విండోస్ 10 వచ్చేసింది.. ఉచితంగా!

|

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంను 190 దేశాల్లో విడుదల చేసింది. చట్టబద్ధమైన విండోస్ 7, విండోస్ 8.1 యూజర్లు ఈ ఆపరేటింగ్ సిస్టంకు ఉచితంగా అప్‌గ్రేడ్ కావొచ్చు. ముందుగా రిజిస్టర్ చేసుకున్న యూజర్లకు మాత్రమే ఈ ఉచిత అప్‌డేట్ లభిస్తుంది. జెన్యున్ విండోస్ 7, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టంలను కలిగి ఉన్న పీసీ యూజర్లకు టాస్క్‌బార్ పై విండోస్ 10 నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఈ నోటిఫికేషన్ పై క్లిక్ చేయటం ద్వారా విండోస్ 10కు అప్ గ్రేడ్ కావొచ్చు.

Read More: విండోస్ 10 వచ్చేసింది.. ఉచితంగా!

విండోస్ 10 బిజినెస్ వర్షన్ ఆగస్టు 10 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఆధునిక స్మార్ట్ మొబైలింగ్, స్మార్ట్ కంప్యూటింగ్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడిన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌పోన్‌లు, ఎక్స్‌బాక్స్ గేమింగ్ కన్సోల్స్, హోలో లెన్స్, వైర్‌లెస్ గ్రాఫిక్ హెడ్‌సెట్ వంటి మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులన్నింటిని సపోర్ట్ చేస్తుంది.

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లు

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లు

విండోస్ 10లో పొందుపరిచిన స్టార్ట్ మెనూ కొత్త లుక్‌లో మరింత యూజర్ ఫ్రెండ్లీగా దర్శనమిస్తుంది. ఈ సరికొత్త స్టార్ట్ మెనూ సాంప్రదాయ అలానే మోడ్రన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది.

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లు

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లు

విండోస్ 10 యూజర్లు తమ పీసీ స్ర్కీన్ పై మల్టిపుల్ డెస్క్‌‌టాప్‌లను ఓపెన్ చేసుకుని వాటిలో కావల్సిన విండోలను ఓపెన్ చేసుకుంటూ సౌకర్యవంతమైన బ్రౌజింగ్‌ను ఆస్వాదించవచ్చు.

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లు
 
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లు

సాధారణంగా విండోస్ యూజర్లు తమ పీసీ స్ర్కీన్ పై ఓపెన్ చేసిన విండోలను సమీక్షించేందుకు Alt+Tab షార్ట్‌కట్‌ను వినియోగిస్తుంటారు. అయితే, విండోస్ 10 యూజర్ల కోసం మైక్రోసాఫ్ట్, ఓపెన్ చేసిన విండోలను సమీక్షించేందుకు ఓ ప్రత్యేకమైన బటన్‌ను విండోస్ 10 టాస్క్‌బార్‌లో పొందుపరిచింది. ఈ టాస్క్ స్విచర్ మల్టీ టాస్కింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది.

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లు

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లు

విండోస్ 10లోని స్టార్ట్ మెనూతో సమీకృతం చేయబడిన సరికొత్త యూనివర్సల్ సెర్చ్ ఫీచర్ ద్వారా పీసీలో ఇన్స్‌స్టాల్ చేసిన అప్లికేషన్‌లతో పాటు వెబ్‌లోని అంశాలను శోధించవచ్చు. మైక్రోసాఫ్ట్ సెర్చ్‌ఇంజన్ ‘బింగ్' వెబ్‌సెర్చ్‌కు తోడ్పడుతుంది.

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లు

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లు

విండోస్ 10లో ఏర్పాటు చేసిన స్నాప్ వ్యూ ఫీచర్ ద్వారా ఏకకాలంలో నాలుగు అప్లికేషన్‌లను స్ర్కీన్ పై ఓపెన్ చేసుకుని లావాదేవీలను నిర్వహించుకోవచ్చు.

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లు

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లు

మోడ్రన్ యాప్స్ విండోస్ 10 యూజర్లు తమ పీసీలో మోడ్రన్ అప్లికేషన్‌లతో పాటు సాంప్రదాయ (ట్రెడిషనల్) అప్లికేషన్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లు

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లు

యూనివర్సల్ అప్లికేషన్ స్టోర్

ఈ యాప్ స్టోర్ విండోస్ 10 ఆధారిత డెస్క్‌టాప్, టాబ్లెట్ అలానే స్మార్ట్‌ఫోన్‌లను సపోర్ట్ చేస్తుంది. విండోస్ 10 యూజర్లు తమకు కావల్సిన యాప్‌లను ఈ స్టోర్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు.

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లు

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లు

సరికొత్త కమాండ్ ప్రాంప్ట్ విండోస్ 10లో ఏర్పాటు చేసిన కమాండ్ ప్రాంప్ట్ సరికొత్త ఫీచర్లతో అలరిస్తుంది.

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లు

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లు

ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లు

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లు

ఎడ్జ్ పేరుతో సరికొత్త బ్రౌజర్‌ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం కోసం ఎడ్జ్ పేరుతో సరికొత్త బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ స్థానంలో ఎడ్జ్ బ్రౌజర్ పనిచేస్తుంది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌తో పోలిస్తే మరింత వేగవంతంగా స్పందించే ఈ ఎడ్జ్ బ్రౌజర్‌లో ఇన్‌బిల్ట్ నేషనల్ టూల్, డిస్ట్ర్రాక్షన్ ఫ్రీ రీడింగ్ మోడ్, వాయిస్ అసిస్టెంట్ యాప్ ఫర్ విండోస్ ఫీచర్లను నిక్షిప్తం చేసినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే అన్ని డివైజ్‌లలో ఈ ఎడ్జ్ బ్రౌజర్ అందుబాటులో ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ఇంకా టాబ్లెట్ కంప్యూటర్లను ఏసర్, డెల్, హెచ్‌పీ ఇంకా లెనోవో బ్రాండ్‌లు నేటి నుంచి విక్రయించునున్నాయి. విండోస్ 10ను రాబోయే రోజుల్లో కోట్లాది మంది వినియోగదారులు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకుంటారని మైక్రోసాఫ్ట్ అంచనా వేస్తోంది. విండోస్ 10 విడుదల సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పందిస్తూ రానున్న రోజుల్లో 100 కోట్ల కంప్యూటర్లలో తమ విండోస్ 10 ఉండాలన్నది తమ సంకల్పమని అన్నారు.

Read More: మీకు తెలియకుండా ఇంకొకరు వాడుతున్నారా..?

Best Mobiles in India

English summary
Windows 10 has launched: here's how to download it.Read More in Telugu Gizbot.....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X