గ్రహాంతరవాసుల గుట్టు చైనా చేతిలో

By Hazarath
|

చైనా సంచలనానికి తెరలేపింది. ప్రపంచంలోనే అతి పెద్ద టెలిస్కోప్ ను సిద్ధం చేస్తోంది. దీని ద్వారా అంతరిక్షంలో గుసగుసలు సైతం స్పష్టంగా వినపడతాయి. ఎక్కడ ఏ చిన్న శబ్దం అలికిడైనా కాని ఈ రేడియో టెలిస్కోప్ ద్వారా తెలిసిపోతుంది. అంతే కాదు గ్రహంతరవాసులు అంతరిక్షంలో ఏ చిన్న శబ్దం చేసినా కాని అది చైనా లోని ఈ టెలిస్కోప్ కు చేరిపోతుంది. వారి జాడను తెలుసుకోడానికి చైనా ఈ అతి పెద్ద రేడియో స్కోప్ ను తయారు చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు విశ్వాన్ని మధించివేయాలని చైనా భావిస్తోంది.

 

Read more : ఈ కంప్యూటర్ల స్పీడు మీ కంటికే చిక్కదు

దాదాపు 1244 కోట్ల రూపాయలతో చైనా ఈ భారీ నిర్మాణం

దాదాపు 1244 కోట్ల రూపాయలతో చైనా ఈ భారీ నిర్మాణం

ప్రపంచంలోనే అతి పెద్ద రేడియో టెలిస్కోప్ ను చైనా నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అంతరిక్షంలో గుసగుసలు సైతం ఈ టెలిస్కోప్ నుంచి స్పష్టంగా వినొచ్చు. ఈ ప్రాజెక్టు ఇప్పుడు తుది దశకు చేరుకుంది. దాదాపు 1244 కోట్ల రూపాయలతో చైనా ఈ భారీ నిర్మాణం చేపట్టింది.

500 మీటర్ల వ్యాసంతో, భారీ యంత్రాలతో

500 మీటర్ల వ్యాసంతో, భారీ యంత్రాలతో

500 మీటర్ల వ్యాసంతో, భారీ యంత్రాలతో గిజో రాష్ట్రంలో ఈ నిర్మాణం చేపట్టారు. 'ఫైవ్ హండ్రెడ్ మీటర్ ఎపర్చర్ స్ఫెరికల్ టెలిస్కోప్' (ఫాస్ట్) అనే పేరున్న ఈ టెలిస్కోప్.. దాదాపు 30 ఫుట్‌బాల్ మైదానాలను కలిపితే ఎంత అవుతుందో.. అంత పరిమాణంలో ఉంటుంది.

2016 సెప్టెంబర్ నాటికి దీని నిర్మాణం పూర్తవుతుందని
 

2016 సెప్టెంబర్ నాటికి దీని నిర్మాణం పూర్తవుతుందని

ఈ అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణానికి చైనా ఐదేళ్ల సమయం తీసుకుంది. 2016 సెప్టెంబర్ నాటికి దీని నిర్మాణం పూర్తవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులోని రిఫ్లెక్టర్ డిష్ ప్రపంచం అంతటి నుంచి సిగ్నల్స్ అందుకుంటుంది.

2003లో తొలిసారిగా దీనికి సంబంధించిన ప్రతిపాదన

2003లో తొలిసారిగా దీనికి సంబంధించిన ప్రతిపాదన

2003లో తొలిసారిగా దీనికి సంబంధించిన ప్రతిపాదన వచ్చింది. దీని బాడీ 500 మీటర్ల వ్యాసం ఉండటంతో.. దీనిచుట్టూ నడిచేందుకు 40 నిమిషాల సమయం పడుతుంది. ఈ టెలిస్కోపులో మొత్తం 4,500 ప్యానళ్లుండగా.. వాటిలో చాలావరకు త్రికోణాకారంలో ఉంటాయి.

సైడ్ ప్యానెల్స్ 11 మీటర్ల పొడవు

సైడ్ ప్యానెల్స్ 11 మీటర్ల పొడవు

సైడ్ ప్యానెల్స్ 11 మీటర్ల పొడవు ఉన్నాయి. ఇప్పటివరకూ టెలిస్కోప్‌లోని ముఖ్యమైన దశలు పూర్తయ్యాయని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చీఫ్ సైంటిస్ట్ లీ డి వెల్లడించారు. ఈ టెలిస్కోప్ డిజైన్ అర్థం చేసుకోవడం అంత కష్టం ఏమీ కాదని, ఇది దాదాపు ఓ పెద్ద టీవీ యాంటెనాలాగే ఉంటుందని ఆయన చెప్పారు.

ఇప్పటికే పనిచేస్తున్న 'అరెసిబో' టెలిస్కోప్ కంటే

ఇప్పటికే పనిచేస్తున్న 'అరెసిబో' టెలిస్కోప్ కంటే

సిగ్నళ్లు అందుకునే ప్రాంతం ఎక్కువగాను, మరింత సౌకర్యంగాను ఉండటంతో.. ఇప్పటికే పనిచేస్తున్న 'అరెసిబో' టెలిస్కోప్ కంటే రెండు రెట్లు ఎక్కువ పరిమాణంలో ఆకాశాన్ని స్కాన్ చేస్తుందన్నారు. అలాగే సున్నితత్వం కూడా 3-5 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

పాలపుంతలో ఇప్పటివరకు ఎవరికీ తెలియని కొత్త నక్షత్రాలను

పాలపుంతలో ఇప్పటివరకు ఎవరికీ తెలియని కొత్త నక్షత్రాలను

దీంతో.. పాలపుంతలో ఇప్పటివరకు ఎవరికీ తెలియని కొత్త నక్షత్రాలను కనుక్కోవడం సాధ్యమవుతుందని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన లిస్టర్ స్టావెలీ స్మిత్ అనే అంతరిక్ష శాస్త్రవేత్త తెలిపారు.

గ్రహాంతర జీవుల అన్వేషణ కోసం

గ్రహాంతర జీవుల అన్వేషణ కోసం

ఇక అన్ని రంగాల్లో అమిత వేగంతో దూసుకుపోతున్న చైనా.. అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. గ్రహాంతర జీవుల అన్వేషణ కోసం ఈ అతిపెద్ద రేడియో టెలిస్కోపు ‘ఫాస్ట్' నిర్మిస్తోందిని కూడా తెలుస్తోంది.

2011లో ప్రారంభించిన ఈ టెలిస్కోపు నిర్మాణం

2011లో ప్రారంభించిన ఈ టెలిస్కోపు నిర్మాణం

2011లో ప్రారంభించిన ఈ టెలిస్కోపు నిర్మాణం తుది దశలో ఉంది. వచ్చే ఏడాది దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. చైనాలోని గిజో ప్రావిన్స్‌లోని పర్వతప్రాంతంలో ఈ టెలిస్కోపును రూపొందిస్తున్నారు. పర్వతాల్లో గిన్నెఆకారపు ప్రాంతంలో దీన్ని నిర్మిస్తున్నారు.

4,450 ప్యానెళ్లతో రూపొందించే ఈ టెలిస్కోపు

4,450 ప్యానెళ్లతో రూపొందించే ఈ టెలిస్కోపు

4,450 ప్యానెళ్లతో రూపొందించే ఈ టెలిస్కోపు రిఫ్లాక్టార్ వ్యాసం 500 మీటర్లు ఉంటుంది. ఒక్కొక్క ప్యానెల్ 11 మీటర్ల భుజపొడవుగల సమబాహు త్రిభుజ ఆకారంలో ఉంటుంది. విశ్వం నుంచి వెలువడే చిన్నచిన్న రేడియో తరంగాలను సైతం ఈ టెలిస్కోపు గుర్తించగలదని ఫాస్ట్ ప్రాజెక్ట్ చీఫ్ సైంటిస్ట్ నాన్ రెండాంగ్ తెలిపారు.

ఈ విశ్వంలో మరో గ్రహంపై జీవరాశి వున్నట్టయితే

ఈ విశ్వంలో మరో గ్రహంపై జీవరాశి వున్నట్టయితే

2017 కల్లా నిర్మాణం పూర్తిచేసుకోబుతున్న ఈ టెలిస్కోపు అనంతమైన ఈ విశ్వంలో మరో గ్రహంపై జీవరాశి వున్నట్టయితే (ఏలియన్స్‌ వున్నాయన్నది నిజమైతే !)..వాటి నుంచి సంకేతాలు పొందటం కోసం చైనా ఈ రేడియో టెలిస్కోప్‌ను నిర్మిస్తోంది.

విశ్వం నుంచి అందే చిన్న చిన్న సంకేతాలను గుర్తించాలంటే

విశ్వం నుంచి అందే చిన్న చిన్న సంకేతాలను గుర్తించాలంటే

విశ్వం నుంచి అందే చిన్న చిన్న సంకేతాలను గుర్తించాలంటే ఇలాంటి భారీ నిర్మాణంలో వున్న టెలిస్కోప్‌ అవసరం ! ప్రముఖ శాస్త్రవేత్త నాన్‌ రెండోంగ్‌ ఈ ప్రాజెక్టుకు చీఫ్‌గా వున్నారు. చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌, నేషనల్‌ ఆస్ట్రనామికల్‌ అబ్జర్వేటర్స్‌ ఈ ప్రాజెకు నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి. అంతరిక్ష పరిశోధనలో చైనా శాస్త్రవేత్తలకు ఇదెంతగానో ఉపయోగకరంగా వుంటుందని భావిస్తున్నారు.

కొన్ని వందల..వేల కాంతి సంవత్సరాల దూరంలో

కొన్ని వందల..వేల కాంతి సంవత్సరాల దూరంలో

కొన్ని వందల..వేల కాంతి సంవత్సరాల దూరంలో మనలాంటి జీవ రాశి వున్నా లేదా తెలివైన జీవ రాశి వున్నా...అక్కడి నుంచి వచ్చే రేడియో సంకేతాలను పొందగలగటం కోసం ఇలాంటి భారీ రేడియో టెలిస్కోపులు ఉపయోగపడతాయి.

ఇలాంటిదే అట్లాంటిక్‌ మహాసముద్రంలో

ఇలాంటిదే అట్లాంటిక్‌ మహాసముద్రంలో

ఇలాంటిదే అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఆర్సిబో ద్వీపంలో ప్యూరిటో అనే ప్రాంతంలో వుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలీస్కోప్‌ అయిన దీనిపేరు 'ఆర్సిబో అబ్జర్వేటరీ'. వృత్తాకారంలో వున్న దీని వ్యాసం 300 మీటర్లు.

కెప్లెర్‌ స్పేస్‌ టెలిస్కోప్‌

కెప్లెర్‌ స్పేస్‌ టెలిస్కోప్‌

సౌరమండలాన్ని పోలిన ఇతర గ్రహ కూటములు, మన భూమిలాంటి గ్రహాల ఆచూకీ వంటివి కనుగొనటం, వాటిపై పరిశోధనకు ఈ రేడియో టెలిస్కోప్‌ అందించే సమాచారం కీలకంగా మారుతుంది. ఇలాంటి టెలిస్కోప్‌నే అమెరికా అంతరిక్ష పరిశోదన సంస్థ (నాసా) కూడా అంతరిక్షంలో ఏర్పాటుచేసింది.దీని పేరు 'కెప్లెర్‌ స్పేస్‌ టెలిస్కోప్‌'.

1400 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో భూమి వంటి గ్రహముందని

1400 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో భూమి వంటి గ్రహముందని

మనకు 1400 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో భూమి వంటి గ్రహముందని 'కెప్లెర్‌ స్పేస్‌ టెలిస్కోప్‌' ఇటీవలే కనుగొన్న విషయం తెలిసిందే. ''రేడియో టెలిస్కోప్‌ ఓ సున్నితమైన చెవితో పోల్చవచ్చు. విశ్వంలో వెలువడే అనేక సంకేతాల్లో మనకు కావాల్సిన రేడియో సంకేతాలు గుర్తించటం దీని వల్ల సాధ్యమవుతుంది.

ఈ భారీ టెలిస్కోప్‌కు 'ఫాస్ట్‌' అని నామకరణం

ఈ భారీ టెలిస్కోప్‌కు 'ఫాస్ట్‌' అని నామకరణం

ప్రస్తుతం చైనా నిర్మిస్తోన్న ఈ భారీ టెలిస్కోప్‌కు 'ఫాస్ట్‌' అని నామకరణం చేశారు. దీనికి సంబంధించి నిపుణులు టెలిస్కోప్‌ రిఫ్లెక్టర్స్‌ను అమర్చే పనిలో వున్నారు. 500 మీటర్ల వ్యాసం వున్న ఈ టెలిస్కోప్‌ను 4,450 ప్యానెల్స్‌తో తయారుచేశారు. ప్రతీ ప్యానెల్‌ సమత్రిభుజా ఆకృతిలో 11 మీటర్ల పొడవులో వుంటుంది.

500 మీటర్ల ఎత్తయిన కొండలు రక్షణగా

500 మీటర్ల ఎత్తయిన కొండలు రక్షణగా

వృత్తాకృతిలో వున్న ఈ టెలీస్కోప్‌ చుట్టకొలత 1.6 కిలోమీటర్లు వుంటుంది. గ్విజోహు రాష్ట్రంలోని ఎత్తయిన కొండల మధ్య బలమైన పిల్లర్లతో దీనిని నిర్మించారు. టెలిస్కోప్‌ నిర్మాణం దెబ్బతినకుండా చుట్టుపక్కల వున్న 500 మీటర్ల ఎత్తయిన కొండలు రక్షణగా నిలుస్తాయన్నది చైనా శాస్త్రవేత్తల అంచనా. వచ్చే ఏడాదికి ఇది పూర్తికానుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Here Write World's mega telescope construction enters final stage in China

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X