మాల్వేర్‌ని అడ్డుకునే శక్తివంతమైన యాప్‌లు ఈ రెండే..

స్మార్ట్ ఫోన్లు వాడకం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అంతే స్థాయిలో దానితో అనేక చిక్కులు వచ్చి పడుతున్నాయి.


స్మార్ట్ ఫోన్లు వాడకం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అంతే స్థాయిలో దానితో అనేక చిక్కులు వచ్చి పడుతున్నాయి. డిజిటల్ ప్రపంచంతో అనుసంధానమైన మొబైల్స్ ను రోజువారీ నిత్యావసరాల కోసం ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత పనులకు, బ్యాకింగ్ అవసరాలకు ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. అదే సంధర్భంలో హ్యాకింగ్ కూడా పెద్ద తలనొప్పిగా మారింది. హ్యాకర్లు మాల్ వేర్లను మొబైల్ లోకి ప్రవేశపెట్టి మన డేటా మొత్తాన్ని స్వాహా చేస్తున్నారు. ఏకంగా బ్యాంకుల్లో ఉన్న మొత్తాన్ని దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రీసెర్చర్లు ప్రత్యామ్నాయాల మీద దృష్టి పెట్టగా వారికి రెండు యాప్ప్ వీటిని సమర్థవంతంగా ఎదుర్కుంటున్నట్లు తేల్చారు.

Advertisement

30 గాడ్జెట్లు అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోండి

ట్రెండ్ మైక్రో

ఈ సెక్యూరిటీ సంస్థ మాల్వేర్ భారీన పడకుండా మన మొబైల్స్ ని రక్షించే రెండు రకాల యాప్స్ ని గుర్తించింది. మాల్వేర్స్ మన మొబైల్స్ లోకి ప్రవేశపెట్టాలనుకున్న సమయంలో ఈ రెండు యాప్స్ వాటికి కొన్ని ప్రశ్నలు సంధిస్తాయట. అవి సరిగ్గా చెప్పగలిగితేనే వాటిని లోపలికి అనుమతిస్తాయని ఈ సెక్యూరిటీ సంస్థ అధినేతలు చెబుతున్నారు.

Advertisement
రెండు యాప్స్

Currency Converter", "BatterySaverMobi" ఈ రెండు యాప్స్ మీ మొబైల్ హ్యాకింగ్ భారీన పడకుండా సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయని వారు చెప్పారు. motion sensor information ద్వారా మాల్వేర్ ని మన ఫోన్లలోకి జొరపడకుండా ఈ యాప్స్ అడ్డుకుంటాయని తెలిపారు.

Trojanపై ప్రయోగం

వారు కొన్ని రకాల యాప్స్ మీద ఈ రకమైన ప్రయోగాలు చేస్తే అవి విజవంతమయ్యాయి. గేమ్స్ యాప్స్ కాని మరేవైనా కాని డౌన్లోడ్ చేసుకోవడం లేదా అప్ గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఈ రెండు యాప్స్ సెక్యూరిటీ ప్రశ్నలను సంధిస్తాయి. తద్వారా మీరు అలర్ట్ అవ్వవచ్చు.

బ్యాకింగ్ సేఫ్

ఈ రెండు యాప్స ద్వారా బ్యాంకిగ్ సమాచారం చాలా సేఫ్ గా ఉంటుంది. మనకు తెలియకుండానే మన బ్యాంకుల్లో ఉన్న డబ్బును మాల్వేర్ ద్వారా హ్యాకర్లు దోచుకున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రెండు యాప్స్ ఆ మాల్వేర్స్ ని సమర్థవంతంగా అడుకుంటున్నాయి.

పాస్ వర్డ్ అండ్ లాగిన్

ఎవరైనా మీ ప్రమోయం లేకుండా మీ అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలనుకుంటే వారికి వెంటనే సెక్యూరిటీ ప్రశ్నలు సంధిస్తుంది. ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోతే వెంటనే బ్లాక్ చేస్తుంది. దీన్ని మొబైల్ కి ఎస్మెమ్మెస్ రూపంలో అందిస్తుంది. కాబట్టి వినియోగదారుడు కొంచెం అలర్ట్ అయ్యే అవకాశం ఉంది.

Best Mobiles in India

English Summary

Android smartphone users, these two apps steal your banking data when you move your phone.To Know More About Visit telugu.gizbot.com