గూగుల్,యాహూ,మైక్రోసాఫ్ట్‌లకు సుప్రీం షాక్, అవి కనపడవిక !

లింగనిర్థారణకు సంబంధించిన సమాచారాన్ని 36 గంటల్లో తొలగించాలని ఆదేశాలు

By Hazarath
|

గూగుల్, యాహూ మైక్రోసాప్ట్ లాంటి ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థలకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ దిగ్గజాలపై నిఘా పెట్టాలని కేంద్రప్రభుత్వాన్ని కోరింది. ఈ నిఘాను పర్యవేక్షించేందుకు ఓ నోడెల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి డెడ్ లైన్ కూడా విధించింది.

 

ఆ వాట్సప్ వీడియో లింకు ఓపెన్ చేయకండి !

 గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్‌లకు ఆదేశాలు

గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్‌లకు ఆదేశాలు

భారతదేశంలో లింగనిర్థారణకు సంబంధించిన సమాచారాన్ని ఈ సెర్చ్ ఇంజిన్లు వెంటనే తొలగించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని సుప్రీంకోర్టు గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్‌లకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రజల్లో అవగాహన పెంచాలని

ప్రజల్లో అవగాహన పెంచాలని

పుట్టబోయేది అమ్మాయా, అబ్బాయా అని ముందే తెలుసుకోవడం చట్టరీత్యా నేరమని టీవీలు, రేడియోల ద్వారా విస్తృత ప్రచారం చేసి, ప్రజల్లో అవగాహన పెంచాలని సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 36 గంటల్లో తొలగించాలని
 

36 గంటల్లో తొలగించాలని

వీటికి సంబంధించిన కీ వర్డ్స్‌ను, సమాచారాన్ని అలాగే వాటికి సంబంధించిన ప్రకటనలను 36 గంటల్లో తొలగించాలని, అలా తొలగించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

తొలగించిన సమాచారాన్ని

తొలగించిన సమాచారాన్ని

భారతదేశంలో ప్రసారమవుతున్న ప్రకటనలను నోడల్ ఏజెన్సీ సిఫారసుల తొలగించి, ఆ తొలగించిన సమాచారాన్ని నోడల్ ఏజెన్సీకి తెలియజేయాలంటూ ఆదేశాలిచ్చింది.

 పిటిషన్ విచారణ సందర్భంగా

పిటిషన్ విచారణ సందర్భంగా

సబు మాథ్యూ జార్జి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా దీపక్ మిశ్రా, అమిత రాయ్ బెంచ్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది.

తదుపరి విచారణ

తదుపరి విచారణ

భ్రూణ హత్యలను నివారించేందుకు సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ వచ్చే ఫిబ్రవరి 17 కి వాయిదా వేసింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
SC orders Google, Yahoo and Microsoft to remove online exploited determinations ads read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X