మానవసేవే మాధవసేవ అంటున్నకోట్లాధిపతులు

By Hazarath
|

మనిషి తన జీవితకాలంలో ఎంత సంపాదించినా కాని చివరకు తను ఎత్తుకుపోయేది ఏమీ ఉండదు..అతనికి కావలిసింది కేవలం ఆరడుగుల నేల..ఈ రోజుల్లో ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు. ఇతరులతో ఎంత పంచుకున్నామన్నది ముఖ్యం. అవును నిజమే ప్రపంచంలోని కుబేరులు ఇప్పుడు తమ సంపాదన ఎంతన్నది చూడకుండా ఇతరులతో ఎంత పంచుకున్నామని చూస్తున్నారు. డబ్బే జీవితం అనుకోకుండా ఆ డబ్బును సేవా కార్యక్రమాలకు దానం చేస్తున్న వీరు నిజంగా మహనీయులే...తమ సంపాదనలో 99 శాతం దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చిస్తున్న ఈ హీరోలు నిజంగా మహనీయులే.

Read more: రూ. 3 లక్షల కోట్లు దానం చేసిన ఫేస్‌బుక్ సీఈఓ

బిల్ గేట్స్.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు ( రూ. 1,78,000 కోట్లు)

బిల్ గేట్స్.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు ( రూ. 1,78,000 కోట్లు)

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు ముందు కూడా చాలామంది కోటీశ్వరులు తమకు తోచిన దానధర్మాలు చేసుండొచ్చు. అయితే సేవా కార్యక్రమాలు, విద్య, వైద్యం... మానవజీవితాన్ని సుఖమయం చేసే శాస్త్ర పరిశోధనలకు భూరి విరాళాలు అందించడాన్ని బిల్‌గేట్స్ ఒక ఉద్యమ స్థాయికి చేర్చారు. గేట్స్, వారెన్ బఫెట్‌లు ఇతర దాతలతో మాట్లాడుతున్నపుడు ‘గివింగ్ ప్లెడ్జ్'(సాయపడతామని ప్రతిజ్ఞ చేయడం) ఆలోచన కార్యరూపం దాల్చింది.

అజీమ్ ప్రేమ్‌జీ.. చైర్మన్, విప్రో ..( రూ 52,800 కోట్లు )

అజీమ్ ప్రేమ్‌జీ.. చైర్మన్, విప్రో ..( రూ 52,800 కోట్లు )

లైఫ్ టైమ్ డొనేషన్స్ 8 బిలియన్ డాలర్లు. కంపెనీ నికర విలువ 15.9 బిలియన్ డాలర్లు. అజీమ్ ప్రేమ్ జీ పౌండేషన్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలను నడుపుతున్నారు. ఇండియా లోని స్కూల్ అలాగే పరీక్షల కోసం ఈ సంస్థ ఎంతగానో కృషి చేస్తోంది. అజీం ప్రేమ్ జీ యూనివర్సిటీని స్థాపించి టీచర్ ట్రైనింగ్ లో సేవలు అందిస్తున్నారు. అంతేకాక ఇండియన్ స్కూళ్లలో కంప్యూటర్ ఎయిడెడ్ లియర్నింగ్ పోగ్రామ్ ను 18 భాషల్లో నేర్పిస్తున్నారు.

వారెన్ బఫెట్    సీఈవో, బెర్క్‌షైర్ హాత్‌వే    ( రూ. 1,41,900 కోట్లు )

వారెన్ బఫెట్ సీఈవో, బెర్క్‌షైర్ హాత్‌వే ( రూ. 1,41,900 కోట్లు )

రెక్కల కష్టంతో పోగు చేసిన సొమ్మును దానం చేయాలంటే మానవమాత్రులకు అంత తొందరగా మనసు రాదు. భిక్షగాడు ధర్మం చేయమని చేయి చాచితే ఓ రూపాయి దానం చేయడానికి రెండుసార్లు ముఖం అటుఇటూ తిప్పి వేస్తుంటారు కొందరు. ఐతే ప్రపంచ మానవాళిలో పేదలకు చేయూతనిచ్చేందుకు ఏకంగా రూ. 12,600 కోట్లు దానం చేసినవారు ఉన్నారంటే నమ్ముతారా...? ఇది నిజం. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు బెర్క్ షైర్ హాత్ వే CEO వారెన్ బఫెట్ దానం చేశారు. తన కంపెనీ బెర్క్ షైర్ హాత్ వే కు చెంది 1.66 కోట్ల షేర్లను ఆ ఫౌండేషన్‌కు దానంగా ఇచ్చారు.

పాల్ అలెన్.. మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు ( రూ. 13,200 కోట్లు )

పాల్ అలెన్.. మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు ( రూ. 13,200 కోట్లు )

లైఫ్ టైమ్ డొనేషన్స్ 2 బిలియన్ డాలర్లు. కంపెనీ నికర విలువ 17.3 బిలియన్ డాలర్లు. గ్లోబల్ హెల్త్ కోసం తన ఆస్తిని వినియోగిస్తున్నారు. పాల్ జీ అలెన్ ఫ్యామిలీ పౌండేషన్ పేరుతో సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలను వినియోగిస్తున్నారు. అంతే కాకుంగా సొర చేపల సంరక్షణకు అల్జీమర్ పై పరిశోధనలకు బిలియణ్ డాలర్ల మొత్తాన్ని వెచ్చిస్తున్నారు.

మార్క్ జుకర్‌బర్గ్ .....ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు( రూ. 10,560 కోట్లు )

మార్క్ జుకర్‌బర్గ్ .....ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు( రూ. 10,560 కోట్లు )

లైఫ్ టైమ్ డొనేషన్స్ 1.6 బిలియన్ డాలర్లు. కంపెనీ నికర విలువ 40.7 బిలియన్ డాలర్లు. ధనవంతులైన యువకుల్లో జుకర్ బర్గ్ ఒకరు. గేట్స్ ప్టెడ్జ్ కు కూడా చాలా పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చారు. అలాగే ఎబోలా మహమ్మారి మీద పోరాటానికి 25 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు కూతురు పుట్టిన ఆనందంలో దాదాపు 3 లక్షల కోట్లను విరాళంగా ఇస్తున్నారు.

జార్జ్ సోరస్... సోరస్ ఫండ్ మేనేజ్‌మెంట్   ( రూ. 52,800 కోట్లు)

జార్జ్ సోరస్... సోరస్ ఫండ్ మేనేజ్‌మెంట్ ( రూ. 52,800 కోట్లు)

లైఫ్ టైమ్ డొనేషన్స్ 8 బిలియన్ డాలర్లు. కంపెనీ నికర విలువ 15.9 బిలియన్ డాలర్లు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ పేరుతో కోట్లాది రూపాయలను సేవకు వినియోగిస్తున్నారు. ఇది 1979లో స్థాపించారు. అన్ని రంగాల్లో తమ సేవలను విస్తరించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా మానవ హక్కుల మీద ఈ సంస్థ చాలా పెద్ద స్థాయిలోనే పోరాటం చేస్తోంది.

చార్లెస్ ఫ్రాన్సిస్ ఫీనీ... డ్యూటీ ఫ్రీ షాపర్స్ గ్రూపు ( రూ. 41,580 కోట్లు)

చార్లెస్ ఫ్రాన్సిస్ ఫీనీ... డ్యూటీ ఫ్రీ షాపర్స్ గ్రూపు ( రూ. 41,580 కోట్లు)

ఈయన లైఫ్ టైమ్ డొనేషన్స్ 6.3 బిలియన్ డాలర్లు. కంపెనీ నికర విలువ 1.5 మిలియన్ డాలర్లు. ఫ్రీని పౌండేషన్ పేరుతో చదువు కోసం అలాగే సైన్స్ రంగం కోసం హెల్త్ కేర్ వంటి వాటికోసం భారీగానే నిధులను హెచ్చిస్తున్నారు. యుఎస్,వియాత్నం,బెర్ముడా వంటి దేశాల్లో సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నారు.

అబ్దుల్ అజీజ్ అల్ రజ్హీ ... అల్జ్హ్రీ బ్యాంకు వ్యవస్థాపకుడు  ( రూ.  37,620 కోట్లు)

అబ్దుల్ అజీజ్ అల్ రజ్హీ ... అల్జ్హ్రీ బ్యాంకు వ్యవస్థాపకుడు ( రూ. 37,620 కోట్లు)

ఈయన లైఫ్ టైమ్ డొనేషన్స్ 5.7 బిలియన్ డాలర్లు. కంపెనీ నికర విలువ 590 మిలియన్ డాలర్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఇస్లామిక్ బ్యాంకు. ఈ సంస్థ అన్ని రంగాల్లో తమ సేవా కార్యక్రమాలను చేస్తోంది. భారీగా విరాళాలను అందిస్తోంది. సౌదీ అరేబియాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

గార్డన్ మూర్... ఇంటెల్ సహవ్యవస్థాపకుడు ( రూ. 33,000 కోట్లు)

గార్డన్ మూర్... ఇంటెల్ సహవ్యవస్థాపకుడు ( రూ. 33,000 కోట్లు)

ఈయన లైఫ్ టైమ్ డొనేషన్స్ 5 బిలియన్ డాలర్లు. కంపెనీ నికర విలువ 6.5 బిలియన్ డాలర్లు. ఇంటెల్ కో ఫౌండర్ లో ఒకరు. ఇటీవలే గార్డన్ బెట్టీ మూర్ పౌండేషన్ స్థాపించారు.పర్యావరణ పరిరక్షణ, రోగి సంరక్షణ, సైన్స్, మరియు శాన్ ఫ్రాన్సిస్కో కమ్యూనిటీలో ప్రభావం చేయటంపై, ముప్పై మీటర్ టెలిస్కోప్ కు సముద్ర పరిరక్షణ ఇనిషియేటివ్ ఇలా అన్నింటిపై తన నిధులను వెచ్చిస్తున్నారు. విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు.

కార్లోస్ స్లిమ్ హెలూ .. మెక్సికో టెలికం దిగ్గజం ( రూ. 26,400 కోట్లు )

కార్లోస్ స్లిమ్ హెలూ .. మెక్సికో టెలికం దిగ్గజం ( రూ. 26,400 కోట్లు )

కార్సో కార్టోస్ గ్రూప్ ఛైర్మెన్. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఈయన లైఫ్ టైమ్ డొనేషన్స్ 27.3 బిలియన్ డాలర్లు. కంపెనీ నికర విలువ 4 బిలియన్ డాలర్లు. మెక్సికోలో జంతువుల సంరక్షణ కోసం 100 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టారు. అంతేకాకుండా అనేక ప్రఖ్యాత అంతర్జాతీయ సేవా సంస్థలకు కోట్లాది రూపాయలు దానంగా ఇచ్చారు. ఇప్పటికే ఇస్తూనే ఉన్నారు.

ఎలీ బ్రాడ్.. కేబీ హోమ్ సహవ్యవస్థాపకుడు ( రూ .21,780 కోట్లు )

ఎలీ బ్రాడ్.. కేబీ హోమ్ సహవ్యవస్థాపకుడు ( రూ .21,780 కోట్లు )

లైఫ్ టైమ్ డొనేషన్స్ 3.3 బిలియన్ డాలర్లు. కంపెనీ నికర విలువ 7.3 బిలియన్ డాలర్లు. ది బోర్డ్ పౌండేషన్ కో ఫౌండర్. సన్ అమెరికా మాజీ సీఈఓ. మ్యూజియంల డెవలప్ కోసం తన సేవా కార్యక్రమాలను ఈ సంస్థ చేపడుతోంది.

జార్జ్ కైసర్... బీఓకే ఫైనాన్షియల్ చైర్మన్ ( రూ. 21,780 కోట్లు )

జార్జ్ కైసర్... బీఓకే ఫైనాన్షియల్ చైర్మన్ ( రూ. 21,780 కోట్లు )

లైఫ్ టైమ్ డొనేషన్స్ 3.3 బిలియన్ డాలర్లు. కంపెనీ నికర విలువ 9.3 బిలియన్ డాలర్లు. బీవోక్ ఫైనాన్సియల్ స్థాపకుడు. జార్జ్ కౌసర్ ఫౌండేషన్ పేరుతో తమ సేవా కార్యక్రమాలను అందిస్తున్నారు. ఈ సంస్థ చదువు అలాగే హెల్త్ ప్రకృతి వంటి అంశాల్లో తమ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వీటితో పాటు ఇతర సేవా సంస్థలకు కూడా భారీ స్థాయిలో నిధులను అందిస్తోంది.

మైకేల్ బ్లూమ్‌బర్గ్....  ( రూ.  19,800 కోట్లు)

మైకేల్ బ్లూమ్‌బర్గ్.... ( రూ. 19,800 కోట్లు)

లైఫ్ టైమ్ డొనేషన్స్ 3 బిలియన్ డాలర్లు. కంపెనీ నికర విలువ 37.7 బిలియన్ డాలర్లు. బ్లూమ్ మెర్గ్ మీడియా కంపెనీ సీఈఓ అలాగే స్థాపకుడు కూడా. అయితే తన ఆస్తి మొత్తాన్ని బ్లూమ్‌బర్గ్ పౌండేషన్ కోసం వెచ్చిస్తున్నారు. ఈ సంస్థ చదువు అలాగే హెల్త్ ప్రకృతి వంటి అంశాల్లో తమ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ మధ్యనే 42 మిలియన్ డాలర్లతో వాట్ వర్క్ సీటీస్ ని లాంచ్ చేశారు. దీని ప్రధాన ఉద్దేశం 100 మిడ్ సైజ్ డ్ సీటీస్ లను బెటర్ గా తయారుచేయడమే.

లికా షింగ్    చైర్మన్, సీకే హచిసన్ హోల్డింగ్స్ రూ. 9,240 కోట్లు)

లికా షింగ్ చైర్మన్, సీకే హచిసన్ హోల్డింగ్స్ రూ. 9,240 కోట్లు)

లైఫ్ టైమ్ డొనేషన్స్ 1.4 బిలియన్ డాలర్లు. కంపెనీ నికర విలువ 26.6 మిలియన్ డాలర్లు.లికా ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. అయితే తన ధనాన్నంతా లికా షింగ్ పౌండేషన్ కు వినియోగిస్తున్నారు. ఈ సంస్థ చదువు అలాగే ఉపాధి, సాంస్కృతిక,హెల్త్ కేర్ రంగాలో తమ సేవలను అందిస్తోంది. చైనాలోనే అత్యంత పెద్ద యూనివర్సిటీ శాంతోయ్ యూనివర్సిటీన స్థాపకుడు ఇతనే.

జాన్ హంట్స్‌మన్ .... ( రూ. 7,920 కోట్లు)

జాన్ హంట్స్‌మన్ .... ( రూ. 7,920 కోట్లు)

లైఫ్ టైమ్ డొనేషన్స్ 1.2 బిలియన్ డాలర్లు. కంపెనీ నికర విలువ 940 మిలియన్ డాలర్లు. కెమికల్ తయారీ అయిన హంట్స్ మెన్ కార్పోరేషన్ కి జాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్. ఇతను క్యాన్సర్ మీద పోరాటానికి తన సంపాదనంతా వినియోగిస్తున్నారు. క్యాన్సర్ ను సమూలంగా నాశనం చేయడానికి దానికి మందులు కనిపెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందుకోసం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఉతాహ్ లో స్థాపించారు.ఈయన ఎక్కువ శాతం క్యాన్సర్ రీసెర్చ్ సంస్థలకు, అలాగే కాలేజీలకు తన ధనాన్ని వినియోగిస్తున్నారు. గివింగ్ ప్లెడ్జ్ కు ఈయన భార్యతో కలిసి 50 శాతం తమ సంస్థనుంచి విరాళం రూపంలో ఇస్తున్నారు.

టెడ్ టర్నర్... సీఎన్‌ఎన్ వ్యవస్థాపకుడు( రూ. 7,920 కోట్లు )

టెడ్ టర్నర్... సీఎన్‌ఎన్ వ్యవస్థాపకుడు( రూ. 7,920 కోట్లు )

లైఫ్ టైమ్ డొనేషన్స్ 1.2 బిలియన్ డాలర్లు. కంపెనీ నికర విలువ 2.1 బిలియన్ డాలర్లు. టీబీఎస్ కంపెనీకి మాజీ సీఈఓ అలాగే ఏఓఎల్ కు వైస్ చైర్మెన్ అండ్ డెరక్టర్ కూడా. ఇప్పుడు టర్నర్ ఎంటర్ ప్రెజెస్ కి చైర్మెన్ గా కొనసాగుతున్నారు. అలాగే టర్నర్ గ్లోబల్ ఫౌండేషన్ పేరుతో సంస్థను స్థాపించి తన సేవాతత్పరతను చాటుకుంటున్నారు. పరిసరాల అభివృద్ధికి అలాగే వన్యప్రాణుల సంరక్షణకు ఉన్న ఆస్తినంతా వినియోగిస్తున్నారు. అలాగే గేట్స్ ప్లెడ్జ్ కు 1 బిలియన్ డాలర్లు విరాళాన్ని అందించారు. మహిళలు అలాగే జనాభా, చిన్నపిల్లల ఆరోగ్యం తదితర అంశాలపై వీరు తమ సేవలను అందిస్తున్నారు.

జేమ్స్ సిమన్స్.... హెడ్జ్ ఫండ్ మేనేజర్   ( రూ. 7,920 కోట్లు)

జేమ్స్ సిమన్స్.... హెడ్జ్ ఫండ్ మేనేజర్ ( రూ. 7,920 కోట్లు)

లైఫ్ టైమ్ డొనేషన్స్ 1.2 బిలియన్ డాలర్లు. కంపెనీ నికర విలువ 12.3 బిలియన్ డాలర్లు. హెడ్జ్ పండ్ కంపెనీకి సీఈఓగా ఉన్న జేమ్స్ కు దాదాపు 60 బిలియన్ల డాలర్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం భార్యా భర్తలు ఇద్దరు కలిసి సిమన్స్ పౌండేషన్ పేరుతో సంస్థను స్థాపించారు. ఈ సంస్థ చదువు కోసం తమ సేవా మొత్తాలను వెచ్చిస్తోంది. తన ఇద్దరు కుమారులు అనుకోని పరిస్థితుల్లో మరణించడంతో వారి జ్జాపకార్థం ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా నేపాల్ లో ఈ సంస్థ సాంఘీక సమస్యల మీద ట్రైనింగ్ కూడా ఇస్తోంది. ఆస్టిమ్ రీసెర్చ్ కు దాదాపు 30 బిలియన్ డాలర్లు అలాగే ప్లెడ్జ్ కు 100 బిలియన్ డాలర్లు డొనేట్ చేశారు.

మైకేల్ డెల్.... డెల్ వ్యవస్థాపకుడు   ( రూ.  7,260 కోట్లు )

మైకేల్ డెల్.... డెల్ వ్యవస్థాపకుడు ( రూ. 7,260 కోట్లు )

లైఫ్ టైమ్ డొనేషన్స్ 1.1 బిలియన్ డాలర్లు. కంపెనీ నికర విలువ 18.9 బిలియన్ డాలర్లు. డెల్ కంపెనీ చైర్మెన్ కమ్ సీఈఓ. 1999లో స్థాపించిన మైకెల్ అండ్ సుసాన్ డెల్ పౌండేషన్ కు డైరెక్టర్ గా ఉన్నారు. చదువు,హ్యూమన్ సర్వీస్ .సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఈ సంస్థ పనిచేస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ సంస్థ 25 మిలియన్ల డాలర్లను ఆస్టిన్ లో టెక్ ఆసుపత్రి కోసం విరాథంగా ఇచ్చింది.

పియర్ ఒమిడ్యర్...ఈబే సహవ్యవస్థాపకుడు( రూ .6,600 కోట్లు )

పియర్ ఒమిడ్యర్...ఈబే సహవ్యవస్థాపకుడు( రూ .6,600 కోట్లు )

ఈబే కంపెనీని స్థాపించి అనతి కాలంలోనే పాపులర్ అయిన వ్యక్తి. లైఫ్ టైమ్ డొనేషన్స్ 1 బిలియన్ డాలర్లు. కంపెనీ నికర విలువ 6.2 బిలియన్ డాలర్లు. 1998లో తన భార్యతో కలిసి ఒమిడ్యర్ పౌండేషన్ ని స్థాపంచారు. ఈ సంస్థ డైవర్స్ సమస్యలు ఉన్నవారికి,లాగే మానవ హక్కుల కోసం,ఆహారం గేమ్స్ టెక్నాలజీ లాంటి విధ రంగాల్లో తమ సేవా కార్యక్రమాలను చేపడుతోంది. 2012లో భార్యాభర్తలు గేట్స్ ,బఫెట్ స్థాపించిన గివింగ్ ప్లెడ్జ్ లో జాయినయ్యారు. ఆ తర్వాత అనేక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.

దైత్మర్ హాప్ .. సాప్ సహవ్యవస్థాపకుడు ( రూ.  6,600 కోట్లు )

దైత్మర్ హాప్ .. సాప్ సహవ్యవస్థాపకుడు ( రూ. 6,600 కోట్లు )

లైప్ టైమ్ డొనేషన్ 1 బిలియన్ డాలర్లు. కంపెనీ నికర విలువ 6.3 బియిన్ డాలర్లు.దాతల్లో కెల్లా దాతగా మారిన హాప్ జర్మనీలో అనేక సేవా కార్యక్రమాలకు తన ఆస్తిని వినియోగిస్తున్నారు. ఆటలు.హెల్త్ ,చదువు మొదలగు రంగాల్లో సేవల కోసం ఈ మొత్తాన్ని వినియోగిస్తున్నారు.

Best Mobiles in India

Read more about:
English summary
Here Write The 20 most Tech and business generous people in the world

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X