చైనాకు దిమ్మతిరిగింది :అప్పుడే హెచ్చరికలు మొదలుపెట్టింది

By Hazarath
|

మొన్న జరిగిన సర్జికల్ స్ట్రైక్ దెబ్బకి పాకిస్తాన్ సంగతి అటుంచితే చైనా ఇప్పుడు కిందా మీదా పడుతోంది. చైనా వస్తువులను బ్యాన్ చేయాలని భారత ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుతో అనేక చోట్ల చైనా వస్తువులను బ్యాన్ చేస్తున్నారు. దెబ్బతో ఒక్కసారిగా బిత్తరపోయిన చైనా ఆత్మరక్షణలో పడింది. దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. పూర్తి సారాంశంపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

త్వరపడండి: రూ.24కే 1 జిబి డేటా, ఎన్ని సార్లయినా..

ట్విట్టర్ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోడీ

ట్విట్టర్ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోడీ

ట్విట్టర్ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనాపై విరుచుకుపడిన విషయం విదితమే. సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు చైనా వత్తాసు పలుకుతోంది. అందుకే చైనాకు దిమ్మ తిరిగేలా చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఢిల్లీలోని సదర్ బజార్‌లో చైనా వస్తువులను

ఢిల్లీలోని సదర్ బజార్‌లో చైనా వస్తువులను

దీంతో ఢిల్లీలోని సదర్ బజార్‌లో చైనా వస్తువులను బహిష్కరించారు. చైనా వస్తువులను సదర్ బజార్ వ్యాపారస్తులు పూర్తిగా నిషేధించారు. మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్‌ను మాత్రమే విక్రయిస్తామని ముక్తకంఠంతో చెబుతున్నారు.

రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌రింత దిగ‌జారుతాయ‌ని

రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌రింత దిగ‌జారుతాయ‌ని

అయితే త‌మ వ‌స్తువుల‌ను బ‌హిష్క‌రించ‌డం వ‌ల్ల రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌రింత దిగ‌జారుతాయ‌ని చైనీస్ మీడియా అప్పుడే హెచ్చ‌రించ‌డం మొద‌లుపెట్టింది. ఓ వైపు చైనీస్ పెట్టుబడులను ఆకట్టుకుంటూనే, మరోవైపు చైనీస్ ఉత్పత్తులను భారత్ బాయ్‌కాట్ చేస్తుందని ఆ దేశ మీడియా ఆరోపించింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలను

చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలను

ఇదిలా ఉంటే భారత్ వాణిజ్యలోటును పూడ్చుకోవడానికి చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలను భారత్ ఎక్కువగా ఆకట్టుకుంటుందని, ఇక్కడ తయారీ ప్లాంటులను నెలకొల్పడానికి అనుమతులు ఇస్తున్నట్టు గ్లోబ‌ల్ టైమ్స్ ప‌త్రిక ఈ కథనాల్లో వివరించింది.

ఓ వైపు చైనీస్ పెట్టుబడులను ఆకట్టుకుంటూనే

ఓ వైపు చైనీస్ పెట్టుబడులను ఆకట్టుకుంటూనే

ఓ వైపు చైనీస్ పెట్టుబడులను ఆకట్టుకుంటూనే, మరోవైపు చైనీస్ ఉత్పత్తులను భారత్ బాయ్‌కాట్ చేస్తుందని ఆ దేశ మీడియా ఆరోపించింది. 

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మ‌రింత ఎక్కువై సంబంధాలు దెబ్బ‌తింటాయ‌ని

మ‌రింత ఎక్కువై సంబంధాలు దెబ్బ‌తింటాయ‌ని

ఇప్ప‌టికే రెండు దేశాల మ‌ధ్య వాణిజ్య లోటు పెరిగిపోతోంద‌ని, ఈ బహిష్క‌ర‌ణ ద్వారా అది మ‌రింత ఎక్కువై సంబంధాలు దెబ్బ‌తింటాయ‌ని గ్లోబ‌ల్ టైమ్స్ ప‌త్రిక క‌థ‌నం వెలువ‌రించింది.

ఉచిత సలహాలు

ఉచిత సలహాలు

భారత్ వంటి అతిపెద్ద మార్కెట్లోకి చైనీస్ ఉత్పత్తులను ఎలాంటి అవరోధాలు లేకుండా అనుమతించాలని, ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాక్ట్ర్చర్‌ను విస్తరించుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి భారత్ దృష్టిసారించాలని ఉచిత సలహాలు కూడా ఇచ్చింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గోవాలో జరుగబోతున్న బ్రిక్స్ స‌మావేశాల్లో

గోవాలో జరుగబోతున్న బ్రిక్స్ స‌మావేశాల్లో

గోవాలో జరుగబోతున్న బ్రిక్స్ స‌మావేశాల్లో భాగంగా మోదీ, జీ జిన్‌పింగ్ వాణిజ్య లోటుపై చర్చించే అవ‌కాశం కూడా లేద‌ని ఆ ప‌త్రిక వెల్ల‌డించింది.

భారత్ బాయ్‌కాట్ పిలుపు విజయవంతం కాదని

భారత్ బాయ్‌కాట్ పిలుపు విజయవంతం కాదని

ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే..భారత్ బాయ్‌కాట్ పిలుపు విజయవంతం కాదని దక్షిణాసియా-పశ్చిమ చైనా కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్‌కు చెందిన స్కాలర్ ఝెన్ బో పేర్కొన్నారు. భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యేవి చైనా వస్తువులేనని పేర్కొన్నారు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్

అక్టోబరు మొదటి వారంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ సంస్థల ద్వారా అత్యధికంగా అమ్ముడుపోయినవి చైనా వస్తువులేనని తెలిపారు. ఇక షియోమీ అయితే మూడు రోజుల్లోనే ఈ మాధ్యమాల ద్వారా ఏకంగా 5 లక్షల ఫోన్లు విక్రయించినట్టు గుర్తు చేశారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2014తో పోలిస్తే 2015లో

2014తో పోలిస్తే 2015లో

2014తో పోలిస్తే 2015లో భారత్‌లో చైనా పెట్టుబడులు ఆరు రెట్లు పెరిగాయని, మొత్తంగా 870 మిలియన్ డాలర్లను చైనా పెట్టుబడులు పెట్టిందని పేర్కొన్నారు.ఏది ఏమైనా సోషల్ మీడియా బాయ్‌కాట్ పిలుపుతో తమకు వచ్చే నష్టమేమీ లేదని పేర్కొంది.

భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల్లో

భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల్లో

ప్రపంచదేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఆరోవంతు చైనా నుంచే వచ్చిపడుతున్నాయన్న విషయ తెలియనిది కాదు. తాజా లెక్కల ప్రకారం, ద్వైపాక్షిక వాణిజ్యంలో 5200కోట్ల డాలర్ల అంతరం ఉందని అంచనా.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చైనా నుంచి వచ్చే వస్తువులన్నీ

చైనా నుంచి వచ్చే వస్తువులన్నీ

అయితే చైనా నుంచి వచ్చే వస్తువులన్నీ ఇండియా తయారు చేసుకోగల వస్తువులే. చైనాను మించిన అద్భుతమైన నాణ్యతతో తయారు చేసుకోగల సత్తా భారతీయ పారిశ్రామికరంగానికి ఉంది. అయితే ఉత్పత్తి వ్యయమే దీనికి ప్రధాన అడ్డంకిగా మారింది.

మేక్ ఇన్ ఇండియా కల

మేక్ ఇన్ ఇండియా కల

పలురకాల వస్తువులను భారత్ ఉత్పత్తి చేసే ఖర్చులో మూడోవంతు ఖర్చుతోనే చైనా ఈ వస్తువులను తయారుచేస్తుందని వర్తక విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నైపధ్యంలో చైనా వస్తువులకు చెక్ పెట్టగల సామర్ధ్యం ఇండియాకి ఉందా అనేది సందేహాంగా మారింది. అదే జరిగితే మేక్ ఇన్ ఇండియా కల సాకారమైనట్లే..

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ప్ర‌చారం త‌మ‌పై తీవ్ర ప్ర‌భావం

ఈ ప్ర‌చారం త‌మ‌పై తీవ్ర ప్ర‌భావం

ఇదిలా ఉంటే ఈ ప్ర‌చారం త‌మ‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంద‌ని వ్యాపార‌స్తులు అంటున్నారు. ఇప్ప‌టికే కోట్ల రూపాయ‌లు చైనా వ‌స్తువుల‌పై పెట్టుబ‌డి పెట్టామ‌ని, ఈ స‌మ‌యంలో వాటిని బహిష్క‌రిస్తే వేల కుటుంబాలు రోడ్డున ప‌డుతాయ‌ని వాళ్లంటున్నారు.

ఈ ప్ర‌చారాన్ని ఆపాల‌ని

ఈ ప్ర‌చారాన్ని ఆపాల‌ని

ఈ ప్ర‌చారాన్ని ఆపాల‌ని వాళ్లు నేత‌ల‌ను వేడుకుంటున్నారు. స్వ‌దేశీ వ‌స్తువుల‌నే అమ్ముతున్న మ‌రికొంద‌రు వ్యాపార‌స్తులు మాత్రం ఈ బ‌హిష్క‌ర‌ణ‌ను స్వాగ‌తిస్తున్నారు. ఏం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Why Indian government is not banning Chinese gadgets? read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X