ఇకపై పాస్‌వర్డ్‌లు చెబితేనే అమెరికా వీసా

ఎవరైనా వీసాకి అప్లయి చేస్తే వారు వారి సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లు చెబితేనే అమెరికాలోనే అడుగుపెట్టనిస్తామని ప్రకటన జారీ

Written By:

ఇకపై అమెరికా వెళ్లడానికి వీసాకోసం ధరఖాస్తు చేసుకునే వారికి అనేక తిప్పలు ఎదురుకానున్నాయి. ఎవరైనా వీసాకి అప్లయి చేస్తే వారు వారి సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లు చెబితేనే అమెరికాలోనే అడుగుపెట్టనిస్తామని ప్రకటన జారీ చేసింది. ఇప్పటికే ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధించిన నేపథ్యంలో ఈ ప్రకటన ఇప్పుడు మరింత ఆందోళనకు దారి తీస్తోంది.

దూసుకొస్తున్న షియోమి రెడ్‌మి నోట్ 4x

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పలు మార్గదర్శకాలు

ఇక నుంచి అమెరికా వచ్చే వారి వివరాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించాలని ట్రంప్‌ అన్ని దేశాల రాయబార కార్యాలయానికి ఇప్పటికే ఆదేశాలు పంపించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం పలు మార్గదర్శకాలు వారికి సూచించినట్లు తెలిసింది.

పాస్‌వర్డ్‌లు

ఇందులో భాగంగా ఇక నుంచి తమ దేశానికి వచ్చే వారు తాము ఉపయోగిస్తున్న సామాజిక అనుసంధాన వేదికల వివరాలు, వాటి పాస్‌వర్డ్‌లు కచ్చితంగా వీసాకు ముందు ధృవపత్రాలను తనిఖీ చేసే అధికారులకు కచ్చితంగా చెప్పాలని కోరనున్నారు.

కఠిన నిబంధనలు

ముఖ్యంగా ఇప్పటికే నిషేధం విధించిన ప్రధాన ముస్లిం దేశాల నుంచి వచ్చే వారి విషయంలో ఈ కఠిన నిబంధనలు అమలుచేయాలని భావిస్తున్నారు.

అవి ఇస్తేనే వీసాకు అనుమతి

మేం నిషేధం విధించిన దేశాల వారిని రాకుండా ఆపడం కష్టం కావొచ్చు.. ఒక వేళ వారు వస్తే కచ్చితంగా ఈ వివరాలు మాత్రం అడుగుతాం. అవి ఇస్తేనే వీసాకు అనుమతిస్తామని అమెరికా అంతర్గత రక్షణ వ్యవహారాల కార్యదర్శి జాన్‌ కెల్లీ తెలిపారు.

ఎలాంటి వెబ్‌సైట్‌లు చూస్తున్నారనే విషయం

అవిస్తే వారు ఎలాంటి వెబ్‌సైట్‌లు చూస్తున్నారనే విషయం మాకు తెలుస్తుంది. ఒక​వేళ వాళ్లు పాస్‌ వర్డ్స్‌ చెప్పకుంటే అమెరికాలోకి ఎంట్రీ లేదని ఆయన తెలిపారు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
US Could Ask Visa Applicants for Social Media Passwords Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting