ట్రాయ్ దెబ్బకు జుకర్ బర్గ్ విలవిల.. అయినా వదిలిపెట్టం !

By Hazarath
|

గత కొద్ది కాలం నుంచి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న అంశం ఏదైనా ఉందంటే అది నెట్ న్యూట్రాలిటీ వర్సెస్ ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్‌ల మధ్య యుద్ధమే. ఈ రెండు ఈ మధ్య అనేక చర్చలకు తెేలేపాయి కూడా. అయితే దేనివైపు మొగ్గుచూపాలన్న నిర్ణయం ట్రాయ్ చేతుల్లోకి వెళ్లింది. ఈ నేపధ్యంలో ట్రాయ్ ఫేస్‌బుక్‌కి ఝలక్ ఇచ్చింది. మేము ఫ్రీ బేసిక్స్ కన్నా నెట్ న్యూట్రాలిటీపైనే ఎక్కువ శ్రధ్ధ చూపుతున్నామని దానికే ఓటు వేసింది. ఈ హఠాత్పరిమాణానికి మార్క్ షాక్ తిన్నంత పనిచేశారు.

 

Read more: ఇంటర్నెట్‌ను కాపాడండి!, అసలేంటీ నెట్ న్యూట్రాలిటీ..?

Read more : షాక్ మీద షాక్: అల్లాడుతున్న ఫేస్‌బుక్‌

నెట్ న్యూట్రాలిటీకే మొగ్గు

నెట్ న్యూట్రాలిటీకే మొగ్గు

అంతర్జాలంలో అందరూ సమానమే అంటూ గళమెత్తిన నెట్ న్యూట్రాలిటీ సిద్ధాంత ఉద్యమకారుల అభిప్రాయాల వైపే టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ మొగ్గు చూపింది. నెట్ న్యూట్రాలిటీకే మొగ్గు చూపింది. డిజిటల్ సమానత్వం పేరుతో ఫేస్‌బుక్ అందిస్తున్న ఫ్రీబేసిక్స్, ఎయిర్టెల్ జీరో ప్లాన్ లాంటివి చెల్లవని పరోక్షంగా స్పష్టం చేసింది.

ఇంటర్నెట్ డేటాపై కంపెనీలు వివిధ రకాల ఛార్జీలను వసూలు చేయరాదని

ఇంటర్నెట్ డేటాపై కంపెనీలు వివిధ రకాల ఛార్జీలను వసూలు చేయరాదని

ఇంటర్నెట్లో సమాచార శోధనకు వినియోగదారుల నుంచి విభిన్న ధరలు వసూలు చేసే విధానం (డిఫరెన్షియల్ ప్రైసింగ్) ఏ కంపెనీ చేపట్టకూడదని తేల్చిచెప్పింది. ఇంటర్నెట్ డేటాపై కంపెనీలు వివిధ రకాల ఛార్జీలను వసూలు చేయరాదని భారత టెలికాం రెగ్యులేటరీ హెచ్చరించింది. కొత్త ఆంక్షలు వెంటనే అమలులోకి వస్తాయని ట్రాయ్ చైర్మెన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు.

ప్రస్తుతం అమలులో ఉన్న ఇంటర్నెట్ ప్యాకేజీలన్నీ
 

ప్రస్తుతం అమలులో ఉన్న ఇంటర్నెట్ ప్యాకేజీలన్నీ

ప్రస్తుతం అమలులో ఉన్న ఇంటర్నెట్ ప్యాకేజీలన్నీ వెంటనే రద్దు అవుతాయని ఆయన స్పష్టం చేశారు. డేటా ప్యాకేజీలు ఒకే రకంగా ఉండాలని ట్రాయ్ సూచించింది. తక్కువ ధరకే కొన్ని రకాల డేటాను అందించడం సరైన అంశం కాదని శర్మ పేర్కొన్నారు.

ట్రాయ్ ఇచ్చిన తాజా ఉత్తర్వులు

ట్రాయ్ ఇచ్చిన తాజా ఉత్తర్వులు

భారత టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఇచ్చిన తాజా ఉత్తర్వులు ఎయిర్ టెల్ జీరో, ఫేస్‌బుక్‌ ఫ్రీ బేసిక్స్ ప్రచారానికి పెద్ద ఎదురుదెబ్బ కానున్నాయి. గతకొద్ది నెలలుగా ఫ్రీ బేసిక్స్ పేరిట ఫేస్‌బుక్‌ భారీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నది.

ఫ్రీ బేసిక్స్ కోసం వాణిజ్య ప్రకటనలు

ఫ్రీ బేసిక్స్ కోసం వాణిజ్య ప్రకటనలు

ఫ్రీ బేసిక్స్ కోసం వాణిజ్య ప్రకటనలు ఇవ్వడమే కాకుండా వీటికి అందరు మద్దతు పలకాలని తన సోషల్ మీడియా సైట్లో నెటిజన్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రచారం ద్వారా ఫ్రీ బేసిక్స్ విషయంలో ఏకంగా ట్రాయ్‌తో ఫేస్‌బుక్‌ అమీతుమీకి దిగింది.

వినియోగదారులు పొందే కంటెంట్ ఆధారంగా

వినియోగదారులు పొందే కంటెంట్ ఆధారంగా

అయినప్పటికీ వినియోగదారులు పొందే కంటెంట్ ఆధారంగా డాటా చార్జీలు ఉండాలన్న ప్రతిపాదనను ట్రాయ్ తిరస్కరించింది. ఈ విషయంలో డాటా చార్జీల్లో వివక్ష చూపుతూ ఏ మొబైల్ ఆపరేటర్ అయినా ముందస్తు ఒప్పందం చేసుకుంటే తీవ్ర చర్యలు తప్పవని ట్రాయ్ హెచ్చరించింది.

50 వేల నుంచి రూ. 50 లక్షల వరకు జరిమానా

50 వేల నుంచి రూ. 50 లక్షల వరకు జరిమానా

ప్రొహిబిషన్ ఆఫ్ డిస్ర్కిమినేటరీ టారిఫ్స్ ఫర్ డేటా సర్వీసెస్ రెగ్యులేషన్స్ 2016 చట్టంలోని ఈ నిబంధనను ఉల్లంఘించేవారికి రూ. 50 వేల నుంచి రూ. 50 లక్షల వరకు జరిమానా విధిస్తామని ట్రాయ్ హెచ్చరించింది.

డేటా సేవలకు విభిన్న ధరలు నిర్ణయిస్తూ

డేటా సేవలకు విభిన్న ధరలు నిర్ణయిస్తూ

డేటా సేవలకు విభిన్న ధరలు నిర్ణయిస్తూ (కొందరికి ఉచితంగా, మరికొందరికి డబ్బులకు, కొన్ని సైట్లు ఫ్రీగా ..) ఏ సర్వీస్ ప్రొవైడరూ ఎలాంటి ఒప్పందం చేసుకోకూడదని, కంటెంట్ ఆధారంగా విభిన్న టారిఫ్‌లు నిర్ణయించి వసూలు చేయరాదని ట్రాయ్ తన ప్రకటనలో తేల్చిచెప్పింది.

పాటిస్తున్నారో లేదో తరచుగా పరిశీలిస్తామని

పాటిస్తున్నారో లేదో తరచుగా పరిశీలిస్తామని

ఈ నిబంధనలను సర్వీస్ ప్రొవైడర్లు పాటిస్తున్నారో లేదో తరచుగా పరిశీలిస్తామని, రెండేళ్ల తర్వాత లేదా అవసరమనుకుంటే అంతకన్నా ముందే ఈ నిర్ణయాన్ని మరోసారి సమీక్షిస్తామని వెల్లడించింది.

 ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ భారత్ తీసుకున్న నిర్ణయంతో

ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ భారత్ తీసుకున్న నిర్ణయంతో

అయితే నెట్ న్యూట్రాలిటీ కల్పించి కోట్లాది వినియోగదారులకు ఫ్రీ ఇంటర్నెట్ కల్పించాలని భావించిన ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ భారత్ తీసుకున్న నిర్ణయంతో నిరాశ చెందినట్లు తెలిపాడు. అయినప్పటికీ భారత్ సహా ప్రపంచ దేశాలలో నెట్ న్యూట్రాలిటీ అందించేందుకు కృషిచేస్తానని చెప్పాడు.

ఇంటర్నెట్.ఆర్గ్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని

ఇంటర్నెట్.ఆర్గ్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని

ఇంటర్నెట్.ఆర్గ్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని కానీ, భారత్ ఫ్రీ ఇంటర్నెట్ ను కట్టడిచేసిందని అభిప్రాయపడ్డాడు. తమతో పాటు ఇతర సంస్థలు ఇంటర్నెట్.ఆర్గ్ ద్వారా భారత్, ప్రపంచ దేశాలలో ఉచిత ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్ధపడగా, ట్రాయ్ తమను అడ్డుకున్నదన్నాడు.

10 కోట్ల మంది ఫ్రీ ఇంటర్నెట్ వినియోగించుకునే అవకాశం

10 కోట్ల మంది ఫ్రీ ఇంటర్నెట్ వినియోగించుకునే అవకాశం

38 దేశాల్లోని కోట్లమంది ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఫేస్‌బుక్ వాడతారని .. భారత్ లో కూడా 10 కోట్ల మంది ఫ్రీ ఇంటర్నెట్ వినియోగించుకునే అవకాశం ఉందని వివరించాడు.

సోలార్ పానెల్స్, శాటిలైట్స్, లేజర్స్, ఉద్యోగావకాశాలు

సోలార్ పానెల్స్, శాటిలైట్స్, లేజర్స్, ఉద్యోగావకాశాలు

సోలార్ పానెల్స్, శాటిలైట్స్, లేజర్స్, ఉద్యోగావకాశాలు ఇలా చాలా రంగాల వారికి ఉపయోగపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇతర విధానాలు ఏవైనా అన్వేషించి ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి తమ సంస్థ కృషి చేస్తుందని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి తెలిపారు.

రచ్చ రచ్చ అవుతున్న ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్

రచ్చ రచ్చ అవుతున్న ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్

రచ్చ రచ్చ అవుతున్న ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్రచ్చ రచ్చ అవుతున్న ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్

 

ట్రాయ్‌, ఫేస్‌బుక్ మధ్య ముదిరిన ఈ-మెయిల్ యుద్ధం

ట్రాయ్‌, ఫేస్‌బుక్ మధ్య ముదిరిన ఈ-మెయిల్ యుద్ధం

ట్రాయ్‌, ఫేస్‌బుక్ మధ్య ముదిరిన ఈ-మెయిల్ యుద్ధంట్రాయ్‌, ఫేస్‌బుక్ మధ్య ముదిరిన ఈ-మెయిల్ యుద్ధం

 

Best Mobiles in India

English summary
Here Write TRAI supports Net Neutrality bans differential pricing

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X