనీ, రష్యా పాత్ర లేకుండా అక్కడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చునన్నది అమెరికా ఆలోచన. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులపై జరిపే సమిష్టిపోరాటంలో అసద్‌ కూడా అంతర్భాగంగా ఉన్నప్పుడే ఆ పోరాటం విజయవంతమవుతుందని రష్యా వాదన.

ఇస్లామిక్‌ స్టేట్‌ ఇప్పుడు ప్రపంచానికి ప్రధాన శత్రువు

ఇస్లామిక్‌ స్టేట్‌ ఇప్పుడు ప్రపంచానికి ప్రధాన శత్రువు

రష్యా వాదన వెనుక దాని ప్రయోజనాలు ఏమిటన్నవి అటుంచితే, అసద్‌ను ఇప్పుడు కుప్పకూల్చితే సిరియాలో పరిస్థితులు మరింత దిగజారిపోతాయనీ, ఐఎస్‌ఐఎస్‌ను అడ్డుకోవడం అసాధ్యమన్న దాని వాదనలో వాస్తవం లేకపోలేదు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఇప్పుడు ప్రపంచానికి ప్రధాన శత్రువనీ, మరొక పక్కన సిరియాలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే పరిస్థితులు కూడా లేవనీ అమెరికాకు తెలియంది కాదు. కానీ, రష్యా అండదండలున్న అసద్‌ను అధికారంనుంచి కూల్చడమే దాని ప్రధాన లక్ష్యం.

ప్రపంచ రాజకీయ వాతావరణం

ప్రపంచ రాజకీయ వాతావరణం

సిరియా యుద్ధరంగంలోకి రష్యా దిగడంతో ఇప్పటికే సంక్లిష్టంగా ఉన్న వ్యవహారం ఉద్రిక్తంగా మారింది. రష్యా యుద్ధవిమానాలు లేదా అమెరికా, ఫ్రాన్స్‌ విమానాలు తమ లక్ష్యాలను ఛేదించే క్రమంలో పొరపాటున ఎదుటివారిపై దాడులు జరగవచ్చు. ఇటువంటి తప్పిదం ఒక్కటి జరిగినా ప్రపంచ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోతుంది.

శాంతి స్థాపనకు ఉపకరించకుండా అచేతనంగా

శాంతి స్థాపనకు ఉపకరించకుండా అచేతనంగా

ప్రచ్ఛన్నయుద్ధకాలం నాటి పరిస్థితులు దాపురిస్తాయి. ప్రాబల్యరాజ్యాల మధ్య ఘర్షణల వల్ల రెండు ప్రపంచయుద్ధాలు సంభవించిన నేపథ్యంలో 1945లో ఏర్పడిన ఐక్యరాజ్య సమితి డెబ్బయ్యేళ్ళ తరువాత కూడా శాంతి స్థాపనకు ఉపకరించకుండా అచేతనంగా మిగిలిపోవడం ఆవేదన కలిగిస్తున్నది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu

 

 

Best Mobiles in India

English summary
Here Write Russian Drones, Pilots Scouting Targets in Syria

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X