2017లో జుకర్ బర్గ్ విసిరిన సవాల్..

2017 సంవత్సరంలో తనకు తానుగా ఓ సవాల్ పెట్టుకున్నారు

By Hazarath
|

మార్క్ జుకర్ బర్గ్ ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ఈ పేరు తెలియకపోయినా ఆయన క్రియేట్ చేసిన ఫేస్‌బుక్ అంటే అందరికీ తెలుసు. ఓ సునామి లాగా అందర్నీ ముంచేస్తోంది. అలాంటి ఆవిష్కర్త 2017 సంవత్సరంలో తనకు తానుగా ఓ సవాల్ పెట్టుకున్నారు.

 

బ్యాన్ చేసినా ఇండియాలో చైనాదే ఆధిపత్యం

 
mark

ఏటా ఏదో కొత్త సవాల్‌ పెట్టుకుని పూర్తిచేయడం అలవాటైన జుక్‌కి ఈ ఏడాది కూడా అమెరికాలోని అన్ని రాష్ట్రాల వారిని వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకున్నాడు.ఈ ఏడాది బయటకు వెళ్లి సాధ్యమైనంత ఎక్కువ మందిని కలవాలని నియమం పెట్టుకొన్నా. ప్రజలు ఎలా జీవిస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు, భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకుంటాను.

రూ.15 700కే 4జిబి ల్యాపీ, 12 గంటలు బ్యాటరీ బ్యాకప్

mark

ప్రపంచాన్నంతా అనుసంధానం చేసి ప్రతి ఒక్కరి గొంతుకకు ప్రాధాన్యం ఇవ్వడం నా పని. ఈ ఏడాది వారి అభిప్రాయాల్ని వ్యక్తిగతంగా వింటాను. ఫేస్బుక్, చాన్ జుకర్బర్గ్ సంస్థలను సమర్థంగా నడిపించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచం సరికొత్త యుగంలోకి అడుగిడుతున్న తరుణంలో ఇది సానుకూల ప్రభావం చూపుతుందంటూ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.

ఫ్రీ ఇంటర్నెట్, ఇండియాకి గూగుల్ వరాల జల్లులు

mark

గతంలో సైతం తన సొంత ఇంటికి కృతిమ మేథస్సు ఏర్పాటు చేసుకోవడం, మాండరిన్ భాష నేర్చుకోవడం, 25 పుస్తకాలు చదవడం, 587 కిలోమీటర్లు పరుగెత్తడం వంటివి లక్ష్యంగా పెట్టుకుని పూర్తి చేసిన విషయం విదితమే.

Best Mobiles in India

English summary
Mark Zuckerberg Reveals His 2017 Challenge on Facebook read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X