ఫేస్‌బుక్‌లో ఇకపై జాగ్రత్తగా ఉండండి !

ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర, హింసాత్మక ఘటనలకు సంబంధించి ఏవైనా వీడియోలను పోస్ట్ చేస్తే అలాంటి వీడియోలను గుర్తించేందుకు సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది.

By Hazarath
|

ఫేస్‌బుక్‌ ఇప్పుడు అందరి అకౌంట్లపై కన్ను వేయనుంది. ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి చిల్లర చేష్టలకు పాల్పడే వారికి తగిన గుణపాఠం చెప్పనుంది. ఫేస్‌బుక్‌ లైవ్ లో అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్ చేయడం గాని జరిగితే వెంటనే వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీని తీసుకురానుంది.

 

జియోకి ధీటుగా ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్

ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్

ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్

ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర, హింసాత్మక ఘటనలకు సంబంధించి ఏవైనా వీడియోలను పోస్ట్ చేస్తే అలాంటి వీడియోలను గుర్తించేందుకు సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. అదే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్' ఈ టెక్నాలజీతో అభ్యంతరకరమైన లైవ్ స్ట్రీమింగ్లను గుర్తించి వినియోగదారులను అలర్ట్ చేయనుంది.

జాప్యానికి చెక్

జాప్యానికి చెక్

ఇప్పటి వరకు ఎవరైనా అసభ్యకరమైన వీడియోలను పోస్టు చేస్తుంటే వాటిపై వినియోగదారులు ఫిర్యాదు చేస్తేనే ఫేస్‌బుక్‌ చర్యలు తీసుకునేది. ఫిర్యాదు స్వీకరించిన తర్వాత ఆ వీడియోలు నిజంగానే ఇబ్బందికరంగా ఉన్నాయా? లేవా అని పరిశీలించాల్సి ఉండేది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అభ్యంతరకరమైన వీడియోలను లైవ్లో ప్రసారం చేస్తే
 

అభ్యంతరకరమైన వీడియోలను లైవ్లో ప్రసారం చేస్తే

ఇదంతా జరగడానికి చాలా సమయం పడుతుండటంతో ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా ఎవరైనా అభ్యంతరకరమైన వీడియోలను లైవ్లో ప్రసారం చేస్తే తక్షణమే గుర్తించే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ను అభివృద్ధి చేస్తున్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది.

అవసరమైతే బ్లాక్

అవసరమైతే బ్లాక్

ఒకవేళ వీడియో అభ్యంతరకరమైనదిగా గుర్తిస్తే దానిపై అలర్ట్ గుర్తులను చూపిస్తుంది. అవసరమైతే బ్లాక్ చేసేస్తుంది. నెటిజన్లను తప్పుదోవ పట్టిస్తున్న నకిలీ వార్తలను అడ్డుకునేందుకు గట్టి చర్యలు చేపడుతున్నట్లు ఫేస్‌బుక్‌ ఇటీవలే ప్రకటించింది.

వినియోగదారులకు కాస్త ఉపశమనం

వినియోగదారులకు కాస్త ఉపశమనం

ఇప్పుడు అభ్యంతరకర వీడియోలను గుర్తించే ఈ సాంకేతికత వస్తే వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగినట్లే. నకిలీ అకౌంట్లకు అడ్డుకట్టపడినట్లే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Facebook developing artificial intelligence to flag offensive live videos Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X