సిమ్ కార్డ్ ఎలా క్లోన్ చేస్తారు..?

|

మొబైల్ ఫోన్‌లలోని సిమ్‌లను క్లోన్ చేసి ఆర్ధిక మోసాలకు తెగబడే ప్రయత్నాలు జోరందుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొత్త రకం సైబర్ మోసాల్లో ఒకటైన సిమ్ క్లోనింగ్ మిమ్మల్ని బ్యాంక్ దివాళా కోరుగా మార్చేయగలదు. మీ పర్సనల్ సిమ్ కార్డ్‌ను క్లోన్ చేయటం ద్వారా హ్యాకర్లు ఆ నెంబరుతో అనసంధానమై ఉన్న మీ బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి అకౌంట్‌లో ఉన్న నగదును మీకు తెలియకుండా లూటీ చేసేయగలరు.

Read More : మీ ATM కార్డ్ గురించి షాకింగ్ నిజాలు!

హైటెక్ సాఫ్ట్‌వేర్‌ సహాయంతో...

హైటెక్ సాఫ్ట్‌వేర్‌ సహాయంతో...

సిమ్ కార్డ్‌లను క్లోన్ చేసేందుకు హైటెక్ సాఫ్ట్‌వేర్‌లను హ్యాకర్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి సిమ్‌కార్డ్ రీడర్ సహయంతో టార్గెటెడ్ యూజర్ మొబైల్ సిమ్‌లోని సమాచారాన్నివేరొక సిమ్‌కార్డ్‌లోకి కాపీ చేసేస్తారు. కొన్ని వైరస్ కమాండ్‌లతో కూడిన ఎస్ఎంఎస్‌ల ద్వారా కూడా సిమ్ క్లోనింగ్ సాధమ్యవుతుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

ఒక వ్యక్తికి తెలియకుండానే

ఒక వ్యక్తికి తెలియకుండానే

ఒక వ్యక్తికి తెలియకుండానే వారి ఫోన్ నుండి అవతలి వ్యక్తికి మెసేజ్ వెళ్లిందంటే ఆ నంబర్ క్లోన్ అయ్యిందనే అర్ధం చేసుకోవాలి. వెంటనే మీ మొబైల్ బిల్‌ను చెక్ చేసుకోండి. అందులో ఏమైనా మీకు తెలియని నెంబర్ల నుంచి కాల్స్ వెళ్లినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించండి.

ఆ ఫోన్ నెంబర్లకు స్పందించకండి

ఆ ఫోన్ నెంబర్లకు స్పందించకండి

#90, +92, #09 వంటి ప్రారంభ సంఖ్యతో వచ్చిన మిస్సుడ్ కాల్స్‌కు స్పందించకండి. ఎవరో తెలసుకోవాలన్న ఆత్రుతతో తిరిగి స్పందించే ప్రయత్నం చేస్తే మీ సిమ్‌కార్డ్ చోరికి గురయ్యే ప్రమాదముంది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఇప్పటి వరకు ఆగంతకుల ఉచ్చులో లక్ష మంది వినియోగదారులు ఇరుక్కున్నట్లు సమాచారం.

ఆ డేంజర్ కాల్‌కు

ఆ డేంజర్ కాల్‌కు

ఆ డేంజర్ కాల్‌కు తిరిగి స్పందించిన వెంటనే.. కాల్ సెంటర్ ప్రతినిధినంటూ ఒక వ్యక్తి మీతో మాట్లాడటం ప్రారంభిస్తారు. మీ సిమ్‌కార్డ్ కనెక్టువిటీ స్థాయిని పరీక్షించాల్సి ఉందని #90 లేదా #09 సంఖ్యను ప్రెస్ చెయ్యమని ఆదేశిస్తారు.

వారి మాటలను నమ్మి

వారి మాటలను నమ్మి

వారి మాటలను నమ్మి ఆ సంఖ్యను ప్రెస్‌చేస్తే ఫోన్‌లోని కీలక సమాచారం కాపీ కాబడుతుంది. క్లోనింగ్ కాబడిన సదరు వ్యక్తి సిమ్ కార్డును ఆగంతకులు ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటారు.

 సీడీఎమ్ఏ కార్డులను క్లోన్ చేసినంత సులువుగా

సీడీఎమ్ఏ కార్డులను క్లోన్ చేసినంత సులువుగా

హ్యాకర్లు సీడీఎమ్ఏ కార్డులను క్లోన్ చేసినంత సులువుగా జీఎస్ఎమ్ కార్డులను క్లోన్ చేయలేరని నిపుణులు చెబుతున్నారు.

GSM కార్డులను క్లోన్ చెయ్యాలంటే

GSM కార్డులను క్లోన్ చెయ్యాలంటే

GSM కార్డులను క్లోన్ చెయ్యాలంటే సిమ్ కార్డులను ఫోన్ నుండి బైటికి తీయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

ఫోన్‌కు సిమ్ కార్డుకు మధ్య

ఫోన్‌కు సిమ్ కార్డుకు మధ్య

బైటకు తీసాక ఫోన్‌కు సిమ్ కార్డుకు మధ్య క్లోనింగ్ జరిగే సిమ్ కార్డ్ రీడర్ ను ఉంచి కొద్ది రోజుల పాటు ఆపరేట్ చేయాల్సి ఉంటుందని తద్వారా రహస్య కోడ్‌తో సహా క్లోనింగ్ చేయవచ్చని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

 

 

Best Mobiles in India

English summary
What is sim card cloning. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X