6000mAh బ్యాటరీతో సామ్‌సంగ్ Galaxy Tab S3

అడ్వాన్సుడ్ S Pen సపోర్ట్‌ ఆప్షన్‌తో వస్తోన్న ఈ టాబ్లెట్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉపయోగించుకోవచ్చు.

|

Galaxy Tab S3 పేరుతో ఓ హై-ఎండ్ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను సామ్‌సంగ్ ఇండియా మంగళవారం మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ ధర రూ.47,990. అన్ని రిటైల్ స్టోర్‌లలో సేల్ ఈ రోజు నుంచే ప్రారంభమైంది. బ్లాక్ ఇంకా సిల్వర్ కలర్ వేరియంట్‌లలో ఈ టాబ్లెట్ అందుబాటులో ఉంటుంది. స్పెషల్ లాంచ్ ఆఫర్ క్రింద జూలై 31లోపు, ఈ టాబ్లెట్‌ను కొనుగోలు చేసిన వారికి ఏడాదిలోపు వన్‌టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్‌తో పాటు డిసెంబర్ 31, 2017 వరకు జియో డబుల్ డేటా ఆఫర్ (28జీబి+28జీబి)ను సామ్‌సంగ్ ఆఫర్ చేస్తోంది. Galaxy Tab S3 స్పసిఫికేషన్స్...

డిజైన్, డిస్‌ప్లే ఇంకా చుట్టుకొలతలు

డిజైన్, డిస్‌ప్లే ఇంకా చుట్టుకొలతలు

గెలాక్సీ టాబ్ ఎస్3 ముందు భాగం గ్లాస్‌తోనూ, వెనుక భాగం అల్యూమినియమ్ మెటల్ మిడ్-ఫ్రేమ్‌తోనూ తీర్చిదిద్దారు. దీంతో ఈ డివైస్ మరింత హై-ఎండ్ లుక్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే విషయానికి వస్తే ఈ డివైస్ 9.7 అంగుళాల QXGA సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ కెపాసిటీ 2048×1536పిక్సల్స్. టాబ్లెట్ బరువు 434 గ్రాముల బరువు. చుట్టుకొలత 237.3×169×6 మిల్లీ మీటర్లు.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్, బ్యాటరీ

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్, బ్యాటరీ

క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్‌, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 6000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ కనెక్టర్.

సాఫ్ట్‌వేర్ ఇంకా కెమెరా

సాఫ్ట్‌వేర్ ఇంకా కెమెరా

గెలాక్సీ టాబ్ ఎస్3 ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. కెమెరా విషయానికి వచ్చేసరికి డివైస్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్, ముందు భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరాలను ఏర్పాటు చేసారు.

 కనెక్టువిటీ ఆప్షన్స్..

కనెక్టువిటీ ఆప్షన్స్..

గెలాక్సీ టాబ్ ఎస్3 టాబ్లెట్ Wi-Fi only ఇంకా LTE వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు ఈ టాబ్లెట్‌లో ఉన్నాయి. యాక్సిలరోమీటర్, ఫింగర్ ప్రింట్, గైరో స్కోప్, జియోమెట్రిక్, ఆర్‌జీబి వంటి సెన్సార్స్ ఈ డివైస్‌లో ఉన్నాయి. అడ్వాన్సుడ్ S Pen సపోర్ట్‌ ఆప్షన్‌తో వస్తోన్న ఈ టాబ్లెట్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉపయోగించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Tab S3 with advanced S Pen and 6000mAh battery launched for Rs.47,990. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X