ఐడియాలో వొడాఫోన్ విలీనం.. ఎయిర్‌టెల్, జియోలకు చెక్?

డీల్ విజయవంతమైనట్లయితే వొడాఫోన్, ఐడియా సంయుక్త కంపెనీ మార్కెట్ వాటా 43శాతానికి చేరుకుంటుంది. ఇదే సమయంలో ఎయిర్‌టెల్ మార్కెట్ షేర్ 32%గా ఉంటుంది.

ఇండియన్ టెలికామ్ సెక్టార్‌లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఐడియా సెల్యులార్ లో వొడాఫోన్ ఇండియాను విలీనం చేసేందుకు ఆదిత్యా బిర్లా గ్రూపుతో చర్చల్లో ఉన్నట్లు వొడాఫోన్ ధృవీకరించింది. ఇండస్ టవర్స్‌లో వొడాఫోన్‌కు సంబంధించి 42% వాటా మినహా అన్ని షేర్లను ఐడియాలో విలీనం చేసే అంశం పై ఆదిత్యా బిర్లా గ్రూపుతో చర్చలు ఉన్నట్లు వొడాఫోన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఐడియాలో వొడాఫోన్ విలీనం.. ఎయిర్‌టెల్, జియోలకు చెక్?

ఈ డీల్ విజయవంతమైనట్లయితే వొడాఫోన్, ఐడియా సంయుక్త కంపెనీ మార్కెట్ వాటా 43శాతానికి చేరుకుంటుంది. ఇదే సమయంలో ఎయిర్‌టెల్ మార్కెట్ షేర్ 32%గా ఉంటుంది. ఇక సబ్‌స్కైబర్ కౌంట్ విషయానికి వచ్చేసరికి వొడాఫోన్, ఐడియాలు సంయుక్తంగా 39 కోట్ల మంది చందాదారులను కలిగి ఉంటాయి. ఈ సంఖ్య ఎయిర్‌టెల్ 23 కోట్లు, రిలయన్స్ జియో యూజర్లు 7.2 కోట్ల యూజర్లతో పోలిస్తే చాలా ఎక్కువ. మార్కెట్లో నెలకున్న పోటీని తట్టుకునేందుకే ఈ విలీనం పై చర్చలు జరుపుతున్నట్లు వొడాఫోన్ తెలిపింది.


గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


English summary
Vodafone in talks for a merger with Idea Cellular, confirms company. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting