అతి పెద్ద డీల్, ఒక్కటవనున్న ఐడియా వొడాఫోన్

దేశంలో అతి పెద్ద టెలికం డీల్‌కి తెరలేవనుంది. అతి పెద్ద టెలికం సంస్థగా ఆవిర్భవించేందుకు ఐడియా ,వొడాఫోన్ శరవేగంగా పావులు కదుపుతున్నాయి.

By Hazarath
|

దేశంలో అతి పెద్ద టెలికం డీల్‌కి తెరలేవనుంది. అతి పెద్ద టెలికం సంస్థగా ఆవిర్భవించేందుకు ఐడియా ,వొడాఫోన్ శరవేగంగా పావులు కదుపుతున్నాయి. బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్, దేశీయ అగ్రగామి సెల్యులర్‌ కంపెనీ ఐడియాల మధ్య విలీన ఒప్పందం నెలలోపు ఖరారు కానుంది.

 

టెల్కోలను ఘోరంగా దెబ్బ కొట్టిన జియో

 
idea

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 24-25 నాటికి ఈ రెండు సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన విలీన ఒప్పందాన్ని ప్రకటించనున్నాయి. డీల్‌పై సంతకాలకూ సిద్ధమైపోయినట్లుగా తెలుస్తోంది. అయితే, విలీనంపై అటు వొడాఫోన్, ఇటు ఐడియాలు మాత్రం గోప్యతను పాటిస్తున్నాయి.

ఒక్కటవుతున్న స్నాప్‌డీల్, పేటీఎమ్ !

idea

వొడాఫోన్‌ మాత్రం ఈ విలీన బాధ్యతలను తన భారత విభాగానికి లోగడ చీఫ్‌గా వ్యవహరించిన మార్టిన్‌ పీటర్స్‌కు అప్పగించింది. వొడాఫోన్‌ గ్రూపు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ విట్టోరియో కొలావో సైతం తన భారత విభాగంలోని అన్ని విభాగాల అధిపతులకు విలీనం గురించి వచ్చేవారం వివరించనున్నారు.

ఆపిల్ ఐఫోన్ 8పై కొత్త న్యూస్

idea

ఈ డీల్ సాకారమైతే 38 కోట్ల మంది కస్టమర్లతో అతిపెద్ద టెల్కోగా నిలుస్తుందని ఇండియా రేటింగ్స్‌ అంచనా వేసింది. అలాగే, ఆదాయం రూ.77,500 - 80,000 కోట్ల స్థాయిలో ఉండనుంది. ఇక స్పెక్ట్రమ్, మౌలిక వసతులపై ఇరు సంస్థలు వేర్వేరుగా భారీగా వ్యయం చేయాల్సిన అవసరం కూడా తప్పుతుంది.

Best Mobiles in India

English summary
Vodafone, Idea may merge this month read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X