డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లో PhonePe రికార్డ్


ఫోన్‌పేను ఉపయోగించి ఇప్పుడు వినియోగదారులు తమకు నచ్చిన ఆహారాన్ని పొందడానికి, కిరాణా దుకాణాలలో కొనుగోలు చేయడానికి, ఏదైనా షాపింగ్ చేయడానికి మరియు ట్రావెల్ యాప్ లలో టికెట్ లను బుక్ చేయడానికి ఫోన్‌పే యాప్ లో ఒకే ఒక ట్యాప్‌తో త్వరగా మనీని పంపడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

Advertisement

ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లో ఫోన్‌పే ఈ ఏడాది తన యాప్‌లో ఐదు బిలియన్ లావాదేవీలను దాటిందని శుక్రవారం ప్రకటించింది. ఫోన్‌పే గత ఏడాది నవంబర్‌లో ఒక బిలియన్ లావాదేవీల మైలురాయిని దాటిందని బెంగళూరులోని ప్రధాన కార్యాలయం ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే కేవలం ఒక సంవత్సరంలోనే ఐదు రెట్లు లావాదేవీలు పెరిగినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

 

కనీస రీఛార్జ్ విధానాన్ని కొనసాగిస్తున్న టెల్కోలు

Advertisement

"గత 4 సంవత్సరాలుగా ఇండియాలో ఫోన్‌పే యొక్క ప్రయాణం కొనసాగుతున్నది. ఇది ప్రజల యొక్క ఆదరణను మరియు నమ్మకాన్ని పూర్తి స్థాయిలో చొరగొన్నది. ఇది వేదిక యొక్క వృద్ధి పరంగానే కాకుండా పెమెంట్స్ మరియు ఆర్థిక సేవలను సృష్టించగల సామాజిక ప్రభావాన్ని గ్రహించడంలో కూడా వృద్ధి చెందింది" అని ఫోన్‌పే వ్యవస్థాపకుడు మరియు CEO సమీర్ నిగం అన్నారు.

 

నకిలీ ఐఫోన్ ను పంపిణి చేసిన ఫ్లిప్‌కార్ట్‌.. అది కూడా బెంగళూరులో

డిజిటల్ పెమెంట్స్ ప్లాట్ ఫార్మ్ అయిన ఫోన్‌పేలో నమోదు చేసుకున్న చందాదారుల సంఖ్య ఇండియాలో సుమారు 175 మిలియన్లకు పైగా ఉంది.

భారతదేశంలోని 215 కి పైగా నగరాల్లో 80 లక్షల MSMEలలో ఫోన్‌పే చెల్లింపు ఎంపికగా అంగీకరించబడింది. అంతేకాకుండా ఇప్పుడు దాని లావాదేవీలలో 56 శాతానికి పైగా టైర్ II మరియు III నగరాల్లోని వినియోగదారులు ఉపయోగిస్తున్నారు.

ఈ సంవత్సరం ఫోన్‌పే తన ప్లాట్‌ఫామ్‌లో కస్టమర్ యొక్క అనుభవాన్ని 'స్విచ్' తో సహా మరింత సౌకర్యవంతంగా చేయడానికి కొత్త వినియోగ కేసులను ప్రవేశపెట్టింది. ఇది అనేక యాప్ లను డౌన్‌లోడ్ చేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది.

ఫోన్‌పే యొక్క డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సుమారు 150 మిలియన్లకు పైగా బ్యాంకు అకౌంట్ లు లింక్ చేయబడి ఉన్నాయి. అలాగే ఫోన్‌పే తన ప్లాట్‌ఫామ్‌లో సుమారు 56 మిలియన్లకు పైగా క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను సేవ్ చేయబడి ఉంది.

Best Mobiles in India

English Summary

PhonePe Surpasses 5 Billions Transactions in 2019, Claims An Official