Xiaomi కొత్త పవర్ బ్యాంక్ లాంచ్ అయ్యింది

నేటి నుంచి ఇవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. Mi.com అలానే MiHome స్టోర్‌లలో వీటిని కొనుగోలు చేయవచ్చు.

|

షియోమి కొత్త పవర్ బ్యాంక్ Mi Power Bank 2 సోమవారం ఇండియాలో లాంచ్ అయ్యింది. 10000mAh వేరియంట్‌లో లభ్యమయ్యే పవర్ బ్యాంక్ ధర రూ.1,199. 20000mAh వేరియంట్‌లో లభ్యమయ్యే పవర్ బ్యాంక్ ధర రూ.2.199. నేటి నుంచి ఇవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. Mi.com అలానే MiHome స్టోర్‌లలో వీటిని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా వీటిని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే జూలై 17వరకు ఆగాల్సిందే.

 

టూ-వే ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్..

టూ-వే ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్..

ABS ప్లాస్టిక్ బాడీతో వస్తోన్న ఈ పవర్ బ్యాంక్స్ చేతికి మంచి గ్రిప్‌ను అందిస్తాయి. టు-వే ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ పవర్ బ్యాంక్స్ సపోర్ట్ చేస్తాయి. 10000mAh సామర్థ్యంగల పవర్‌బ్యాంక్ పూర్తిగా ఛార్జ్ అవటానికి 4.2 గంటల సమయం తీసుకుంటుంది. 20000mAh సామర్థ్యంగల పవర్‌బ్యాంక్ పూర్తిగా ఛార్జ్ అవటానికి 6.2 గంటల సమయం తీసుకుంటుంది.

 రెండు రకాల యూఎస్బీ పోర్టులను ఈ పవర్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది...

రెండు రకాల యూఎస్బీ పోర్టులను ఈ పవర్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది...

షియోమి Mi Power Bank 2 పవర్ బ్యాంక్‌ రెండు రకాల యూఎస్బీ పోర్టులను కలిగి ఉంటుంది. అందులో ఒకటి సాధారణ యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కాగా రెండవది యూఎస్బీ టైప్-సీ పోర్ట్. అంతేకాకుండా, ఈ పవర్ బ్యాంక్ రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన క్విక్ ఛార్జ్ 3.0ను సపోర్ట్ చేస్తుంది.

 ఈ పవర్ బ్యాంక్ బెస్ట్ ఆప్షన్...
 

ఈ పవర్ బ్యాంక్ బెస్ట్ ఆప్షన్...

ముఖ్యంగా హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను వాడే వారికి ఈ పవర్ బ్యాంక్ బెస్ట్ ఆప్షన్. ప్రయాణ సమయంలో మీ ఫోన్‌లను ఈ పవర్ బ్యాంక్ వేగంగా ఛార్జ్ చేయగలదు. ప్రత్యేమైన LED ఇండికేటర్‌తో వచ్చే ఈ పవర్ బ్యాంక్‌లో ఛార్జింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

93% కన్వర్షన్ రేటుతో ...

93% కన్వర్షన్ రేటుతో ...

ఈ పవర్ బ్యాంక్ 10000mAh అలానే 20000mAh కెపాసిటీల్లో అందుబాటులో ఉంటుంది. షియోమీ పవర్ బ్యాంక్స్ 93% కన్వర్షన్ రేటుతో పాటు‌లో పవర్ మోడ్‌తో వస్తాయి. పవర్‌బ్యాంక్ పవర్ బటన్‌ను రెండు సార్లు ప్రెస్ చేసినట్లయితే 'లో వపర్ మోడ్' ఆన్ అవుతుంది. ఈ మోడ్‌లో షియోమీ బ్లుటూత్ హెడ్‌సెట్‌లతో పాటు ఎంఐ బ్యాండ్‌లను ఛార్జ్ చేసుకునే వీలుంటుంది.

Best Mobiles in India

English summary
Xiaomi Mi Power Bank 2 launched in India; price starts from Rs.1,199. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X