తక్కువ ఖర్చుతో అధిక వేగంతో డేటా..

బహిరంగ ప్రదేశాల్లో వైఫై నెట్వర్క్లు,హాట్‌స్పాట్లు ఏర్పాటు. డేటా ఛార్జీలతో పోలిస్తే, పదోవంతుకే డేటా సేవలు

By Hazarath
|

ప్రధాని మోడీ డిజిటల్ ఇండియాలో సెల్ ఫోన్ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలకునే వారికి ఇంటర్నెట్ కనెక్టివిటీ, డేటా పథకాల కొనుగోలు అనేవి చాలా ఇబ్బందిగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ సమస్య పరిష్కారానికి అధిక వేగంతో డేటాను అతి తక్కువ ఖర్చుతో అందిస్తే చాలావరకు బయటపడవచ్చు. అందుకోసం ట్రాయ్ కసరత్తులు చేస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో వైఫై నెట్వర్క్లు, హాట్‌స్పాట్ల ఏర్పాటుకు తగిన నిబంధనవాళి రూపొందించడంలో నిమగ్నమైంది.

 

జియో తీపికబురు, ఈ సారి కష్టమర్లకు కాదు

20-25 రోజుల్లో విడుదల

20-25 రోజుల్లో విడుదల

డిజిటల్ లావాదేవీలు మరింతగా జరిగేందుకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులో ధరల్లో లభించాలని, ఇందుకోసమే బహిరంగ వైఫై నెట్వర్క్లపై నియమావళిని 20-25 రోజుల్లో విడుదల చేస్తామని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఛైర్మన్ ఆర్ఎస్ శర్మ పేర్కొన్నారు.

 పదోవంతుకే డేటా సేవలు

పదోవంతుకే డేటా సేవలు

ప్రస్తుత డేటా ఛార్జీలతో పోలిస్తే, పదోవంతుకే డేటా సేవలు అందించేందుకు బహిరంగ ప్రదేశాల్లో వైఫై నెట్వర్క్లు ఏర్పాటు చేయాలని ప్రతిపపాదించినట్లు గుర్తు చేశారు. బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందరికీ అందుబాటులో, నమ్మకంగా, పటిష్టంగా ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు.

వైఫై సేవలు అందించేందుకు
 

వైఫై సేవలు అందించేందుకు

అంతరాయం లేకుండా వైఫై సేవలు అందించేందుకు, వైఫై గ్రిడ్ నెలకొల్పాలన్న ప్రతిపాదన ఉందని తెలిపారు. బహిరంగ స్థలాల్లో వైఫై సేవలు ఉచితంగా అందించాలనే ప్రతిపాదన ట్రాయ్ చర్చాపత్రంలో లేదని, దీర్ఘకాలంలో ఇలాంటివి మనలేవని పేర్కొన్నారు.

వైఫై హాట్స్పాట్లు

వైఫై హాట్స్పాట్లు

బ్రాడ్‌బ్యాండ్ సేవలకు వైరుతో నెట్వర్క్ ఏర్పాటు చేయడం కష్టమౌతోంది కనుక, వైఫై హాట్స్పాట్లు నెలకొల్పాలని ప్రతిపాదించారు. బహిరంగ ప్రదేశాల్లో వైఫై ఏర్పాటు అత్యవసరంగా మారిందని, ఇందుకు అవసరమైన వైఫై హాట్స్పాట్లు నెలకొల్పేందుకు తగిన సిఫారసులు చేస్తామని వెల్లడించారు.

ఎంబీ డేటాకు 2 పైసల లోపే ఛార్జీ

ఎంబీ డేటాకు 2 పైసల లోపే ఛార్జీ

ట్రాయ్ గత జులైలో విడుదల చేసిన చర్చాపత్రం ప్రకారం మెగాబైట్ (ఎంబీ) డేటాకు 2 పైసల లోపే ఛార్జీ ఉండాలి. ఇప్పుడు 2 జీ, 3 జీ, 4 జీ డేటా నెట్వర్క్లలో చూస్తే ఎంబీకి సగటున 23 పైసలు అవుతోంది. దీన్ని తగ్గించేందుకు కసరత్తు ట్రాయ్ చేస్తోంది.

Best Mobiles in India

English summary
Trai to presents its recommendation on public wifi in 20-25 days read more at gzibot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X