యుకె వెళుతున్నారా..రూల్స్ మారాయి, ఇకపై కష్టాలే !

ఇండియాలోని ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం, ఉద్యోగులకు ఇకపై కష్టాలే

Written By:

మారిన వీసా నిబంధనలతో ఇకపై యుకె వెళ్లాలన్న కోరిక భారంగా పరిణమించనుంది. తమ దేశంలోకి వలసవస్తున్న విదేశీ ఉద్యోగులను నిలువరించడమే లక్ష్యంగా యుకె సరికొత్త రూల్స్ ని అమల్లోకి తీసుకొచ్చింది. మారిన ఈ రూల్స్ నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. మారిన ఈ రూల్స్ ఇండియాలోని ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ట్రంప్ గెలవలేదు, అమెరికా ఎన్నికల్లో హ్యాకింగ్ ?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మారిన కొత్త నిబంధనలు

యుకెలో మారిన కొత్త నిబంధనలు భారత్ నుంచి వెళ్లే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావాన్నే చూపించనున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.

కొత్త రూల్స్ ప్రకారం

మారిన కొత్త రూల్స్ ప్రకారం నవంబర్ 24 తరువాత టైర్ -2 ఇంటర్నల్ కంపెనీ ట్రాన్స్ ఫర్ (ఐసీటీ) కోసం దరఖాస్తు చేసుకుంటే 30 వేల పౌండ్లు కట్టాలి. గతంలో ఇది 20.800 పౌండ్లు ఉండేదన్న సంగతి తెలిసిందే.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

90 శాతం భారత ఉద్యోగులే

అదేవిధంగా ఐసీటీ విధానంలో జారీ అయిన వీసాల్లో 90 శాతం భారత ఉద్యోగులే ఉండటంతో ఈ నిబంధన చూపే అత్యధిక ప్రభావం భారత ఐటీ కంపెనీలపైనే ఉంటుందని తెలుస్తోంది.

వేతనం

ఇక విదేశాల నుంచి తీసుకువచ్చే ఉద్యోగుల్లో టైర్ 2 సాధారణ ఉద్యోగులకు రూ. 20,80 లక్షల వేతనం ఉండాలని, అలాగే శిక్షణ నిమిత్తం వచ్చే గ్రాడ్యుయేట్ ట్రైనీలైతే వేతనం రూ. 19,14 లక్షలుగా ఉండాలని నిర్ణయించారు.

ఆఫర్ చేసేందుకు

ఇంత వేతనాలను ఆఫర్ చేసేందుకు ఐటీ కంపెనీలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. 

సంవత్సరానికి 20 మందిని మాత్రమే

దీంతో పాటు ఒక్కో కంపెనీ సంవత్సరానికి 20 మందిని మాత్రమే తీసుకురావాలన్న నిబంధన కూడా నేటి నుంచి యకేలో అమల్లోకి రానుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
UKs new Visa regulations set to hit Indian It firms read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting