న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్‌కు సంబంధించి వివిధ కంపెనీలకు మంజూరుచేసిన 122 టెలికాం లైసెన్స్‌లను సుప్రీం కోర్టు రద్దుచేయడం ఇతర రంగాలపై ప్రభావం చూపుతుందని టెలికాం మంత్రి కపిల్ సిబల్ అన్నారు. ఇటువంటి నియమనిబంధనలే అమలులో ఉన్న మైనింగ్ వంటి కొన్ని సెక్టార్లపై తీర్పు ప్రభావం తీవ్రంగా ఉండగలదని ఆయన ఇక్కడ ఒక వార్తాసంస్థతో చెప్పారు. కోర్టు తీర్పు టెలికాంకే పరిమితం కాకుండా ఇతర సెక్టార్లపై ప్రభావం చూపుతుందని పదేపదే చెబుతూనే ఉన్నానని అన్నారు. అరుదైన జాతీయ వనరులను ప్రైవేట్ రంగానికి అప్పగించేప్పుడు వేలం పద్ధతిని పాటించాలని, టెలికామ్ కేసులో తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.













