ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

|

రోజువారి సోషల్ మీడియా కార్యకలాపాల్లో భాగంగా మన మన ఫేస్‌బుక్ అకౌంట్‌లలో రకరకాల ఫోటోలతో పాటు వీడియోలను అప్‌లోడ్ చేస్తుంటాం. వీటిలో కొన్ని కొన్ని పోటోలు, వీడియోలు మనకు అపరిమితంగా నచ్చేస్తుంటాయ్.

ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

ఫేస్‌బుక్ ఎప్పటికి వీటిని మన అకౌంట్‌ల నుంచి తొలగించనప్పటికి, నచ్చిన జ్ఞాపకాలను మన వద్ద భద్రపరచుకుంటే ఇంకా బాగుంటుంది. ఫేస్‌బుక్‌లో నచ్చిన ఫోటోలతో పాటు వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అనేక ఉపయుక్తమైన టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫేస్‌బుక్ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు 6 ఉపయుక్తమైన మార్గాలను ఇప్పుడు చూద్దాం...

Read More : 10 ఇంటర్నెట్ బ్రౌజింగ్ టిప్స్ (చాలా సింపుల్)

ఫేస్‌బుక్ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

ఫేస్‌బుక్ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఒక్క ఫోటోను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ ప్రయేయం అవసరం లేదు. ఫేస్‌బుక్‌లోని టూల్స్ ద్వారానే డౌన్‌లోడింగ్ నిర్వహించుకోవచ్చు. డెస్క్‌టాప్‌లో అయితే ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌‌లోకి లాగినై డౌన్‌లోడ్ చేసుకోదలచిన ఫోటోను ఓపెన్ చేయండి. ఫోటో క్రింద మెనూ బార్‌లో కనిపించే ఆప్సన్స్ పై క్లిక్ చేసి అందులో Downloadsను సెలక్ట్ చేసుకోండి. స్మార్ట్‌ఫోన్‌లో అయితే ఫోటోను ఓపెన్ చేసిన ఆప్సన్స్‌లో కనిపించే Save Photoను క్లిక్ చేస్తే ఫోటో డౌన్‌లోడ్ అవుతుంది.

 

ఫేస్‌బుక్ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?
 

ఫేస్‌బుక్ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

Download Your Albums పేరుతో ఫేస్‌బుక్ ఇటీవల ఒ సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ద్వారా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లలోని ఆల్బమ్స్‌ను ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ప్రమేయం లేకుండా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే..?

ముందుగా మీ ప్రొఫైల్ లో వెళ్లి Photos మెనూలోని Albums ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

మీరు ఏ ఆల్బమ్‌ను అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో..? ఆ ఆల్బమ్‌ను ఓపెన్ చేయండి. 

టాప్‌రైట్ కార్నర్‌లో కనిపించే cog icon పై క్లిక్ చేసినట్లయితే Download Album ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే డౌన్‌లోడింగ్‌కు అనుమతించమంటూ ఓ పాపప్ బాటమ్ లెఫ్ట్ కార్నర్‌లో కనిపిస్తుంది. Start the download ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే

ఆల్బమ్ జిప్ పైల్ రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది. ఈ ఫైల్‌ను మీరు extract చేసుకోవల్సి ఉంటుంది.

 

ఫేస్‌బుక్ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

ఫేస్‌బుక్ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ డివైస్‌లలో ఆల్బమ్‌లను డౌన్‌లోడ్‌ను అవకాశాన్ని ఫేస్‌బుక్ కల్పించలేదు. కాబట్లి, Album Downloader for Facebook అనే థర్డ్ పార్టీ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయటం ద్వారా ఆల్బమ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్‌లో భద్రపరుచుకోవచ్చు.

 

ఫేస్‌బుక్ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

ఫేస్‌బుక్ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఇతరులు షేర్ చేసిన ఆల్బమ్‌లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు Ensky Album Downloader పేరుతో ఓ క్రోమ్ extension అందుబాటలో ఉంది. ఈ extension ద్వారా ఇతరులు చేసిన ఆల్బమ్‌లను మీ డివైస్‌లోకి బ్యాకప్ చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

ఫేస్‌బుక్ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఎటువంటి డైరెక్ట్ ఆప్షన్స్ అందుబాటులో లేవు. థర్డ్ పార్టీ టూల్స్ సహాయంతో వీడియోలను పొందవచ్చు. Filevid అనే టూల్, ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఫేస్‌బుక్ వీడియో లింక్‌ను ఈ టూల్‌లో పేస్ట్ చేసి Download! Button పై క్లిక్ చేయటం ద్వారా వీడియో డౌన్‌లోడ్ కాబడుతుంది.

ఫేస్‌బుక్ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

ఫేస్‌బుక్ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోని మల్టిపుల్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే MyVideoDownloader ఉత్తమ ఆప్షన్. ఈ యాప్‌ను మీ ఫేస్‌బుక్ అకౌంట్‌తో యాక్సెస్ చేయటం ద్వారా మీఅకౌంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో ఈ యాప్ ఇంటరాక్ట్ అవుతుంది. తద్వారా వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

Best Mobiles in India

English summary
5 Simple Ways to Download Facebook Photos & Videos. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X