జియో దెబ్బకు భారీ నష్టాల్లో టెల్కోలు

జియో రాకతో టెలికాం సంస్థల ఆదాయం ఒక్కసారిగా 7 శాతం మేర పడిపోయింది.

By Hazarath
|

దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో విప్లవాత్మక మార్పునకు నాంది పలికిన సంగతి తెలిసిందే. అయితే జియో రాకతో టెలికాం సంస్థల ఆదాయం ఒక్కసారిగా 7 శాతం మేర పడిపోయిందని దేశీయ రేటింగ్ సంస్థ ఐసీఆర్ఏ తెలిపింది. జియో ఎఫెక్ట్‌తో పాటు నోట్ల రద్దు కూడా దీనికి జతచేరిందని తన నివేదికలో వెల్లడించింది. నోట్ల రద్దు టెలికాం రంగంపై ప్రభావం చూపిందని, ముఖ్యంగా ప్రీపెయిడ్ విభాగంలో నష్టాలకు కారణమైందని వివరించారు.ఇప్పటికే టెలికాం రంగం 4.25 ట్రిలియన్ రుణాలతో ఇబ్బంది పడుతోందని, జియో రాక, నోట్ల రద్దు కారణంగా 5-7శాతం ఆదాయాన్ని కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు.

2జీ, 3జీ ఫోన్లకు కూడా జియో వాడుకోవచ్చు: రిలయన్స్

 మరో మూడు నెలలు

మరో మూడు నెలలు

డిసెంబర్ 1వతేదీన రిలయన్స్ జియో అధినేత అంబాని జియో ఉచితాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తామని ప్రకటించారు. దీన్నే హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ తో కష్టమర్ల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆఫర్ బెనిఫిట్స్

ఆఫర్ బెనిఫిట్స్

ఈ ఉచిత ఆఫర్ కింద అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు ఉచిత ఎసెమ్మెస్ లు అలాగే జియో యాప్స్ యూజర్లకి ఫ్రీగా లభిస్తాయి. పాత యూజర్లకు కూడా ఇవి వర్తిస్తాయి. వారు కొత్త సిమ్ కొనుగోలు చేయనవసరం లేదు. వీరికి జనవరి 1 నుంచి ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

పాత, కొత్త మధ్య తేడాలు

పాత, కొత్త మధ్య తేడాలు

జియో వెలకం ఆఫర్ కొత్త సిమ్ లు కొనుగోలు చేసేవారికి వర్తించదు. ఈ ఆఫర్ వ్యాలిడిటీ డిసెంబర్ 31తో అయిపోతుంది. జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ డిసెంబర్ 4 నుంచి యూజర్లకు అందుబాటులో ఉంటుంది. రెండు ఆఫర్లు అన్ లిమిటెడ్ బెనిఫిట్స్ ని అందిస్తున్నాయి.

లిమిట్ ఆఫర్

లిమిట్ ఆఫర్

అయితే కొత్త ఆఫర్ లో జియో యూజర్లకు కేవలం రోజుకు 1 జిబి డేటాను మాత్రమే అందుకుంటారు. ఇది ఇతర నెట్ వర్క్ ల కన్నా 30 శాతం వేగంగా పనిచేస్తుందని జియో చెబుతోంది.

జియో స్పీడ్

జియో స్పీడ్

హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ లో కేవలం 1 జిబి డేటా మాత్రమే ఉండటంతో జియో స్పీడ్ పెరుగుతుందని జియో చెబుతోంది. జియో ప్లాన్లు కూడా 51రూపాయలతో స్టార్ట్ అవుతున్నాయి. ఇది 1జిబి డేటాతో యూజర్లకి లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Telcos may see 5-7% revenue decline owing to Reliance Jio’s extension of free services Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X