భవిష్యత్ వ్యూహం పై తర్జన భర్జన!

LG

  కొరియాకు చెందిన అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక సంస్థ ఎల్‌జీ, విండోస్ ఆధారిత ఫోన్‌ల తయారీ విషయంలో వెనకడుగు వేసింది. తాము రూపొందించిన విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఫోన్‌లకు ప్రజల నుంచి ఫేలవమైన ఆదరణ లభించటమే ఇందుకు కారణమని ఎల్‌జీ అధికార ప్రతినిధి లీ సీయుంగ్- యోన్ వెల్లడించారు. వస్తున్న ఫలితాలను పరిగణలోకి తీసుకుని తాము విండోస్‌తో సంబంధాలు తెంచుకోబోమని, మైక్రో‌సాఫ్ట్ మొబైల్ ప్లాట్ ఫామ్‌ల పై మరింత పరిశోధన ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి...

అసలు కధ అక్కడితో ఆరంభం!!

Android Tablets

  తక్కువ ధర టాబ్లెట్ కంప్యూటర్లకు మార్కెట్లో ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో అనేక కంపెనీలు వీటి తయారీ పై దృష్టి సారిస్తున్నాయి. ఆకాష్‌తో మొదలైన్ ఈ ఒరవడి రోజుకో కొత్త పుంత తొక్కుతోంది. ఈ నేపధ్యంలో భారతీయ సంస్థ గోటెక్ రూ.7,000 ధరలో రెండు ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీలను డిజైన్ చేసింది. మే 12న, ఫన్ ట్యాబ్ సిరీస్‌లో వీటిని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 7 అంగుళాల స్ర్కీన్ పరిమాణం కలిగిన ఈ టాబ్లట్...

197 టాపప్‌తో 42,000 సెకన్ల టాక్‌టైమ్!

Vodafone

  టెలికం కంపెనీ వొడాఫోన్ రాష్ట్రంలోని ప్రీ-పెయిడ్ వినియోగదారుల కోసం రూ.197 విలువ గల ‘బడా బోనస్ కార్డ్’ను ప్రకటించింది. ఇందులో భాగంగా అన్ని లోకల్ నెట్‌వర్క్‌లకు పనిచేసే విధంగా 42,000 సెకన్ల టాక్‌టైంను ఆఫర్ చేస్తోంది. నాలుగు వారాల కాల పరిమితి గల ఈ ప్యాక్ ఇ-టాప్ అప్ ద్వారా అందుబాటులో ఉందని వొడాఫోన్ తెలిపింది. రూ.18 రీఛార్జ్‌తో, 4000 సెకన్ల ఫ్రీ టాక్‌టైమ్!! ప్రముఖ టెలికం ఆపరేటర్ యూనినార్, రాష్ట్ర చందాదారలు కోసం ప్రత్యేక...

అదొక్కటే మైనస్?

 Alcatel One Touch OT-985D: Full specifications

  అధునాతన నిర్దేశాలతో ఆల్కాటెల్ డిజైన్ చేసిన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘వన్‌టచ్ వోటీ-985డి’.ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్‌లు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. వీటిని బట్టి అంచనా వేస్తుంటే ఈ డివైజ్ మధ్యస్థాయి ప్రతిభను కనబరుస్తుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 2.3.6 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ‘ఆల్కా‌టెల్ వన్‌టచ్ వోటీ-985డి’ ఇతర ఫీచర్లు….. ఫోన్ బరువు 136 గ్రాములు, 3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), గుగూల్ ఆండ్రాయిడ్ 2.3.6 ఆపరేటింగ్ సిస్టం, 650మెగాహెడ్జ్...

అంతిమంగా.. ఆ రోజు రానే వచ్చింది?

Lenovo

  ఆత్రుతతో ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. గ్యాడ్జెట్ ప్రియులు ఉత్కంఠకు తెరదింపుతూ లెనోవో తన సరికొత్ల ల్యాప్‌టాప్ ‘ధింక్ ప్యాడ్ X1 కార్బన్’కు సంబంధించి కీలక వివరాలను బహిర్గతం చేసింది. ఈ కంప్యూటింగ్ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన ఉత్తమ క్వాలిటీ ఫీచర్లు అదేవిధంగా స్పెసిఫికేషన్‌లు మెరుగైన పనితీరును కనబరుస్తాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. ధింక్ ప్యాడ్ X1 కార్బన్ కీలక ఫీచర్లు: 14 అంగుళాల స్ర్కీన్ డిస్ ప్లే, రిసల్యూషన్ 1600 x 900పిక్సల్స్,...

టార్గెట్ ఆ ముగ్గురే..?

Karbonn A9 Android phone for Rs 9,000

  ఎంట్రీస్థాయి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తమదైన శైలిలో దూసుకుపోతున్న సామ్‌సంగ్, ఎల్‌జీ, హెచ్‌టీసీ బ్రాండ్‌లను అడ్డుకునేందుకు కార్చన్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. భవిష్యత్ ప్రణాళికలో భాగంగా ఈ బ్రాండ్ ఇటీవల కాలంలో రెండు స్మార్ట్‌పోన్‌లను ప్రకటించింది. కార్బన్ ఏ7,ఏ9 మోడళ్లలో రూపుదిద్దుకుంటున్న ఈ ఎంట్రీ స్థాయి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు ఉత్తమమైన స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉండటంతో మార్కెట్ అంచనాలు జోరందుకున్నాయి. వీటి విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అయితే, కార్బన్ ఏ9...

అసలెందుకు లైక్ చెయ్యాలి..?

Reasons to buy the Samsung Galaxy S3 smartphone

  అనేకమైన పుకార్లు.. ఊహాగానాల అనంతరం మే3న లండన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 స్మార్డ్‌ఫోన్‌ను లాంచ్ చేశారు. ఏ ఇతర స్మార్ట్‌ఫోన్‌లోలేని ఫీచర్లను సరికొత్త గెలాక్సీ ఎస్3 ఒదిగి ఉంది. డివైజ్‌లో నిక్షిప్తం చేసిన ప్రతీ ఫీచర్ యూజర్‌కు ఉపయోగపడేదిగా ఉంటుంది. గెలాక్సీ ఎస్3ని ఎంచుకోడానికి గల ఉత్తమ పది కారణాలను తెలుసుకుందాం: 1. పెద్దదైన డిస్ ప్లే: గెలాక్సీ ఎస్3, 4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్...

చెక్కుచెదరని చాతుర్యం!!

Sony

  పోటోకెమెరాల తయారీ సంస్థ సోనీ మరో ప్రయత్నంగా, నీరు ఇంకా దుమ్ము నిరోధక సామర్ధ్యం కలిగిన హ్యాండీక్యామ్‌ను డిజైన్ చేసింది. పేరు హెచ్డీఆర్-జీడబ్ల్యూ77వీ. ఈ సరికొత్త కెమెరా తొలత జపాన్‌లో విడుదల కానుంది. 16అడుగులు లోతైన నీటిలో పడినప్పటికి క్యామ్ చెక్కుచెదరకుండా పనిచేస్తుంది. దుమ్మును సైతం ఈ ఫోటోగ్రఫీ డివైజ్ సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. పటిష్టమైన శరీరాకృతి కలిగిన ఈ కెమెరా ఐదడుగుల ఎత్తు నుంచి కిందపడినా చెక్కుచెదరదు. యూజర్ ఫ్రెండ్లీ లక్షణాలతో ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలు...

నిలదొక్కుకునే ప్రయత్నంగా మరో సారి..?

ZTE V96

  టాబ్లెట్ కంప్యూటర్ల మార్కెట్లో తన మనుగడను కొనసాగించేందుకు జడ్‌టీఈ సంస్థ ఓ సరికొత్త టాబ్లెట్ పీసీని రూపొందించింది. పేరు ZTE V96, ఇటీవల నిర్వహించిన సీటీఐఏ 2012 కార్యక్రమంలో ఈ డివైజ్‌ను ఆవిష్కరించారు. సరికొత్త కంప్యూటింగ్‌కు అద్దంపట్టే విధంగా ఈ గ్యాడ్జెట్‌ను తీర్చిదిద్దినట్లు సమాచారం. టాబ్లెట్ కీలక ఫీచర్లను పరిశీలిస్తే: - 10.1 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, – ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, – క్వాల్కమ్ 1.7గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,...

సుఖమయమైన అనుభూతి!

Jaybird

  ప్రముఖ మ్యూజిక్ పరికరాల తయారీ సంస్థ జేబర్డ్, స్పోర్ట్ బ్యాండ్ ఆకృతిలో ట్రెండీ హెడ్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. స్లీక్ ఇంకా మోడ్రన్ లుక్‌లో రూపుదిద్దకున్న ఈ సౌండ్ గ్యాడ్జెట్ ఆడియోను క్రిస్టల్ క్లియర్ శ్రేణిలో అందిస్తుంది. తలకు సౌకర్యవంతంగా ఇమిడే విధంగా ఈ డివైజ్ ఉంటుంది. బ్లూటూత్ ఆధారితంగా ఈ పరికరం స్పందిస్తుంది. వాల్యుమ్ కంట్రోల్, ట్రాక్ కంట్రోల్, ఆన్, ఆఫ్, పాస్, ప్లే వంటి ఆప్షన్‌లకు సంబంధించిన బటన్లను హెడ్‌సెట్ కుడి, ఎడమ భాగాల్లో...