రూ. 6 వేల కోట్ల జరిమానాతో అల్లాడుతున్న టీసీఎస్

By Hazarath
|

టీసీఎస్ కు యుఎస్ కోర్టు భారీగానే షాకిచ్చింది. ఏకంగా 6000 కోట్ల రూపాయల జరిమానాను విధించింది. ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడంపై టీసీఎస్ ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది. హెల్త్ కేర్ కు సంబంధించిన ఓ సాప్ట్ వేర్ విషయంలో ఈ భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది.

Read more: ఇండియాలో ఇంటర్నెట్ ఎందుకు వాడుతున్నారంటే..

1

1

ప్రపంచంలోని అన్ని దిగ్గజ కంపెనీలకు సర్వీసెస్ ను అందించే టీసీఎస్‌కు యూఎస్ ఫెడరల్ కోర్టు ఏకంగా 940 మిలియన్ డాలర్ల ఫైన్ విధించింది.

2

2

హెల్త్ కేర్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అనుమతి లేకుండా తీసుకున్నందుకు అమెరికాలో టాటాకు చెందిన టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్పొరేషన్‌ను వెస్టర్న్ అమెరికాలోని విస్కన్సిన్ జిల్లాలో ఉన్న ఫెడరల్ కోర్టు ఎపిక్ సిస్టమ్స్?కు 240 మిలియన్ డాలర్లను చెల్లించాలని ఆదేశించింది.

3

3

ఈ సాఫ్ట్‌వేర్ తయారీ ప్రక్రియను 2012లో ఇరు కంపెనీలు ప్రారంభించాయి. ఒరేగాన్ కైసర్ పర్మనెంట్‌లోని కన్సల్టెంట్లను క్లయింట్లుగా ఎరిక్ సిస్టమ్స్ నియమించుకుంది. వీరు సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన 6,477 డాక్యుమెంట్లను ( వీటిలో 1,687 డాక్యుమెంట్లు ఎరిక్ సిస్టమ్స్‌కు చెందినవి) తీసుకున్నారు.

4

4

ఈ కేసును రెండు వారాల పాటు విచారించిన ఫెడరల్ జడ్జి విలియం ఎమ్.కాన్లీ ఎరిక్ అనుమతి లేకుండా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకున్నందుకు శిక్షగా 700 మిలియన్ డాలర్లు, నష్ట పరిహారంగా 240 మిలియన్ డాలర్లను టాటా ఇంటర్నేషనల్ ఎరిక్ కంపెనీకి చెల్లించాలని తీర్పునిచ్చారు.

5

5

తమ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకుని ప్రత్యర్ధి కంపెనీ మెడ్ మంత్ర అనే హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసుకున్నాయని ఎపిక్ ఆరోపిస్తోందని తెలిపారు. ఎపిక్‌కు చెందిన సమాచారాన్ని కైసర్ పర్మనెంటే కంపెనీ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు టీసీఎస్‌కు చెందిన ఉద్యోగి ఆ సమాచారాన్ని మరో ఇద్దరు ఉద్యోగులతో పంచుకున్నారని కోర్టుకు తెలిపింది.

6

6

కొన్నేళ్లుగా కష్టపడి తయారుచేసుకున్న సమాచారాన్ని టాటా కంపెనీయే ఉద్యోగుల నుంచి తస్కరించిందని ఎరిక్ ఆరోపిస్తోంది. దీనివల్ల మార్కెట్లో ఎపిక్‌ను నష్టపోయేలా చేయడం టీసీఎస్ లక్ష్యంగా పెట్టుకుందని తన 39 పేజీల ఫిర్యాదులో పేర్కొంది.

7

7

దీనిపై స్పందించిన ముంబై టీసీఎస్ అధికారి ఒకరు తమ ముందున్న ప్రశ్నలన్నింటికి కంపెనీ త్వరలో సమాధానం చెబుతుందని తెలిపారు.

Best Mobiles in India

English summary
Here Write TCS to appeal against US jury's $940 million notice

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X