గూగుల్ రహస్య ప్రాజెక్ట్స్ ఇవే..!

|

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విప్లవాత్మక ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ 'ఆల్ఫాబెట్'పేరుతో కొత్త హోల్డింగ్ కంపెనీని ప్రారంభించిన విషయం తెలిసిందే. గూగుల్‌ పరిధిలో ఉన్న అన్ని సంస్థలకు Alphabet మాతృ సంస్థగా వ్యవహరిస్తుంది.

గూగుల్ రహస్య ప్రాజెక్ట్స్ ఇవే..!

Read More : ఈ దీపావళికి రాబోతోన్న కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే‌

కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకాలపాలు సాగిస్తోన్న ఆల్ఫాబెట్ కంపెనీకి లారీ పేజ్ సీఈఓగానూ సెర్జీ బ్రిన్ అధ్యక్షుడుగాను వ్యవహరిస్తున్నారు. ఆల్ఫాబెట్ అంటే, కొన్ని అక్షరాల సముదాయం. ఓ భాషను సూచిస్తుంది. రేపటి తరాల మనుగడ కోసం గూగుల్ సీక్రెట్ ల్యాబ్‌లో చోటుచేసుకుంటున్న కొన్ని స్పెషల్ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్కైబెండర్..

స్కైబెండర్..

స్కైబెండర్.. ఇదో విప్లవాత్మక ప్రాజెక్ట్. ఎందుకంటే గూగుల్ తన 5జీ నెట్‌వర్క్ టెస్టింగ్‌కు పెట్టుకున్న పేరు ఇది. ఈ కోడ్ పేరుతోనే మెక్సికోలో గూగుల్ 5జీ నెట్ వర్క్ మీద పరీక్షలు జరుపుతోంది. అదీ చిన్న విమానాల ద్వారా ఈ టెస్ట్‌లు సీక్రెట్‌గా చేస్తోంది. కేవలం సౌర శక్తి ఆధారంగా ఈ పరీక్షలు గూగుల్ జరుపుతోంది.

ప్రాజెక్ట్ లూన్ పేరుతో..

ప్రాజెక్ట్ లూన్ పేరుతో..

ప్రాజెక్ట్ లూన్ పేరుతో గూగుల్, బెలూన్ ఇంటర్నెట్ ప్రయోగాన్ని చేపడుతోంది. ఈ ప్రయోగంలో భాగంగా పెద్దపెద్ద ఫ్లోటింగ్ బెలూన్లను భూమికి 20 కిలోమీటర్ల ఎత్తులో ఎగిరేలా చేసి వాటికి అనుసంధానించే వైర్ లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా ఇంటర్నెట్ సిగ్నళ్లను పంపిస్తారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆల్ఫాబెట్ పరిధిలోకి..

ఆల్ఫాబెట్ పరిధిలోకి..

ఇంటి పై ఏర్పాటు చేసిన ప్రత్యేక యంటీనాలు ఈ సిగ్నల్స్‌ను గ్రహించుకుని ఇళ్లలోని కంప్యూటర్లకు ఇంటర్నెట్ సేవలను అందిస్తాయి. ప్రాజెక్ట్ లూన్ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే టవర్ల సహాయం లేకుండా 4జీ ఇంటర్నెట్ మొబైల్ యూజర్లకు చేరువచేయవచ్చు. ఒక్కో బెలూన్ తనకు 40 కిలోమీటర్ల రేంజ్‌లో ఉన్న మొబైల్ ఫోన్‌లకు ఇంటర్నెట్‌ను చేరువచేయగలదు. ఈ ప్రాజెక్ట్ ఆల్ఫాబెట్ పరిధిలోకి వస్తుంది.

డ్రైవర్‌లెస్ కారు..

డ్రైవర్‌లెస్ కారు..

గూగుల్ ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ప్రాజెక్టులలో డ్రైవర్‌లెస్ కారు ప్రాజెక్ట్ ఒకటి. గూగుల్ తయారు చేసిన ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారులో స్టీరింగ్ వీల్, బ్రేక్స్, యాక్సిలరేటర్ ఉండవు. ఇవన్నీ కూడా కారులో ఉండే సాఫ్ట్‌వేర్, మెకానిక్స్ ద్వారా కంట్రోల్ చేయబడుతాయి. కారు పైభాగంలో మరియు ముందు వెనుక భాగాల్లో సెన్సార్లు, హెచ్‌డి సరౌండ్ కెమెరాలను ఇందులో ఉపయోగించారు. వీటితో పాటుగా మ్యాప్స్ సాయంతో కారు దానంతట అదే దిశానిర్దేశం చేసుకుంటుంది. 

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డయాబెటిక్స్ రోగుల కోసం

డయాబెటిక్స్ రోగుల కోసం

గూగుల్.. డయాబెటిక్స్ రోగుల కోసం స్మార్ట్ క్వాంటాక్ట్ లెన్స్ తయారీ పై దృష్టిసారించింది. ఈ లెన్స్ భవిష్యత్‌లో షుగర్ వ్యాధిగ్రస్తులకు మరింత ఉపయోగడనున్నాయి. రోజుకు 10 సార్లు తమ రక్తాన్ని తీుసుకుని పరీక్ష చేసుకోవచ్చు. ప్రస్తుతం నమూనా దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలో వాస్తవరూపాన్ని అద్దుకోనుంది. ఈ ప్రాజెక్ట్ ఆల్ఫాబెట్ పరిధిలోకి వస్తుంది.

ప్రాజెక్ట్ వాల్ట్..

ప్రాజెక్ట్ వాల్ట్..

గూగుల్ ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ప్రాజెక్టులలో ప్రాజెక్ట్ వాల్ట్ ఒకటి. మొత్తం ఆపరేటింగ్ సిస్టంను మెమరీ కార్డ్‌లో ఫిట్ చేయాలన్నది ఈ ప్రాజెక్ట్ ప్రధాన సంకల్పం. సెక్యూరిటీ ప్రధాన అంశంగా సాగుతున్న ఈ ప్రాజెక్టు విజయవంతమవ్వాలని ఆకాంక్షిద్దాం. ఈ ప్రాజెక్ట్ ఆల్ఫాబెట్ పరిధిలోకి తినేటప్పుడు చేతులు వణికే వారిని దృష్టిలో పెట్టుకొని గూగుల్ స్మార్ట్‌స్పూన్‌ను తీసుకువచ్చింది. పరిస్థితులకు అనుగుణంగా ఈ స్పూన్ దిశను మార్చుకునే విధంగా పత్రేక ఫీచర్లున ఈ స్మార్ట్ డివైస్‌లో పొందుపరిచారు. ఈ ప్రాజెక్ట్ ఆల్ఫాబెట్ పరిధిలోకి వస్తుంది.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్మార్ట్‌ స్పూన్‌

స్మార్ట్‌ స్పూన్‌

తినేటప్పుడు చేతులు వణికే వారిని దృష్టిలో పెట్టుకొని గూగుల్ స్మార్ట్‌స్పూన్‌ను తీసుకువచ్చింది. పరిస్థితులకు అనుగుణంగా ఈ స్పూన్ దిశను మార్చుకునే విధంగా పత్రేక ఫీచర్లున ఈ స్మార్ట్ డివైస్‌లో పొందుపరిచారు. ఈ ప్రాజెక్ట్ ఆల్ఫాబెట్ పరిధిలోకి వస్తుంది.

 ప్రాజెక్ట్  కాలికో..

ప్రాజెక్ట్ కాలికో..

గూగుల్ సంస్థ 2013లో కాలికో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కింద వృద్ధాప్యం కారణంగా వచ్చే వ్యాధులపై గూగుల్ విస్తృత పరిశోధనలు చేస్తోంది. మనిషి జీవితకాలాన్ని పెంచటమనేదే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. క్షీణించిన మానవ అవయవాల స్థానంలో త్రీడీ టెక్నాలజీని ద్వారా కృత్రిమ అవయవాలను అమర్చడం, మానవుడి జెనెటిక్ కోడ్‌ను పూర్తిగా మ్యాపింగ్ చేయటం వంటి ఆధునిక అంశాలను గూగుల్ ఈ ప్రాజెక్టులో భాగంగా పరిగణంలోకి తీసుకుంటోంది. ఈ ప్రాజెక్ట్ ఆల్ఫాబెట్ పరిధిలోకి వస్తుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Special Projects In Google's Secret Lab. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X