ఇంటర్నెట్‌కు అతుక్కుపోతున్నారా..?

వెబ్ బ్రౌజింగ్‌ను ఓ వ్యసనంలా అలవర్చుకుని ఆ ఊబిలో చిక్కుకుపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని సర్వేలు ఆందోళణ వ్యక్తం చేస్తున్నాయి.

ఇంటర్నెట్ ఉపయోగకరమైన కమ్యూనికేషన్ సాధనం అయినప్పటికి ఈ వ్యవస్థ వల్ల దుష్ప్రభావాలు కూడా అనేకం ఉన్నాయి.వెబ్ బ్రౌజింగ్‌ను ఓ వ్యసనంలా అలవర్చుకుని ఆ ఊబిలో చిక్కుకుపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని పలు సర్వేలు ఆందోళణ వ్యక్తం చేస్తున్నాయి. అందుకే కాబోలు బెంగుళూరు లాంటి ప్రముఖ నగరాల్లో ఇంటర్నెట్‌కు బానిసైన వారిని రక్షించేందుకు ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పడ్డాయి. ఇంటర్నెట్ వ్యసనాన్ని తగ్గించుకునేందుకు పలు సింపుల్ మార్గాలు..

Read More : 10 సాఫ్ట్‌వేర్ స్కిల్స్.. ఉద్యోగం గ్యారంటీ!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సంకల్పం, ఏకాగ్రత

సంకల్పం, ఏకాగ్రత మీలో ఉంటే ఇంటర్నెట్ వ్యసనాన్ని పూర్తిగా మీ నియంత్రణలోకి తీసుకురావచ్చు.

వేరే అంశాల పట్ల ఆసక్తిని పెంచుకోండి

ఇంటర్నెట్‌తో సంబంధంలేని విషయాల పట్ల ఆసక్తిని పెంచుకోండి. తద్వారా, మీ దృష్టి వేరొక పని పై కేంద్రీకృతమవుతుంది.

పుస్తకాలు చదివేందుకు..

పుస్తకాలు చదివేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయించటం వల్ల ఇంటర్నెట్ వ్యసనాన్ని తగ్గించుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు

ఇంటర్నెట్ వ్యసనాన్ని తగ్గించుకునే క్రమంలో మీ కుటుంబ సభ్యులకు ఇంటి పనుల్లో సహాయపడండి.

ఇతర పనుల పై శ్రద్ధ

ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు కేటాయించే సమయాన్ని ఇతర పనులకు కేటాయించటం ద్వారా ఇంటర్నెట్ పై దృష్టిని మరల్చుకొవచ్చు.

అవుట్ డోర్ ట్రిప్స్

మిత్రులతో కలిసి తరచూ అవుట్ డోర్ ట్రిప్స్ ప్లాన్ చేసుకోవటం ద్వారా ఇంటర్నెట్ మీద ధ్యాసను తగ్గించుకోవచ్చు.

రోజుకు కొంత సమయమే..?

ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ కంటూ రోజు కొంత సమయాన్నే కేటాయించుకోండి. ఇలా చేయటం వల్ల క్రమంగా ఇంటర్నెట్ వ్యసనం నుంచి బయటపడతారు.

సోషల్ మీడియాకు దూరంగా..

ఇన్‌స్టెంట్ మెసేజింగ్‌కు బదులుగా మొబైల్ కాల్స్‌కు ప్రాధాన్యతనివ్వండి. కంప్యూటర్ ముందు కూర్చొని మీల్స్ చేయకండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Simple Ways to Stop Internet Addiction. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting