టెక్ మహీంద్రాలో 30,000 కొత్త ఉద్యోగాలు

|

అంతర్జాతీయంగా వచ్చే రెండు సంవత్సరాల కాలంలో తమ గ్లోబల్ సీటింగ్ సామర్థ్యాన్ని 1.25లక్షలకు పెంచుకుంటామని టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీ తెలిపారు. ప్రస్తుతం తమకు 95,000 గ్లోబల్ సీటింగ్ సామర్థ్యం ఉందని, దేశంలోని 5వ అతిపెద్ద ఐటీ కంపెనీగా తాము అవతరించామని ఆయన తెలిపారు. త్వరలో విస్తరించే 30,000 సీటీంగ్‌లో అత్యధిక శాతం కేటాయింపు హైదరాబాద్, బెంగుళూరు, పూణేలతో పాటు విశాఖపట్నం, జైపూర్, భువనేశ్వర్‌లలో ఉంటుందని ఆయన తెలిపారు.

టెక్ మహీంద్రాలో 30,000 కొత్త ఉద్యోగాలు

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

20,000 మందికి పైగా నిపుణులతో హైదరాబాద్‌లో తమకు అతిపెద్ద కేంద్రం ఉందని గుర్నానీ తెలిపారు. విశాఖపట్నంలో తమకు1500 మంది ఉద్యోగులున్నారని ఈ సంఖ్యను మరింత పెంచేందుకు మరికొంత స్థలాన్ని కేటాయించినట్లు వివరించారు. అలానే, భువనేశ్వరలో నిర్మించిన కొత్త బ్లాక్ లో 600 మందికి అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. తమ ఆదాయంలో 2-3% నిధులను పరిశోధన- అభివృద్థికి కేటాయిస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ శివారు ప్రాంతమైన బహదూర్‌పల్లిలో ఇన్నోవేటివ్ ల్యాబ్స్ నిర్మాణం నిమిత్తం 100 మిలియన్ డాలర్లను వెచ్చించామని ఆయన వెల్లడించారు. టెక్ మహీంద్రా చేపట్టబోయే 30,000 సీటింగ్ విస్తరణలో భాగంగా మరో రెండు సంవత్సరాల కాల వ్యవధిలో 30,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగావకాశం లభించనుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Tech Mahindra to up global seating capacity by 30,000. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X