సోషల్ మీడియాలో సంచలనాలు, అన్నీ ఫేక్ వార్తలే

సోషల్ మీడియాలో ఏది సంచలనంగా కనిపించినా దాన్ని వెంటనే షేర్ చేసేస్తాం. అయితే ఇలా షేర్ చేసే సమయంలో అది నిజమైన న్యూసా లేక ఫేక్ న్యూసా అని ఎవ్వరూ పట్టించుకోరు.

By Hazarath
|

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు..ఓ ప్రపంచం మన చెంత ఉన్నట్లే అని ఫీలయిపోతాం. సోషల్ మీడియాలో ఏది సంచలనంగా కనిపించినా దాన్ని వెంటనే షేర్ చేసేస్తాం. అయితే ఇలా షేర్ చేసే సమయంలో అది నిజమైన న్యూసా లేక ఫేక్ న్యూసా అని ఎవ్వరూ పట్టించుకోరు. సంచంలనంగా ఉంది షేర్ చేసాం అని చెబుతుంటారు. ఇలా సోషల్ మీడియాలో ఈ ఏడాది షేర్ అయి సంచలనంగా మారిన ఫేక్ న్యూస్ వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

మాట్లాడుకోండి ఎంతసేపైనా..అపరిమితం

మోడీకి బెస్ట్ పీఎంగా..

మోడీకి బెస్ట్ పీఎంగా..

భారత ప్రధాని నరేంద్ర మోడీకి బెస్ట్ పీఎంగా యునెస్కో పురస్కారం లభించిందనే వార్త సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ విభాగంలో అగ్రభాగాన్ని దక్కించుకుంది. అయితే ఇది నిజం కాదని ఇప్పటికీ చాలామందికి తెలియదు.

ప్రపంచంలోనే ఉత్తమ జాతీయ గీతంగా జనగణమన..

ప్రపంచంలోనే ఉత్తమ జాతీయ గీతంగా జనగణమన..

ప్రపంచంలోనే ఉత్తమ జాతీయ గీతంగా జనగణమన ను యునెస్కో గుర్తించిందంటూ ఓ వార్త సోషల్ మీడియాని ఓ ఊపు ఊపింది.

రూ. 2 వేల నోటును

రూ. 2 వేల నోటును

ఇక దీంతో పాటు రూ. 2 వేల నోటును యునెస్కో ఉత్తమ కరెన్సీగా ప్రకటించిదనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

కొత్త నోట్లలో జీపీఎస్ చిప్

కొత్త నోట్లలో జీపీఎస్ చిప్

దేశంలో తీసుకొచ్చిన‌ కొత్త నోట్లలో జీపీఎస్ చిప్ పెట్టారు.. దీంతో నల్లధనానికి చెక్ పెట్ట‌నున్నారు. ఇది ఓ సంచలనం. 

రేడియో యాక్టివ్ ఇంక్

రేడియో యాక్టివ్ ఇంక్

కొత్త నోట్లలో రేడియో యాక్టివ్ ఇంక్.. దీని వల్ల కొత్త నోట్ల‌ను పెద్దమొత్తంలో దాచుకుంటే ఐటీ అధికారులు ప‌ట్టేస్తారు. వైరల్ గా మారిన ఫేక్ న్యూస్ 

వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్లు

వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్లు

మహిళలు తమ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్లు తొలగించాలి: ఢిల్లీ పోలీసు కమిషనర్ సూచన‌ అంటూ ఓ వార్తని తెగ షేర్ చేశారు సోషల్ మీడియాలో. నిజానికి అలాంటిదేమి లేదు. 

పది రూపాయల నాణేలను..

పది రూపాయల నాణేలను..

పది రూపాయల నాణేలను రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దుచేసింది. ఈ వార్తని ఎవరు క్రియేట్ చేశారో కాని అది వైరల్ అయి కూర్చుంది. 

Best Mobiles in India

English summary
2016: Top 10 fake news forwards In Social media that we almost believed Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X