ఈ పవర్ బ్యాంక్ ఇండియాకు వస్తే ఎగబడి కొనేస్తారు

రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో..

|

స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో వరస హిట్లతో దూసుకుపోతున్న షియోమీ ఇటు తన యాక్సెసరీస్ విభాగం పైనా దృష్టిసారిస్తోంది. త్వరలోనే తరువాతి వర్షన్ Mi పవర్ బ్యాంక్‌లను కూడా షియోమీ, ఇండియాలో లాంచ్ చేయబోతోంది. ఈ విడుదలకు సంబంధించిన వివరాలను షియోమి ఇండియా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రివీల్ చేసింది. ఈ ట్వీట్ ప్రకారం షియోమీ లాంచ్ చేయబోతోన్న తరువాతి జనరేషన్ Mi పవర్ బ్యాంక్‌ రెండు రకాల యూఎస్బీ పోర్టులను కలిగి ఉంటుంది.

 ఈ పవర్ బ్యాంక్ ఇండియాకు వస్తే ఎగబడి కొనేస్తారు

అందులో ఒకటి సాధారణ యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కాగా రెండవది యూఎస్బీ టైప్-సీ పోర్ట్. అంతేకాకుండా, ఈ పవర్ బ్యాంక్ రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన క్విక్ ఛార్జ్ 3.0ను సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను వాడే వారికి ఈ పవర్ బ్యాంక్ బెస్ట్ ఆప్షన్. ప్రయాణ సమయంలో మీ ఫోన్‌లను ఈ పవర్ బ్యాంక్ వేగంగా ఛార్జ్ చేయగలదు. ప్రత్యేమైన LED ఇండికేటర్‌తో వచ్చే ఈ పవర్ బ్యాంక్‌లో ఛార్జింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

 ఈ పవర్ బ్యాంక్ ఇండియాకు వస్తే ఎగబడి కొనేస్తారు

ఈ పవర్ బ్యాంక్ 10000mAh అలానే 20000mAh కెపాసిటీల్లో అందుబాటులో ఉంటుంది. షియోమీ పవర్ బ్యాక్స్ 93% కన్వర్షన్ రేటుతో పాటు‌లో పవర్ మోడ్‌తో వస్తాయి. పవర్‌బ్యాంక్ పవర్ బటన్‌ను రెండు సార్లు ప్రెస్ చేసినట్లయితే 'లో వపర్ మోడ్’ ఆన్ అవుతుంది. ఈ మోడ్‌లో షియోమీ బ్లుటూత్ హెడ్‌సెట్‌లతో పాటు ఎంఐ బ్యాండ్‌లను ఛార్జ్ చేసుకునే వీలుంటుంది. చైనా మార్కెట్లో Mi Power Bank 2 ధర 79 yuanలుగా ఉంది. మన కరెన్సీలో ఈ విలువ రూ.1200. ఇండియన్ మార్కెట్లో ఈ పవర్ బ్యాంక్ ధర ఎంతుంటుంది అనేది తెలియాల్సి ఉంది.

Best Mobiles in India

English summary
Xiaomi Mi Power Bank 2 with USB Type-C port coming soon to India. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X