777888999 నుంచి ఫోన్ వస్తే చచ్చిపోతారంట, నిజమెంత ?

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ ఖాతాల్లో కనిపిస్తున్న మెసేజ్ ఇది.

By Hazarath
|

777888999 నంబర్ నుంచి కాల్ వస్తే దయచేసి దాన్ని లిఫ్ట్ చేయకండి. ఒకవేళ మీరు కాల్ రిసీవ్ చేసుకుంటే, మీ ఫోన్ పేలిపోతుంది. దయచేసి మీ ఫ్రెండ్స్ కు కూడా దీన్ని షేర్ చేయండి" ఇంకో మెసేజ్ సారాంశం ఏంటంటే 777888999 నుంచి కాల్ వచ్చి దాన్ని రిసీవ్ చేసుకుంటే, ఓ యువతి మాట్లాడుతుంది. అదే మీరు మాట్లాడే చివరి కాల్ అని చెబుతుంది. ఆపై నిజంగానే అలా జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని షేర్ చేయండి" మరి ఇందులో నిజమెంత..?

అణుబాంబు వేయాల్సిందే, వణుకుతున్న అమెరికా, షాక్ వీడియో..

ఈ నంబర్ నుంచి కాల్ వస్తే

ఈ నంబర్ నుంచి కాల్ వస్తే

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ ఖాతాల్లో కనిపిస్తున్న మెసేజ్ ఇది. ఈ నంబర్ నుంచి కాల్ వస్తే ఫోన్ పేలిపోయి రిసీవ్ చేసుకున్న వారు నిజంగానే మరణిస్తారంటూ తీవ్రమైన చర్చే జరుగుతోంది.

కేవలం పుకారే

కేవలం పుకారే

అయితే, ఇది కేవలం పుకారేనని నిపుణులు కొట్టి పారేస్తున్నారు. ఈ తరహా ప్రచారాన్ని ఎంతమాత్రమూ నమ్మక్కర్లేదని అంటున్నారు.

అది అన్ని నంబర్లకూ

అది అన్ని నంబర్లకూ

ఒక నంబర్ నుంచి ఫోన్ వచ్చి, దాన్ని రిసీవ్ చేస్తే, ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉండదని, అటువంటిదే ఉంటే, అది అన్ని నంబర్లకూ వర్తిస్తుందని చెబుతున్నారు. 

కేవలం 9 అంకెలు మాత్రమే

కేవలం 9 అంకెలు మాత్రమే

ఈ నంబరులో కేవలం 9 అంకెలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇది ఇండియాలో పనిచేయదని, ఒకవేళ అది ఇంటర్నేషనల్ నంబరే అయినా, ఆ దేశపు కోడ్ సహా మొబైల్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుందని అభయమిస్తున్నారు.

ఇంతవరకూ సాక్ష్యాలు

ఇంతవరకూ సాక్ష్యాలు

ఈ నంబరుతో ఫోన్ వచ్చినట్టు ఇంతవరకూ సాక్ష్యాలు లభించలేదని టెలికం రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ తరహా ప్రచారాన్ని నమ్మి ఆందోళ చెందాల్సిన అవసరం లేదని అభయమిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Getting a call from 777888999? It's not a death call, your phone won't explode read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X